అన్వేషించండి

Bigg Boss Season 7 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్ 7లో అయిదుగురి వైల్డ్ కార్డ్ ఎంట్రీ? ఈ ముగ్గురు కన్ఫర్మ్!

బిగ్ బాస్ సీజన్ 7లో నేడు ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో అయిదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లిస్ట్‌లో ఉన్నారని, అందులో ముగ్గురు కచ్చితంగా ఈరోజు హౌజ్‌లోకి వెళ్తారని సమాచారం.

బిగ్ బాస్ సీజన్ 7కు ఉల్టా పుల్టా అని పేరు ఎందుకు పెట్టారో ఆదివారం ఎపిసోడ్‌తో ఫుల్ క్లారిటీ రాబోతోంది. ఇంతకు ముందు సీజన్స్‌తో పోలిస్తే.. బిగ్ బాస్ సీజన్ 7 చాలా తక్కువమంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమయ్యింది. దీన్ని బట్టి చూస్తే ఇంకొక మూడు వారాల్లో ఈ సీజన్ ఫైనల్స్ వచ్చేస్తాయి. కానీ అలా జరగకుండా బిగ్ బాస్ ఒక సూపర్ ట్విస్ట్‌ను ప్లాన్ చేశారు. దానికి నాగార్జున.. ‘బిగ్ బాస్ సీజన్ 7’ 2.0 వర్షన్ అని పేరు కూడా పెట్టారు. ఇప్పటికే ఈ ట్విస్టుల ఎపిసోడ్‌కు సంబంధించి రెండు ప్రోమోలు విడుదలయ్యాయి. ఈ రెండు ప్రోమోలు కలిపి చూస్తే.. ఈసారి బిగ్ బాస్‌లోకి ఒకేసారి చాలామంది కంటెస్టెంట్స్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నట్టుగా అనిపిస్తోంది.

ఇప్పటికే బిగ్ బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వీరే అంటూ అయిదుగురి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారే నయని పావని, పూజా మూర్తి, అంబటి అర్జున్, అశ్విని శ్రీ, భోలే షావలి అని తెలుస్తోంది. ముందుగా వీరిలో నయని పావని ఎవరు అనేది చాలామందికి తెలుసు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే ఇన్‌ఫ్లుయెన్సర్‌లలో నయని కూడా ఒకరు. ఒకప్పుడు టిక్‌టాక్స్, ఆ తర్వాత కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్.. ఇలా పలు విధాలుగా ప్రేక్షకులను అలరించింది నయని పావని. ఈమధ్యకాలంలో ఎక్కువగా రీల్స్‌తో బిజీగా ఉంటోంది. అయితే ఈ సీజన్‌లో బిగ్ బాస్ హౌజ్‌లో లేడీ కంటెస్టెంట్స్‌లో ఒక్క ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఒకరు కూడా లేరు. ఇప్పుడు ఆ లోటు తీర్చడానికి నయని పావని ఎంట్రీ ఇస్తోంది.

పూజా మూర్తి

ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7లో చాలామంది సీరియల్ నటీనటులు ఉన్నారు. ఇప్పుడు పూజా మూర్తి కూడా ఆ లిస్ట్‌లో యాడ్ అవ్వనుంది. ‘గుండమ్మ కథ’ అనే సీరియల్ ద్వారా తెలుగులో పాపులారిటీ సంపాదించుకుంది పూజా. హీరోయిన్ అంటే సన్నగా ఉండాలి, జీరో సైజ్ నడుము ఉండాలి అనుకునేవారికి అలాంటివి లేకపోయినా టాలెంట్ ఉంటే చాలు అని నిరూపించిన వారిలో పూజా మూర్తి ఒకరు. అసలైతే పూజా మూర్తి.. బిగ్ బాస్ సీజన్ 7 మొదట్లోనే హౌజ్‌లో అడుగుపెట్టాల్సిందే. కానీ సరిగా బిగ్ బాస్ లాంచ్ అయ్యే సమయానికి తన తండ్రి మరణించారు. దీంతో పూజా మూర్తి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయిదు వారాల తర్వాత హౌజ్‌లోకి అడుగుపెడుతుందని సమాచారం.

