Blurr Movie Update: నిర్మాతగా తాప్సి.. తొలి సినిమా ‘బ్లర్’ షూటింగ్ పూర్తి, నైనిటాల్‌లో సంబరాలు

వరుస అవకాశాలతో బాలీవుడ్ లో తనకో స్పషల్ ఇమేజ్ సొంతం చేసుకున్నతాప్సీ పన్ను.. బ్లర్ మూవీతో చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ షూటింగ్ పూర్తైన సందర్భంగా మూవీ టీమ్ తో ఫొటోలకు ఫోజులిచ్చింది.

FOLLOW US: 

తాప్సీ గురించి ఒక్కమాటలో చెప్పుకోవాలంటే టాలీవుడ్ ఐరెన్ లెగ్..బాలీవుడ్ గోల్డెన్ లెగ్. మంచు మనోజ్‌తో ‘ ఝమ్మంది నాదం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తెల్లపిల్ల ప్రభాస్ తో కలసి నటించిన ‘మిస్టర్ పర్ ఫెక్ట్’  మినహా మిగిలిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. పైగా ఐరెన్ లెగ్ అనే ముద్ర పడడంతో బాలీవుడ్ కి ఎగిరిపోయింది. అక్కడ అడుగుపెట్టిన వేళా విశేషమో ఏమోకానీ పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఆమె కెరీర్ దూసుకుపోతోంది. తాప్సీ నటించిన ‘పింక్’ బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో అక్కడే తిష్టవేసింది. మరీ స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకోకపోయినా తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది. బీటౌన్‌లో క్రేజ్ వచ్చిన తర్వాత తెలుగులో కూడా ‘ఆనందోబ్రహ్మ’ సినిమాతో సక్సెస్ అందుకుంది. ఇప్పుడు కొత్తగా నిర్మాణ రంగంలోకి అడగుపెట్టిన తాప్సీ బ్లర్ మూవీకి నిర్మాతగా మారింది. ఆ సినిమా షూటింగ్ పూరికావడంతో నైనిటాల్ లో మూవీ యూనిట్‌తో ఫొటోలకు ఫోజులిచ్చింది. ి

సైకలాజికల్ థ్రిల్లర్ ‘బ్లర్’ సినిమాలో తాప్సీ పన్ను, గుల్షన్ దేవయ్య నటించారు. ఇది స్ట్రైట్ మూవీ కాదు 2010లో విడుదలైన 'జూలియాస్‌ ఐస్' అనే స్పానిష్ మూవీకి రీమేక్ ఇది. కథ విషయానికొస్తే త‌న సోద‌రి అనుమాన‌స్ప‌ద మృతి వెనుక ర‌హ‌స్యాన్ని ఛేదించే క్ర‌మంలో నెమ్మ‌దిగా త‌న చూపు కోల్పోయే ఓ మ‌హిళ క‌థ ఇది. దాదాపు రెండు గంటల పాటూ సాగే ఈ హార‌ర్ థ్రిల్ల‌ర్ అప్పట్లో ఆ జోనర్ ప్రేక్షకులని భలే ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమా ఏకంగా ఐదు భారతీయ భాషల్లో రూపొందుతోంది.

View this post on Instagram
 
A post shared by Taapsee Pannu (@taapsee)

తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌లో `బ్ల‌ర్` పేరుతో ఆమె స్వీయ నిర్మాణంలోనే హిందీ వెర్ష‌న్ తెర‌కెక్కుతోంది. మ‌రాఠీలో `సిద్ధు ఫ్ర‌మ్ సికాకుళం` ఫేమ్ మంజ‌రి ఫ‌డ్నీస్, రితేశ్ దేశ్ ముఖ్ ముఖ్య పాత్ర‌ల్లో `అదృశ్య‌` పేరుతో రూపుదిద్దుకుంటోంది. ఇక బెంగాలీలో రీతూప‌ర్ణ సేన్ గుప్తా మెయిన్ లీడ్ గా `అంత‌ర్ దృష్టి` టైటిల్‌తో రీమేక్ అవుతోంది.  త‌మిళంలో `ఉన్ పార్వైల్` పేరుతో షూటింగ్ జరుగుతోంది. అలాగే తెలుగులో `అగోచ‌ర` పేరుతో ఇషా చావ్లా, క‌మ‌ల్ కామ‌రాజు ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందుతున్న ఈ సినిమా స్పానిష్ మూవీకి రీమేక్ అని టాక్.

View this post on Instagram
 
A post shared by Taapsee Pannu (@taapsee)

మొత్తంమీద‌ 11 ఏళ్ళ నాటి స్పానిష్ హార‌ర్ థ్రిల్ల‌ర్ 'జూలియాస్ ఐస్‌' ఇప్పుడు ఏకంగా ఐదు భార‌తీయ భాష‌ల్లో రీమేక్ అవుతుండ‌డం విశేష‌మ‌నే చెప్పాలి. ఈ మధ్య అలా అన్ని భాషాల్లో రీమేక్ అయి సూపర్ హిట్టైన సినిమా ఏదంటే ‘దృశ్యం’ అని చెప్పాలి.  హిందీలో ఇప్పటికే షూటింగ్ పూర్తైన బ్లర్ మూవీ టీమ్ మొత్తం నైనిటాల్ లో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

Also Read: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘భిమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది, ఎప్పుడంటే..

Also Read: ఆడపిల్ల బయటకు వెళ్లాలంటే కావాల్సింది మగాడితోడు కాదు ధైర్యం..దుమ్ము దులిపేసిన ‘సీటీమార్’ ట్రైలర్

Also Read: మీకు అర్థమవుతోందా.. ‘శ్రీదేవి సోడా సెంటర్’ ప్రమోషన్లో ఆనంది అందుకే కనిపించలేదంట!

Also Read: ప్రశాంతంగా సెలవు తీసుకుని ఈ వెబ్ సిరీస్ చూడండి.. ఉద్యోగులకు ఓ ఐటీ కంపెనీ బంపరాఫర్..

Published at : 01 Sep 2021 12:16 PM (IST) Tags: Blurr Movie Update Heroin Taapsee Pannu Completes Shooting Her First Production Venture ‘Blurr’

సంబంధిత కథనాలు

Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్

Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్

Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు

Pavithra Lokesh: సహజీవనం ఏంటి? పవిత్ర నా భార్య - మాకు ఇద్దరు పిల్లలు

Raghava Lawrence: రాఘవ లారెన్స్ ఈవిల్ గెటప్ - 'రుద్రుడు' రిలీజ్ డేట్ ఫిక్స్

Raghava Lawrence: రాఘవ లారెన్స్ ఈవిల్ గెటప్ - 'రుద్రుడు' రిలీజ్ డేట్ ఫిక్స్

Satyadev: కొరటాల శివతో సత్యదేవ్ సినిమా - 'కృష్ణమ్మ' ఫస్ట్ లుక్

Satyadev: కొరటాల శివతో సత్యదేవ్ సినిమా - 'కృష్ణమ్మ' ఫస్ట్ లుక్

Prashanth Neel-Ramya: నరేష్ మూడో భార్యతో 'కేజీఎఫ్' డైరెక్టర్‌కు ఉన్న రిలేషన్ ఏంటి?

Prashanth Neel-Ramya: నరేష్ మూడో భార్యతో 'కేజీఎఫ్' డైరెక్టర్‌కు ఉన్న రిలేషన్ ఏంటి?

టాప్ స్టోరీస్

IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం

IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం

PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు

IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?

IND vs ENG 5th Test Day 3: ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన భారత్ - టీ సమయానికి స్కోరు ఎంతంటే?