అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bigg Boss Telugu 6: హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 'నువ్వు నాకు నచ్చావ్' బ్యూటీ!
బిగ్ బాస్ సీజన్ 6 కోసం రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 4 నుంచి ఈ షోని మొదలుపెట్టారు. ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ షోని హోస్ట్ చేసిన నాగార్జున ఇప్పుడు ఐదోసారి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు.
![Bigg Boss Telugu 6: హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 'నువ్వు నాకు నచ్చావ్' బ్యూటీ! Sudeepa Entry In Bigg Boss Telugu 6 Bigg Boss Telugu 6: హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 'నువ్వు నాకు నచ్చావ్' బ్యూటీ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/04/9bafef066b88b4fe22f58a94703b89a11662296183207205_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 'నువ్వు నాకు నచ్చావ్' బ్యూటీ!
బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్(Bigg Boss). అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ షోకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలానే ఈ ఏడాది ఓటీటీ వెర్షన్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. హాట్ స్టార్ లో 24 గంటల కాన్సెప్ట్ తో ఈ షోని నడిపించారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటీటీ వెర్షన్ క్లిక్ అవ్వలేదు.
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6 కోసం రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 4 నుంచి ఈ షోని మొదలుపెట్టారు. ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ షోని హోస్ట్ చేసిన నాగార్జున ఇప్పుడు ఐదోసారి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈసారి మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారు. ఆదివారం నాడు గ్రాండ్ గా షో మొదలైంది. ఇక కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరిగా నాగార్జున ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6 కోసం రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 4 నుంచి ఈ షోని మొదలుపెట్టారు. ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ షోని హోస్ట్ చేసిన నాగార్జున ఇప్పుడు ఐదోసారి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈసారి మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారు. ఆదివారం నాడు గ్రాండ్ గా షో మొదలైంది. ఇక కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరిగా నాగార్జున ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
రెండో కంటెస్టెంట్ గా 'నువ్వు నాకు నచ్చావ్' ఫేమ్ సుదీప ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో పింకీ క్యారెక్టర్ లో అందరినీ అలరించిన ఈమె ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా అలరించనుంది. చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ లో శిక్షణ తీసుకున్న ఈమె.. ప్రేమించిన పెళ్లి చేసుకుంది. ఆమెని స్టేజ్ పైకి పిలిచిన నాగార్జున కాసేపు ముచ్చట్లు చెప్పారు. సుదీపకి ఒక్కో ఎక్స్ప్రెషన్ చెబుతూ.. నాట్యం రూపంలో చేసి చూపించమని అడిగారు నాగార్జున. ఆమె ఎక్స్ ప్రెషన్స్ కి నాగ్ ఫిదా అయిపోయారు.
కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరినీ ఒక్కో కార్డు సెలెక్ట్ చేసుకోమని అడుగుతున్నారు నాగార్జున. పింకీ సెలెక్ట్ చేసుకున్న కార్డు బ్లాంక్ గా ఉంది. దానికి అర్ధం ఏంటో తరువాత చెబుతానని అన్నారు నాగార్జున.
ఇక ఈసారి అబ్బాయిల నెంబర్ కంటే అమ్మాయిలే ఎక్కువ మంది హౌస్ లో కనిపించబోతున్నారు. ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ ని చాలా కొత్తగా డిజైన్ చేశారు. మొత్తం 18 మంది పోటీదారులు కాబట్టి ఈసారి షో 100 రోజులకు పైగానే ఉండే ఛాన్స్ ఉంది. మధ్యలో డబుల్ ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి. ఇక టాస్క్ ల విషయానికొస్తే.. బిగ్ బాస్ హిందీ వెర్షన్ నుంచి కొన్ని టాస్క్ లను సీజన్ 6 కోసం తీసుకోబోతున్నారని సమాచారం. గత సీజన్లలో కూడా టాస్క్ లకు సంబంధించి ఇలానే చేశారు.
We welcome our 2nd contestant #Sudeepa to Bigg Boss house.#SudeepaOnBBTelugu#BiggBossTelugu6 #BBLiveOnHotstar@StarMaa @DisneyPlusHSTel pic.twitter.com/jeOw3sMUkr
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 4, 2022
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
న్యూస్
టెక్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion