23 ఏళ్ల శ్రమ ఫలితం.. తాజ్‌మహాల్‌ను తలపించే భవంతిని కట్టిన విలక్షణ నటుడు

బాలీవుడ్‌లో ఒక సహ నటుడు టాప్ హీరోలతో సమాన హోదా పొందాడమంటే మాటలు కాదు. అది నవాజుద్దీన్ సిద్ధిఖీకే సాధ్యమైందని చెప్పుకోవచ్చు.

FOLLOW US: 

తడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ప్రాధాన్యం ఉన్న పాత్రలోకి తీసుకోవాలంటే భయపడేవారు. నటీ నటుల వారసులకే పెద్ద పీఠం వేసే బాలీవుడ్‌లో నెట్టుకు రావడం అంటే అంత సులభం కాదు. నెపొటిజాన్ని తట్టుకోలేక చాలామంది నటీనటులు కనుమరుగయ్యారు. కానీ, నవాజుద్దీన్ సిద్ధిక్ మాత్రం.. ప్రతికూల పరిస్థితులకు ఎదురీదుతూ.. కేవలం తన ప్రతిభతోనే గుర్తింపు పొందాడు. ఇప్పుడు బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా ప్రజాభిమానం పొందాడు. పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసే నావాజుద్దీన్.. ఈ స్థాయికి చేరడానికి దాదాపు 23 ఏళ్లు పట్టింది. 

2015లో ‘భజరంగీ భాయ్‌జాన్’ సినిమాలో జర్నలిస్టుగా కనిపించిన నవాజుద్దీన్ ఆ తర్వాత మళ్లీ వెనుతిరిగి చూడలేదు. ‘మాంజీ’ వంటి ప్రయోగాత్మక చిత్రాలతోపాటు బాల్ థాకరే వంటి మహా నాయకుడి బయోపిక్ (థాకరే) చిత్రాల వరకు ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి నటించాడు. ప్రస్తుతం నవాజుద్దీన్ నటించిన ‘రాత్ అకేలీ హై’, ‘సీరియస్ మ్యాన్’ చిత్రాలు ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఇవి కాకుండా మరో ఆరు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇటీవల నవాజుద్దీన్.. ముంబయిలో నిర్మించిన తన కొత్త ఇంటికి ‘నవాబ్’ అని పేరు పెట్టాడు. తన తండ్రి న‌వాబుద్దిన్ సిద్ధిఖికి గుర్తుగా ఈ పేరును పెట్టినట్లు తెలిసింది. శ్వేత వర్ణంలో తాజ్ మహాల్‌ను తలపించే ఈ భవంతిని చూసి అంతా నోరెళ్లబెడుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని బుధానా గ్రామంలో త‌న బాల్యాన్ని గ‌డిపిన ఇంటిని గుర్తుకు తెచ్చేలా ఈ కొత్త బంగ్లాను నిర్మించాడు. నవాజుద్దీన్ తాజాగా ఆ భవంతి ముందు లాన్‌లో కూర్చొని ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసి ఆయన అభిమానులు తెగ మురిసిపోతున్నారు. 1999లో జూనియర్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నవాజుద్దీన్.. 23 ఏళ్ల శ్రమకు ఫలితం ఈ భవంతి అని అంతా అంటున్నారు. 

View this post on Instagram
 
A post shared by Nawazuddin Siddiqui (@nawazuddin._siddiqui)

View this post on Instagram
 
A post shared by Nawazuddin Siddiqui (@nawazuddin._siddiqui)

Published at : 28 Jan 2022 02:12 PM (IST) Tags: Nawazuddin Siddiqui Nawazuddin Siddiqui House Nawazuddin Siddiqui Mumbai House Nawazuddin Siddiqui Movies నవాజుద్దీన్ సిద్ధికీ

