Bigg Boss 7 Telugu: శోభాకు సపోర్ట్ చేస్తూ హౌజ్‌మేట్స్ నిర్ణయం - మద్దతు ఇచ్చినవారిపైనే మోనిత అరుపులు!
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో హౌజ్‌మేట్స్‌లోని మెజారిటీ మద్దతుతో ముందుగా శోభా శెట్టికి ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం దొరికింది. అయినా కూడా మద్దతు ఇచ్చినవారిపై శోభా అరవడం మొదలుపెట్టింది.
Telugu Bigg Boss 7: సీజన్ 7లో ఈ వారమంతా ఫన్ టాస్కులు ఉండబోతున్నాయని బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చారు. కాకపోతే టాస్కులు ఫన్నీగా ఉన్నా.. ఇందులో గెలిచిన వారికి ప్రేక్షకుల నుంచి ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. అయితే తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో రెండు ఫన్నీ టాస్కులు ముగిశాయి. అందులో ముందుగా జరిగిన పూల్ టాస్కులో రెండో రౌండ్‌కే శోభా ఓడిపోయి టాస్క్ నుంచి తప్పుకుంది. దీంతో తనకు అవకాశం పోయిందంటూ ఏడుపు మొదలుపెట్టింది. కానీ రెండో టాస్కులో మాత్రం పట్టుదలతో ఆడి గెలిచింది. దీంతో కంటెస్టెంట్స్ మెజారిటీ కలిసి తనకు మద్దతుగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తనకు అనుకూలంగానే ఉన్నా.. వారితో వాగ్వాదానికి దిగింది శోభా.
గెలిచిన శోభా..
పూల్ టాస్క్ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు కలర్స్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్కులో గార్డెన్ ఏరియాలో మూడు కలర్స్ ఏర్పాటు చేసుంటాయి. బిగ్ బాస్ సమయానుసారం ఏ కలర్ చెప్తారో.. హౌజ్‌మేట్స్ అంతా ఆ కలర్ లైన్‌లో నిలబడాలి. బిగ్ బాస్ కలర్స్ మారుస్తున్నప్పుడల్లా హౌజ్‌మేట్స్ కూడా దానికి అనుకూలంగా లైన్‌లో నిలబడాల్సి ఉంటుంది. పూల్ టాస్క్‌లో యావర్ విన్నర్‌గా నిలవడంతో కలర్స్ టాస్క్‌కు తనే సంచాలకుడిగా వ్యవహరించాడు. బిగ్ బాస్ వెంటవెంటనే కలర్స్ మారుస్తున్న సమయంలో అమర్ ఆ కలర్‌లో ఒక కాలు, ఈ కలర్‌లో ఒక కాలు పెడుతూ జరుగుతున్నాడు. అయితే అది ఫౌల్ అని సంచాలకుడిగా యావర్ చెప్పడంతో వారిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. చివరిగా హౌజ్‌మేట్స్ అంతా ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత శోభా, శివాజీ మిగిలారు. శివాజీ కూడా బ్యాలెన్స్ ఆపుకోలేక పక్కకు జరిగిపోయాడు. దీంతో రెండో ఫన్ టాస్కులో శోభా గెలిచి ఓటు అప్పీల్‌కు మరో ముందడుగు వేసింది.
సపోర్ట్ చేసినందుకు తిరిగి గొడవ..
మొదటి టాస్కులో యావర్, రెండు టాస్కులో శోభా గెలవడంతో ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఓటు అప్పీల్ చేసుకోగలరని, ఆ ఒక్కరు ఎవరు అనేది హౌజ్‌మేట్సే నిర్ణయించాలని బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. చివరివరకు వచ్చిన తర్వాత కూడా ఏంటి బిగ్ బాస్ ఇది అని శివాజీ వాపోయాడు. ముందుగా అర్జున్.. తాను శోభాకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పాడు. ఎందుకంటే గత రెండు వారాల్లో ఎలిమినేషన్ సమయంలో శోభా డేంజర్ జోన్‌లో ఉందని కారణం చెప్పాడు. ఆ తర్వాత ప్రశాంత్ మాట్లాడుతూ.. యావర్ తనకు ఫినాలే అస్త్ర టాస్కులో హెల్ప్ చేశాడు కాబట్టి ఇప్పుడు యావర్‌కే తన సపోర్ట్ అని తెలిపాడు. శివాజీ, అమర్.. తమ తమ ఫ్రెండ్స్‌కు సపోర్ట్ చేసుకున్నారు. ఇక ప్రియాంక కూడా శోభాకే సపోర్ట్ చేసినా.. యావర్ స్ట్రాంగ్ కాబట్టి తనకు మళ్లీ అవకాశం వస్తుందని కారణం చెప్పింది. ఆ కారణం శోభాకు నచ్చలేదు. అర్జున్, ప్రియాంక.. తనను వీక్ అనుకుంటున్నారని, తను ఆడలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారని, తను లాస్ట్‌లో లేనని వారిపైకి అరవడం మొదలుపెట్టింది. మొత్తానికి ఎక్కువమంది సపోర్ట్‌తో శోభాకే ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం లభించింది.
తప్పు చేసుంటే క్షమించండి..
‘‘మీరు నన్ను కార్తీకదీపంలో మోనితగా చూశారు. కానీ శోభా శెట్టి అంటే ఎవరో మీకు బిగ్ బాస్ ద్వారానే తెలిసింది. ఈరోజు నా ఫ్యామిలీ, నేను మూడు పూటలా భోజనం చేస్తున్నామంటే అది మీ వల్లే. బిగ్ బాస్ మొదటి సీజన్ నుంచి ఆరో సీజన్ వరకు ఒక అమ్మాయి కూడా ట్రోఫీ గెలవలేదు. నేను గెలవాలని అనుకుంటున్నాను. దాని వల్ల వచ్చే ప్రైజ్ మనీ నాకు చాలా చాలా ముఖ్యం. ఫ్యామిలీ అంతా అమ్మాయి యాక్ట్ చేస్తుంది అని నన్ను దూరం పెట్టినా.. మా అమ్మ మాత్రమే నాకు సపోర్ట్ చేసింది. ఈ బిగ్ బాస్ సీజన్‌లో నేనేమైనా తప్పు చేసుంటే క్షమించండి’’ అంటూ ఎమోషనల్ ఫీల్ అవుతూ ఓటు అప్పీల్ చేసుకుంది శోభా.
Also Read: ‘బిగ్ బాస్’లో ముద్దులు పెట్టుకున్న కంటెస్టెంట్స్, రాత్రయితే రచ్చే - తిట్టిపోస్తున్న జనం