Bigg Boss OTT 3: 'బిగ్ బాస్' హౌస్‌లో ముదిరిన గొడవ - చివరికి కుర్చీతో కొట్టుకొనేంత వరకు వెళ్లిన కంటెస్టెంట్స్, అసలు ఏమైంది?
Bigg Boss OTT 3: కొన్నిరోజుల క్రితం ప్రారంభమయిన బిగ్ బాస్ ఓటీటీ 3లో అప్పుడే కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర మనస్పర్థలు మొదలయ్యాయి. తాజాగా ఇద్దరి కంటెస్టెంట్స్ మధ్య జరిగిన గొడవ.. కొట్టుకోవడం వరకు వెళ్లింది.
Bigg Boss OTT 3: బిగ్ బాస్ రియాలిటీ షో అంటేనే గొడవలు. ఎప్పటికప్పుడు కంటెస్టెంట్స్ మధ్య ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంటేనే చూస్తూ ఉన్న ప్రేక్షకులకు కూడా మజా వస్తుందని మేకర్స్ అనుకుంటారేమో. అందుకే వారి మధ్య గొడవ జరిగే టాస్కులనే ఇస్తూ ఉంటారు. ఇక ఇటీవల హిందీలో ప్రారంభమయిన బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3లో కూడా కంటెస్టెంట్స్ మధ్య మనస్పర్థలు, గొడవలు మొదలయ్యాయి. తాజాగా ఇందులో కంటెస్టెంట్స్ అయిన సాయి కేతన్ రావు, లవ్కేష్ కటారియా మధ్య పెద్ద గొడవే జరిగింది. ఇందులో ఇద్దరు పరస్పరం తిట్టుకోవడం మాత్రమే కాకుండా చైర్‌తో లవ్కేష్‌ను కొట్టబోయాడు సాయి.
ప్రోమో విడుదల..
ఒక చిన్న కామెంట్ వల్ల లవ్కేష్, సాయి కేతన్ మధ్య గొడవ మొదలయినట్టుగా జియో సినిమా.. ఒక ప్రోమోను విడుదల చేసింది. 1 నిమిషం నిడివి ఉన్న ఈ ప్రోమోలో వీరిద్దరు ఒకరినొకరు తిట్టుకోవడం చూపించారు. ముందుగా ఇందులో లవ్కేష్.. సనా మాట మారుస్తుంది అంటూ కామెంట్ చేశాడు. దానికి సాయి కేతన్.. నువ్వు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ లవ్కేష్‌పై అరిచాడు. దీంతో ఒకరినొకరు తిట్టుకున్నారు. నోరు మూసుకో అంటూ అరుచుకున్నారు. దీంతో సాయికి కోపం వచ్చి లవ్కేష్‌పైకి వెళ్లాడు. దాదాపు కొట్టబోయాడు కూడా. అప్పుడే రణవీర్ షోరే వచ్చి సాయిని ఆపాడు.
షర్ట్ విప్పి గలాటా..
రణవీర్‌తో పాటు మిగతా కంటెస్టెంట్స్ కూడా తనను ఎంత ఆపడానికి ప్రయత్నించినా సాయి కేతన్ ఆగలేదు. చైర్ తీసి లవ్కేష్‌పైకి విసిరేశాడు. అంతే కాకుండా షర్ట్ విప్పేసి లవ్కేష్‌ను రెచ్చగొట్టాడు. ఎవరు ఎంత చెప్పినా తను వినలేదు. అయితే ఈ ప్రోమోను చూసిన ప్రేక్షకులు దీనిపై రియాక్ట్ అవ్వడం ప్రారంభించారు. బిగ్ బాస్ హౌజ్‌లో బూతులు మాట్లాడడం రూల్‌ను అతిక్రమించినట్టు అయినా కూడా వీరిద్దరూ ఆ గొడవలో బూతులు మాట్లాడారు. ఇది అసలు యాక్సెప్ట్ చేసే విషయం కాదని అంటున్నారు.
Sai ne khoya apna aapa, kyun huyi hai yeh fight Lovekesh ke saath?
— JioCinema (@JioCinema) July 17, 2024
Watch #BiggBossOTT3 streaming exclusively on #JioCinema, tonight at 9pm.@loveutuber @saiketanrao#BBOTT3onJioCinema #BBOTT3 #BiggBoss #JioCinemaPremium pic.twitter.com/2TzeTwSwyK
ఫ్యాన్ వార్స్..
గొడవ సాయి కేతన్‌కు, లవ్కేష్‌కు మధ్య జరిగింది కాబట్టి ఈ ఇద్దరి ఫ్యాన్స్.. ట్విటర్‌లో వీరికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం మొదలుపెట్టారు. ముందుగా లవ్కేష్ బూతులు మాట్లాడడం మొదలుపెట్టాడు కాబట్టి సాయికి కోపం వచ్చి తిరిగి బూతులు మాట్లాడాడు అంటూ సాయి కేతన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇంత పెద్ద షోలో కనీసం ఆలోచించకుండా విచక్షణ లేకుండా లవ్కేష్ ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదంటున్నారు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ 3 అప్డేట్స్ విషయానికొస్తే.. అనిల్ కపూర్ హోస్ట్ చేస్తున్న ఈ షో.. జియో సినిమాస్‌లో స్ట్రీమ్ అవుతోంది. కృతిక మలోక్, సనా మక్బుల్, సనా సుల్తాన్, దీపక్ చరాసియా, శివానీ కుమార్.. ఇందులో కంటెస్టెంట్స్‌గా పాల్గొంటున్నారు.
Also Read: డైలాగ్ వార్ - డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు