ఒక్క సీన్ కోసం అమీర్ ఖాన్‌ను రోజంతా ముద్దుపెట్టుకోవలసి వచ్చింది, బాలీవుడ్ నటి షాకింగ్ వ్యాఖ్యలు
ఒకటి బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ నవనీత్ నిషాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ తో కలిసి నటించిన 'హమ్ హై రహి ప్యార్ కే' సినిమా అనుభవాలను పంచుకున్నారు.
ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ నవనీత్ నిసాన్ తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ తో కలిసి తాను నటించిన 'హమ్ హై రహి ప్యార్ కే' సినిమా అనుభవాలను పంచుకున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం 1993 లో విడుదలైంది. అమీర్ ఖాన్, జూహీ చావ్లా హీరో, హీరోయిన్స్ గా నటించగా నవనీత్ నిషాన్ సినిమాలో వ్యాపారవేత్త బిజ్లాని కుమార్తె 'మాయ' అనే పాత్ర పోషించింది. సినిమాలో ఆమె అమీర్ ఖాన్ ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. సరిగ్గా 30 ఏళ్ల కింద వచ్చిన ఈ సినిమా అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు నవనీత్.
" సినిమా షూటింగ్స్ సమయంలో నేను అమీర్ ఖాన్, జూహీ చావ్లా, మహేష్ భట్ లాంటి బిగ్ స్టార్స్ తో సెట్స్ లో ఉన్నప్పుడు కాస్త భయపడ్డాను. సెట్లో ముగ్గురు స్టార్స్ తో పాటు మరికొంతమంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళని చూసి అసలు నేను ఎక్కడికి వచ్చాను అని అనిపించేది. ఇలాంటి ఒక బిగ్ స్టార్స్ ఉన్న పెద్ద సినిమాలో అవకాశం రావడం నేను అసలు నమ్మలేకపోయాను. నా కెరియర్లో మొట్టమొదటి సంతోషకరమైన అనుభవాల్లో ఇది కూడా ఒకటని" ఆమె పేర్కొంది.
ఇక తర్వాత ఆమీర్ ఖాన్ గురించి మాట్లాడుతూ.." సెట్స్ లో ఆయన చాలా సైలెంట్ గా , కొంటెగా ఉండే వారని చెప్పింది. ఈ సినిమాలో ఓ బ్యూటిఫుల్ సీన్ ని ఎడిటింగ్ లో తీసేసారు. సినిమాలో మా నిశ్చితార్థం జరిగిన తర్వాత నేను అమీర్ ఇంటికి వెళ్లి అతన్ని పికప్ చేసుకొని అతని చెంప మీద ముద్దు పెడతాను. ముద్దు పెట్టుకున్నప్పుడు అతని చెంపపై లిప్ స్టిక్ గుర్తు అలాగే ఉంది. ఆ తర్వాత అమీర్ ఖాన్ గారు ఇది కంటిన్యూటీ లో ఉండాలి అని అన్నారు. దాంతో రోజంతా ఆయన్ని 7 నుంచి 8సార్లు ముద్దు పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను ఒక రోజంతా అమీర్ ఖాన్ ను ముద్దు పెట్టుకున్నారని నా ఫ్రెండ్స్ కి చెప్పాను అంటూ నవ్వుకుంది".
ఇక ఆ తర్వాత సినిమాలో పిల్లలు తనపై కోడిగుడ్లు విసిరే మరో సన్నివేశం గురించి కూడా మాట్లాడింది.. "ఆ సన్నివేశం చేసేటప్పుడు కోడిగుడ్లు గట్టిగా తగులుతాయి అని గ్రహించి అమీర్ ఖాన్ వాటిని విసిరే ముందు తగినంతగా పగలగొట్టేలా చూసుకున్నాడు. అవి విసిరినప్పుడు పెద్దగా తగలకుండా జాగ్రత్త పడ్డాం. షాట్ స్టార్ట్ అయిన తర్వాత మాపై కోడిగుడ్లు విసురుతూనే ఉన్నారు. అసలు ఆపడం లేదు. నేను శాకాహారిని. కాబట్టి ఆ గుడ్ల వాసనను భరించలేకపోయాను. నా తల నుంచి కాళ్ల వరకు అంతా ఆ కోడి గుడ్లే ఉన్నాయి. దేవుడి దయవల్ల ఆ సీన్ చేసేటప్పుడు నేను విగ్గును ధరించాను. దానివల్ల నా జుట్టుకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు" అంటూ చెప్పుకొచ్చారు నవనీత్ నిసాన్. కాగా 1993 జులై 5 న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మహేష్ బట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాహిర్ హుస్సేన్ నిర్మాతగా వ్యవహరించగా.. ఈ చిత్రానికి నదీమ్ శ్రవణ్ సంగీతం అందించారు. కాగా ఈ సినిమాతో జుహీ చావ్లా బెస్ట్ హీరోయిన్గా ఫిలింఫేర్ అవార్డుని అందుకున్నారు. అలాగే ఈ చిత్రానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.
Also Read : 'బేబీ' నటికి రేప్, హత్య బెదిరింపులు - సంచలన విషయాలు బయటపెట్టిన సీత!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial