అన్వేషించండి

Shobha Shetty: నాగార్జున నుంచి స్పెషల్ గిఫ్ట్‌ను అందుకున్న శోభా - తేజ కుల్లుకుంటాడు అంటూ కామెంట్స్

Shobha Shetty: బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా వచ్చిన శోభా శెట్టి.. ఆ షో హోస్ట్ అయిన నాగార్జున నుండి ఒక స్పెషల్ గిఫ్ట్‌ను అందుకుంది. అదేంటో తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Nagarjuna Special Gift to Shobha Shetty: బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా ఎంటర్ అయ్యింది సీరియల్ నటి శోభా శెట్టి. బిగ్ బాస్‌కంటే ముందే ‘కార్తీక దీపం’ సీరియల్‌గా మోనిత అనే విలన్ పాత్రలో నటించి శోభా పాపులారిటీ సంపాదించుకుంది. ఇక రియాలిటీ షోలోకి వచ్చిన తర్వాత అసలు ఆఫ్ స్క్రీన్ శోభా శెట్టి ఎలా ఉంటుంది అని చాలామందికి తెలిసింది. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా తనను ఇష్టపడినవారికంటే విమర్శించినవారే ఎక్కువ. కానీ అవేమీ పట్టించుకోకుండా ఈ రియాలిటీ షో అయిపోగానే.. తన రెగ్యులర్ యూట్యూబ్ ఛానెల్ వీడియోలతో బిజీ అయిపోయింది శోభా. తాజాగా తనకు నాగార్జున ఒక గిఫ్ట్ ఇచ్చారంటూ తన యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లకు సర్‌ప్రైజ్ ఇచ్చింది.

గుర్తుండిపోయే గిఫ్ట్‌

బిగ్ బాస్ సీజన్ 7లోని వీకెండ్ ఎపిసోడ్స్‌లో నాగార్జున ధరించే షర్ట్స్, టీ షర్ట్స్‌కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇవన్నీ మామూలుగా అందరూ రెగ్యులర్‌గా ధరించే దుస్తుల్లాగా కాకుండా కాస్త వెరైటీగా ఉండేవి. అదే విధంగా ఒకసారి వీకెండ్ ఎపిసోడ్‌కు ఒక బ్లాక్ కలర్ టీ షర్ట్‌ను వేసుకొని వచ్చారు నాగార్జున. అది చాలా వెరైటీగా ఉందంటూ.. బాగుందంటూ తనకు ఇవ్వమని కోరింది శోభా శెట్టి. ఇస్తానని నాగార్జున కూడా నవ్వి ఊరుకున్నారు. కానీ నిజంగానే నాగార్జున.. తనకోసం ఆ టీ షర్ట్‌ను పంపించారని తన యూట్యూబ్ వీడియోలో తెలిపింది శోభా శెట్టి. అంతే కాకుండా ఆ టీ షర్ట్‌తో ఫోటోషూట్ చేసి.. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ కూడా చేసింది. ‘ఈ గుర్తుండిపోయే గిఫ్ట్‌కు చాలా థ్యాంక్స్ నాగ్ సార్’ అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ కూడా పెట్టింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shobhashetty (@shobhashettyofficial)

స్వయంగా ఆయన చేతులతో ఇచ్చారు

‘‘నేను ఈ టీ షర్ట్‌ను ఆరో వారం లేదా ఏడో వారంలో అడిగాను. 14వ వారంలో నేను ఎలిమినేట్ అయిపోయి వచ్చేశాను. అయినా గుర్తుపెట్టుకొని నేను ఎలిమినేట్ అయిన రోజు నాగార్జుననే స్వయంగా ఈ టీ షర్ట్‌ను ఇచ్చారు. నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది అడిగిందే ఒక మెమోరీగా గుర్తుండిపోతుందని ఉద్దేశ్యంతో అడిగాను. బిగ్ బాస్‌లో నా బెస్ట్ మెమోరీ అంటే ఇదే. అందరూ నన్ను అడుగుతున్నారు సార్ మీకు టీ షర్ట్ ఇచ్చారా అని . అవును ఇచ్చారు’’ అంటూ తన సంతోషాన్ని యూట్యూబ్ వీడియోలో బయటపెట్టింది శోభా శెట్టి. తనతో పాటు టేస్టీ తేజకు కూడా టీ షర్ట్ నచ్చిందని, తనకు కావాలని అడిగాడని, కానీ తనకు సరిపోదని నేను తీసుకుంటానని చెప్పానని శోభా గుర్తుచేసుకుంది. అంతే కాకుండా తేజ కుల్లుకుంటాడని చెప్పింది.

ఫ్యాన్‌గా ఇంతకంటే ఏం కావాలి

‘‘టాలీవుడ్‌లో నాకు చాలా ఇష్టమైన హీరో నాగ్ సార్. ఆయనతో 14 వారాలు కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఫేవరెట్ స్టార్ పక్కన నిలబడి స్క్రీన్ షేర్ చేసుకోవడమే గొప్ప అంటే ఆయన వేసుకున్న టీ షర్ట్‌నే గిఫ్ట్‌గా తీసుకోవడం మరింత సంతోషం. ఒక ఫ్యాన్‌గా ఇంతకంటే ఏం కావాలి. ఇవ్వరేమో, బిజీలో మర్చిపోతారేమో అనుకున్నాను. కానీ గుర్తుపెట్టుకొని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్’’ అని నాగార్జున టీ షర్ట్‌తో తను చేసిన ఫోటోషూట్‌ను కూడా తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసింది శోభా శెట్టి. శోభా అడిగినట్టుగానే ఒకసారి తనకు కూడా టీ షర్ట్ ఇవ్వమని అడిగాడు అమర్‌దీప్. కానీ నాగ్.. ఆ విషయాన్ని పట్టించుకోకుండా వెళ్లి కూర్చో అన్నారు. ఆ తరువాత అమర్ అడిగిన టీ షర్ట్ ధర దాదాపు రూ.2 లక్షలకు పైగానే ఉంటుందని బయటపడింది.

Also Read: అమ్మాయిని అలా టచ్ చేస్తావా? ధనుష్ మూవీ ఈవెంట్‌లో ఆకతాయిని చితకబాదిన యాంకర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగంఅడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Crime News: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం- బీటెక్ స్టూడెంట్, వివాహిత అఫైర్-  భార్య ఎదుటే ప్రియుడ్ని చితక్కొట్టారు!
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం- బీటెక్ స్టూడెంట్, వివాహిత అఫైర్- భార్య ఎదుటే ప్రియుడ్ని చితక్కొట్టారు!
Embed widget