అన్వేషించండి

Chiranjeevi X Ravi Teja : రేపే 'పూనకాలు లోడింగ్' సాంగ్ - మెగాస్టార్ & మాస్ మహారాజా స్టెప్పేస్తే

Poonakalu Loading Song : మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి స్టెప్పేస్తే? 'పూనకాలు లోడింగ్...' అని దర్శకుడు బాబీ కొల్లి అంటున్నారు. 'వాల్తేరు వీరయ్య'లో పాటను రేపు విడుదల చేయనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) డ్యాన్సులకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే, మాస్ మహారాజా రవితేజ (Ravi Teja)కు కూడా! మరి, వీళ్ళిద్దరూ కలిసి స్టెప్పేస్తే? ఎలా ఉంటుంది? రేపు చూడాల్సిందే మరి! దర్శకుడు బాబీ అయితే 'పూనకాలు లోడింగ్...' అని అంటున్నారు. 

చిరంజీవి కథానాయకుడిగా ఆయన వీరాభిమాని బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) తెరకెక్కిస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya). ఇప్పటి వరకు మూడు పాటలు విడుదల చేశారు. ఒకటి... 'బాస్ పార్టీ'. అది ఆడియన్స్‌లోకి బాగా వెళ్ళింది. రెండోది... 'నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి'. ఇది మెలోడియస్‌గా ఉంది. మూడోది టైటిల్ సాంగ్. ఇప్పుడు నాలుగో పాటను విడుదల చేయడానికి రెడీ అయ్యారు.

డిసెంబర్ 30న 'పూనకాలు లోడింగ్'
ఇప్పటి వరకు విడుదలైన 'వాల్తేరు వీరయ్య' పాటలు చిరంజీవి మీద పిక్చరైజ్ చేసినవి. ఇప్పుడు విడుదల చేయబోయేది మెగా మాస్ సాంగ్. చిరుతో పాటు రవితేజ మీద పాటను తెరకెక్కించారు. 'పూనకాలు లోడింగ్...' అంటూ సాగే ఈ పాటను ఎండ్ ఎండ్ ధమాకాగా డిసెంబర్ 30న... అనగా రేపు విడుదల చేయనున్నారు. రెండు రోజుల ముందే ప్రేక్షకులకు న్యూ ఇయర్ వస్తుందని చిత్ర బృందం పేర్కొంది. 

Also Read : 'బటర్ ఫ్లై' రివ్యూ : గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారినట్టు - అనుపమా పరమేశ్వరన్ సినిమా ఎలా ఉందంటే?

View this post on Instagram
 
A post shared by Mythri Movie Makers (@mythriofficial)

రొటీన్ కమర్షియల్... 
రాసుకోండి! కానీ... 
ఆల్రెడీ విడుదలైన 'వాల్తేరు వీరయ్య' టైటిల్ సాంగులో చిరంజీవి స్టిల్స్, 'గ్యాంగ్ లీడర్' రోజులను గుర్తు చేశాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే... సినిమా రెడీ అయ్యింది. చిరంజీవి చూశారు కూడా! రొటీన్ సినిమాలా ఉందని అంటున్న ప్రేక్షకులకు కూడా ఆయన సమాధానం ఇచ్చారు. ''రాసుకోండి, ఇది రొటీన్ సినిమానే. కానీ, లోపల వేరుగా ఉంటుంది'' అని చిరు చెప్పుకొచ్చారు. చిరంజీవి సరసన శృతి హాసన్ నటించిన ఈ సినిమాలో రవితేజకు జోడీగా కేథరిన్ కనిపించనున్నారు.
   
విశాఖలో ప్రీ రిలీజ్ ఫంక్షన్
సంక్రాంతి కానుకగా జనవరి 13న 'వాల్తేరు వీరయ్య' చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. జనవరి 8న విశాఖలో 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఫంక్షన్ (Waltair Veerayya Pre Release Function) నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. విశాఖలో ఫంక్షన్ అని చిరు కూడా కన్ఫర్మ్ చేశారు. మెగా ఫ్యాన్స్ కోసం సికింద్రాబాద్ నుంచి విశాఖకు స్పెషల్ ట్రైన్ వేయాలని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆలోచిస్తోందని తెలిసింది. భారీ ఎత్తున ఫంక్షన్ చేయాలని ప్లాన్ చేశారట.

Also Read : మెగాస్టార్ చిరంజీవిలో నటుడ్ని, నటనలో షేడ్స్ అన్నీ ఒక్క వీడియోలో చూపించిన కృష్ణవంశీ

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. చిత్ర దర్శకుడు బాబీ కథ, మాటలు రాయగా... స్క్రీన్‌ప్లే : కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అందిస్తున్నారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్‌ దేవరమానె, ప్రొడక్షన్‌ డిజైనర్: ఎఎస్‌ ప్రకాష్‌, కాస్ట్యూమ్ డిజైనర్: సుష్మిత కొణిదెల, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Embed widget