సంబంధిత కథనాలు

Guppedantha Manasu జులై 7 ఎపిసోడ్:  క్లాస్ రూమ్ లో రిషి కోసం వసుధార తపస్సు, రిషి చూస్తుండగా క్లాస్ నుంచి పంపించేసిన జగతి

Guppedantha Manasu జులై 7 ఎపిసోడ్: క్లాస్ రూమ్ లో రిషి కోసం వసుధార తపస్సు, రిషి చూస్తుండగా క్లాస్ నుంచి పంపించేసిన జగతి

Devatha Serial July 7th Update: తన కన్నింగ్ ఆలోచనలు బయట పెట్టిన మాధవ, దేవిని స్కూల్ లో చేర్పించిన ఆదిత్య- మాధవ కుట్ర నుంచి రాధ ఎలా తప్పించుకుంటుంది?

Devatha Serial July 7th Update: తన కన్నింగ్ ఆలోచనలు బయట పెట్టిన మాధవ, దేవిని స్కూల్ లో చేర్పించిన ఆదిత్య- మాధవ కుట్ర నుంచి రాధ ఎలా తప్పించుకుంటుంది?

Ennenno Janmslabandham: వేద నిజాయితీని యష్ నిరూపించగలడా? అమ్మ కోసం తపిస్తున్న ఖుషి

Ennenno Janmslabandham: వేద నిజాయితీని యష్ నిరూపించగలడా? అమ్మ కోసం తపిస్తున్న ఖుషి

Karthika Deepam జులై 7 ఎపిసోడ్ 1398: డాక్టర్ సాబ్ తో పెళ్లిచేసే బాధ్యత నాదంటూ మళ్లీ మాటిచ్చిన హిమ, ఇకనైనా జ్వాల(శౌర్య) కోపం తగ్గుతుందా!

Karthika Deepam జులై 7 ఎపిసోడ్ 1398:  డాక్టర్ సాబ్ తో పెళ్లిచేసే బాధ్యత నాదంటూ  మళ్లీ మాటిచ్చిన హిమ, ఇకనైనా జ్వాల(శౌర్య) కోపం తగ్గుతుందా!

Vishnu Manchu : మోహన్ బాబు యూనివర్సిటీ కోసం భారీ స్కెచ్ వేసిన విష్ణు

Vishnu Manchu : మోహన్ బాబు యూనివర్సిటీ కోసం భారీ స్కెచ్ వేసిన విష్ణు

టాప్ స్టోరీస్

Weather Updates: నేడు ఈ 6 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ - మిగతా చోట్ల ఎల్లో అలర్ట్

Weather Updates: నేడు ఈ 6 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఆరెంజ్ అలర్ట్ జారీ - మిగతా చోట్ల ఎల్లో అలర్ట్

Ilaiyaraaja-Vijayendraprasad: రాజ్యసభకు నామినేట్ అయిన ఇళయరాజా, విజయేంద్రప్రసాద్, పీటీ ఉష!

Ilaiyaraaja-Vijayendraprasad: రాజ్యసభకు నామినేట్ అయిన ఇళయరాజా, విజయేంద్రప్రసాద్, పీటీ ఉష!

YSRCP Plenary Schedule: రేపే వైసీపీ ప్లీన‌రీ, అధికారంలోకొచ్చాక తొలిసారి - మొదటిరోజు కంప్లీట్ షెడ్యూల్ ఇదీ

YSRCP Plenary Schedule: రేపే వైసీపీ ప్లీన‌రీ, అధికారంలోకొచ్చాక తొలిసారి - మొదటిరోజు కంప్లీట్ షెడ్యూల్ ఇదీ

Karimnagar Bear: కరీంనగర్‌లో మళ్ళీ ఎలుగుబంటి దడ! సవాలుగా మారిన సమస్య, అధికారులు ఉరుకులు పరుకులు

Karimnagar Bear: కరీంనగర్‌లో మళ్ళీ ఎలుగుబంటి దడ! సవాలుగా మారిన సమస్య, అధికారులు ఉరుకులు పరుకులు