Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం
గరికపాటి నరసింహా రావు (Garikapati Narasimha Rao) పై మెగాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
![Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం Chiranjeevi Vs Garikapati Mega Fans Demands Apologize From Garikapati Over Alai Balai Issue Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/07/090ad84dccbb6feda27568151acafae81665114160796313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహా రావు (Garikapati Narasimha Rao) పై మెగా అభిమానులు మండి పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే గరికపాటి ప్రవచనాలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ ఫైర్ అవడానికి కారణం ఏంటి? అంటే... గురువారం ఏం జరిగిందో తెలుసుకోవాలి.
'అలయ్ బలయ్'లో
గరికపాటి ఆగ్రహం!
భారతీయ జనతా పార్టీ నాయకుడు, ప్రస్తుతం హరియాణా రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) ప్రతి ఏడాది 'అలయ్ బలయ్' కార్యక్రమాన్ని (Alai Balai Event) నిర్వహిస్తూ ఉంటారు.
నిన్న (గురువారం) హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 'అలయ్ బలయ్'కు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి గరికపాటిని కూడా ఆహ్వానించారు. అయితే... గరికపాటి మైక్ తీసుకుని మాట్లాడానికి ప్రయత్నించిన సమయంలో చిరంజీవితో ఫోటోలు దిగడానికి చాలా మంది మహిళలు, యువతులు స్టేజి మీదకు వచ్చారు. వేదికగా ఒక్కసారిగా జనాలు ఎక్కువ అయ్యారు. దాంతో ఒకింత హడావిడి నెలకొంది. ప్రతి ఒక్కరి దృష్టి చిరంజీవిపై ఉంది. గరికపాటి మాటలను ఎవరూ పట్టించుకునే స్థితి లేదు. దాంతో ఆయన అసహనానికి గురి అయ్యారు. చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫోటో సెషన్ ఆపకపోతే...
నేను వెళ్ళిపోతా! - గరికపాటి
''ఫోటో సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతానండీ! లేకపోతే నేను వెళ్ళిపోతాను. నాకు ఏమీ మొహమాటం లేదు. అక్కడ ఆపేయాలి. చిరంజీవి గారూ... దయచేసి మీరు ఆపేసి ఇటు పక్కకి రండి. నేను మాట్లాడతాను. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి... ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడికి రావాలి. లేకపోతే నాకు సెలవు ఇప్పించండి'' - గరికపాటి కొంచెం గట్టిగానే మైకులో చెప్పారు. ఆయన మాటల్లో ఆగ్రహం ధ్వనించింది. దాంతో నిర్వాహకులు గరికపాటికి సర్దిచెప్పారు.
గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేసిన కాసేపటికి చిరంజీవి అటుగా వెళ్లారు. ఆ తర్వాత ఆయన శాంతించారు. తన ప్రసంగాన్ని కొనసాగించారు. గరికపాటి వద్దకు వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి ఆయనను పలకరించారు. పక్కన కూర్చుని ప్రసంగాన్ని ఆలకించారు.
Also Read : Godfather Box Office : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?
గరికపాటి కాదు...
గరిగిపాటి అంటున్నారు!
సినిమా హీరోలు ఎక్కడికి వెళ్లినా ఫోటోలు దిగడానికి అభిమానులు ఎగబడటం సహజమే. కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పటికీ.. హీరోలు ఒప్పిగ్గా ఫోటోలు ఇస్తుంటారు. లేదంటే వాళ్ళను ట్రోల్ చేస్తారు. ఫోటోలు ఇస్తున్నందుకు గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయనపై మెగా ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఆయనకు 'గిరిగిపాటి' అని పేరు పెట్టారు. ఆయన ప్రవచనాలను అడ్డుకుంటామనే ఫోటో కార్డు ఒకటి వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది.
గరికపాటిపై మెగా బ్రదర్ నాగబాబు సెటైర్!
'అలయ్ బలయ్' కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై అసహనం వ్యక్తం చేసిన గరికపాటి నరసింహా రావుపై మెగా బ్రదర్ నాగబాబు సెటైర్ వేశారు. ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారని జనాలు భావిస్తున్నారు. ''ఏ పాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే'' అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ప్రముఖ ప్రవచనకర్తను ఉద్దేశించి చేసినదేనని భావిస్తున్నారు. చిరంజీవిపై సీరియస్ అయిన గరికపాటిని ఉద్దేశించి నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ జోరుగా సాగుతోంది. అన్నయ్యపై చేసిన వ్యాఖ్యలకు ఆయన హార్ట్ అయ్యారట.
Also Read : Chiranjeevi: వేలెత్తి చూపిస్తూ, రక్తం అమ్ముకొని బతుకుతున్నానన్నారు - చిరు ఎమోషనల్ కామెంట్స్!
ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే ..
— Naga Babu Konidela (@NagaBabuOffl) October 6, 2022
కోహినూర్ డైమండ్ కూడా కొన్నిసార్లు polish తగ్గితే మెరుపు తగ్గొచ్చు కానీ దాని వేల్యూ ఎప్పుడు తగ్గదు .సరైన polish (గాడ్ ఫాదర్ )పడితే కోహినూర్ డైమండ్ మిరుమిట్లు కొలిపే వెలుగు ని తట్టుకోవటం కష్టం.
— Naga Babu Konidela (@NagaBabuOffl) October 6, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)