8 Vasantalu Trailer: ఆడవాళ్ల ప్రేమకు సాక్ష్యాలు.. మనసులో సమాధి చేసుకున్న జ్ఞాపకాలే.. - ఆసక్తికరంగా '8 వసంతాలు' ట్రైలర్
8 Vasantalu: హీరోయిన్ అనంతిక సానిల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ '8 వసంతాలు' ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఆకట్టుకునే డైలాగ్స్, ఆద్యంతం ఎమోషన్స్‌తో హైప్ క్రియేట్ చేస్తోంది.

Ananthika Sanilkumar Trailer Released: అనంతిక సానిల్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ '8 వసంతాలు'. ఈ మూవీ ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తుండగా.. హనురెడ్డి, కన్న పసునూరి, రవితేజ దుగ్గిరా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్, ఫస్ట్ లుక్స్ ఆకట్టుకోగా.. తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఆసక్తికరంగా ట్రైలర్
మనసును హత్తుకునే డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. '8 ఏళ్ల స్త్రీ ఆనందం, కన్నీళ్లు, పాఠాలు.. సిల్వర్ స్క్రీన్స్‌పై ఆమె ప్రయాణాన్ని వీక్షించండి.' అంటూ సోషల్ మీడియా వేదికగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది. 'ఆడవాళ్లు నిప్పు పట్టకూడదు. అంత్యక్రియలు, కర్మకాండలకు వారు పనికి రారు.' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం కాగా.. 'పేగు పంచి ప్రాణం పోయగలిగిన వాళ్లం. చితి ముట్టించి మోక్షం ఇప్పించలేమా' అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్ ఎమోషన్‌కు గురి చేస్తోంది. ఈ మూవీలో ఆమె మార్షల్ ఆర్ట్ ఎక్స్‌పర్ట్‌గా కనిపించనున్నట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది.
'ప్రేమ జీవితంలో ఓ దశ మాత్రమే. అదే దిశ కాదు.', 'మగాడి ప్రేమకు సాక్ష్యాలుగా పాలరాతి సౌధాలు, భాగ్యనగరాలు ఉన్నాయి. ఆడదాని ప్రేమకు ఏముంది. మనసులోనే సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్ప.' అనే డైలాగ్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
8 years of a woman's joy, tears and lessons. Witness her journey on the big screens ✨#8VasantaluTrailer out now ❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) June 15, 2025
▶️ https://t.co/pafCjIEa2D#8Vasantalu grand release worldwide on June 20th.
Directed by #PhanindraNarsetti
Produced by @MythriOfficial
Starring… pic.twitter.com/8C5x3Noi8V
Also Read: ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీ నుంచి బిగ్ సర్‌ప్రైజ్ - టీజర్ గ్లింప్స్.. రెబల్ వైబ్ కోసం వెయిటింగ్





