అంబటి అర్జున్

పూజా మూర్తితో పాటు మరో సీరియల్ ఆర్టిస్ట్ కూడా బిగ్ బాస్ సీజన్ 7లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెడుతున్నట్టు సమాచారం. తనే అంబటి అర్జున్. సీరియల్ ఆర్టిస్ట్‌గా, డ్యాన్సర్‌గా, యాంకర్‌గా.. ఇలా తన మల్టీ టాలెంట్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఎప్పుడో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయ్యే అసలు అర్జున్ అంటే ఏంటి అని ప్రేక్షకులకు చూపించనున్నాడు. ప్రస్తుతం తన చేతిలో సీరియల్స్ ఉన్నా కూడా వాటిని కొన్నిరోజులు పక్కన పెట్టి బిగ్ బాస్ కమిట్ అవ్వాలని అనుకుంటున్నాడు అర్జున్. మరి ఈ సీరియల్ ఆర్టిస్టులకు బిగ్ బాస్ ఏ రేంజ్‌లో ఫేమ్ ఇస్తుందో చూడాలి.

అశ్విని శ్రీ

బిగ్ బాస్ సీజన్ 7లో నయని పావనితో పాటు మరో ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. తనే అశ్విని శ్రీ. ఇన్‌స్టాగ్రామ్‌లో తన హాట్ ఫోటోలతో ఫాలోవర్స్‌ను కట్టిపడేస్తుంది ఈ భామ. బిగ్ బాస్ సీజన్ 7లో ముద్దుగుమ్మగా పేరు తెచ్చుకున్న రతిక వెళ్లిపోయినందుకు అశ్విని శ్రీ వచ్చి ఆ లోటు తీరుస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. 

భోలే షావలి

ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్‌తో ఈమధ్యకాలంలో చాలామంది ఫేమస్ అయ్యారు. అందులో భోలే షావలి ఒకరు. తెలంగాణ పాటలతో ఫేమస్ అయిపోయి యూట్యూబ్‌లో లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 7లో భోలే షావలి ఎంట్రీ ఉంటుందని లాంచ్ ఎపిసోడ్ నుండే టాక్ వినిపిస్తుండగా.. ఫైనల్‌గా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో భోలే షావలి ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం.

Also Read: ‘బిగ్ బాస్‘ స్టేజిపై మాస్ మహారాజా సందడి, నాగార్జునతో కలిసి ‘టైగర్ నాగేశర్వరరావు‘ ప్రమోషన్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
Bigg Boss Telugu Grand Finale : బిగ్​బాస్​ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజివీ.. నిధి అగర్వాల్ రాకతో కళ్యాణ్​కు గాయం!
బిగ్​బాస్​ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజివీ.. నిధి అగర్వాల్ రాకతో కళ్యాణ్​కు గాయం!

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
Bigg Boss Telugu Grand Finale : బిగ్​బాస్​ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజివీ.. నిధి అగర్వాల్ రాకతో కళ్యాణ్​కు గాయం!
బిగ్​బాస్​ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజివీ.. నిధి అగర్వాల్ రాకతో కళ్యాణ్​కు గాయం!
Peddi Review : ఆ స్టోరీకి చికిిరీ గికిరీలు అవసరమా? - వారు తిన్న కంచంలో ఉమ్మేసినట్లే... రివ్యూయర్స్‌కు విశ్వక్ స్ట్రాంగ్ కౌంటర్
ఆ స్టోరీకి చికిిరీ గికిరీలు అవసరమా? - వారు తిన్న కంచంలో ఉమ్మేసినట్లే... రివ్యూయర్స్‌కు విశ్వక్ స్ట్రాంగ్ కౌంటర్
Hardik Pandya : తను కొట్టిన సిక్సర్‌ బంతి తగిలి గాయపడ్డ కెమెరామెన్‌ను పరామర్శించిన హార్దిక్ పాండ్యా!
తను కొట్టిన సిక్సర్‌ బంతి తగిలి గాయపడ్డ కెమెరామెన్‌ను పరామర్శించిన హార్దిక్ పాండ్యా!
Tamil Nadu Crime News: తండ్రిని పాముతో కరిపించి హత్య చేసిన కుమారులు! బీమా డబ్బులు, ప్రభుత్వ ఉద్యోగం కోసం దారుణం!
తండ్రిని పాముతో కరిపించి హత్య చేసిన కుమారులు! బీమా డబ్బులు, ప్రభుత్వ ఉద్యోగం కోసం దారుణం!
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Embed widget