అన్వేషించండి

Bigg Boss 8 Telugu: లూజర్ నీ వల్లే నాకు సమస్యలంటూ దూరమై బాంబ్ పేల్చిన ఆడపులి... నసగాడిలా మారిన నిఖిల్‌కు గడ్డి పెట్టిన యష్మి

బిగ్ బాస్ లవ్ బర్డ్స్ మధ్య సోనియా, నిఖిల్ మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఫుడ్ టాస్క్ లో కావాలనే ఓడిపోవడంతో చెప్పి మరీ సైడ్ అయిపోయింది సోనియా. కానీ నిఖిల్ ప్రవర్తన మాత్రం మరింత చికాకు పెడుతోంది.

బిగ్ బాస్ సీజన్ లో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఏమోగాని ఒక్కొక్క వారం ఒక్కొక్కరు తమ తీరుతో రోత పుట్టిస్తున్నారు. ఫస్ట్ వీక్ అంతా మణికంఠ ఏడుపుతోనే సరిపోతే, ఈ వీక్ మాత్రం నిఖిల్ నసగాడిలా తయారయ్యాడు. హౌస్ లో ప్రతి ఒక్కరి నోటి నుంచి నిఖిల్ ఇంత వీక్ గా అయ్యాడేంటి అని మాట వినిపించడమే కాకుండా బయట చూస్తున్న వాళ్లకు కూడా చిరాకు పుట్టించేలా చేస్తున్నాడు నిఖిల్ తన ప్రవర్తనతో. ఈ నేపథ్యంలోనే లవ్ బర్డ్స్ గా పేరు తెచ్చుకున్న నిఖిల్ సోనియా మధ్య వచ్చిన గ్యాప్ హాట్ టాపిక్ గా మారింది. 

లూజర్ తో మాట్లాడను 
నిఖిల్ ఫుడ్ టాస్క్ లో గెలిచే అవకాశం ఉన్నప్పటికీ అవతలి క్లాన్ గెలవాలనే ఉద్దేశంతోనే సరిగ్గా ఆడలేదు. అయితే ఇదే విషయాన్ని నిఖిల్ దగ్గర ప్రస్తావించిన సోనియా నువ్వు ఇలా బిహేవ్ చేయడం వల్లే ఎక్కడెక్కడ నుంచో కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఇలాగైతే నేను నీతో మాట్లాడను అని కుండబద్దలు కొట్టింది. అయితే సోనియా మాటలకు సమాధానంగా నిఖిల్ "నామినేనషన్ లలో నేనేం చేశానో దానికి ఇంకా నాకు గిల్డ్ ఉంది. నేను అక్కడ అందరితోను బేసిగ్గా ఫేక్ చేయట్లేదు. నువ్వు నాకు అభయ్, పృథ్వీ ముందు ఫేక్ చేయక్కర్లేదు. నేను సీరియస్ గా చెప్తున్నాను నువ్వు ఏమనుకున్నావో.. నీ గేమ్ నావల్ల ఇన్ డైరెక్ట్ గా లేదా డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతుందంటే నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్" అని చెప్పడంతో నైస్ అంటూ అక్కడి నుంచి సోనియా వెళ్ళిపోయింది. ఇక అక్కడ మొదలైంది నిఖిల్ మరింత డీలా పడడం. నిన్న చూపించిన ఎపిసోడ్ లో నైనిక దగ్గర కూడా ఇదే విషయాన్ని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో నైనిక నువ్వొక ఎమోషనల్ ఫూల్ అంటూ నవ్వింది. దీంతో నిఖిల్ ఇదంతా తన యంగ్ ఏజ్ లో మొదలైందని, బాధ్యతలు తీసుకోవడం ఇష్టమే అయినప్పటికీ తనను తాను కోల్పోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎమోషన్ ని చూపిస్తే ప్రాబ్లం, చూపించకపోతే యాటిట్యూడ్ అంటారు అంటూ తన గోడును నైనిక ముందు వెళ్లబోసుకున్నాడు. కానీ సోనియా మాత్రం మంచి చెప్పినా తీసుకోకపోతే నేను ఎందుకు మాట్లాడతాను అంటూ దూరంగా ఉంటోంది. 

Read Also: ఆడపులికి కాబోయే వాడు ఇన్ని లక్షణాలు ఉండాలట, అలాంటి వాడు అసలు భూమ్మీద ఉన్నాడా?

నిఖిల్ కు యశ్మి క్లాస్ 
నిఖిల్ తో అభయ్ మాట్లాడుతూ "ఎందుకు గేమ్ ని ఎమోషనల్ గా తీసుకుంటున్నావ్? బయట 11 ఏళ్ల ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పావు. అలాంటప్పుడు ఇక్కడ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు?" అని ప్రశ్నించినప్పుడు, తాను ఓడిపోయినందుకు హ్యాపీగా ఉన్నాను అంటూ ఏదో జీవితంలో అంతా త్యజించిన సన్యాసిలా మాట్లాడాడు. మొదటి వీక్ అంతా తెగ రెచ్చిపోయిన నిఖిల్ సడన్ గా అనవసరంగా పృథ్వీని నామినేట్ చేశాను అంటూ ఇలా సైలెంట్ అయిపోవడం, పైగా అందరితోను ఇలా చెప్పించుకోవడం చూస్తుంటే ప్రేక్షకులకు నిఖిల్ పై చిర్రెత్తుకొస్తుంది. ఇదంతా కావాలనే చేస్తున్నాడా లేదంటే నిజంగానే ఆయన గేమ్ సోనియా వల్ల పాడయిందా అనేది తెలీదు గానీ యశ్మి కూడా చెప్పి చూసింది. ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు? ఫన్, మైండ్ ఉపయోగించి గేమ్ ని ఆడు అంటూ ఎంతగానో చెప్పింది. నీ మీద బయట ఎంత మంది కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారో వాళ్లందర్నీ డిజప్పాయింట్ చేస్తున్నావు అంటూ చెప్పినప్పటికీ నిఖిల్ అదే విధంగా ఉంటూ వచ్చాడు.

Read Also: అమ్మో బేబక్క వాచ్ ధర అన్నీ కోట్లా!? ఏ ప్లానెట్ నుంచి తెచ్చిన మెటలో తెలిస్తే ఫ్యూజులు ఔట్

టాప్ హెడ్ లైన్స్

Jabardasth Varsha: బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర గ్లామర్ క్వీన్.. జబర్దస్త్ వర్ష రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్
Bigg Boss Telugu Season 10 : బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఫ్లేమ్ టూర్ - సామాన్యుడి నుంచి విన్నర్ వరకూ...
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget