అన్వేషించండి

Bigg Boss OTT 2: ‘బిగ్ బాస్’ హౌస్‌లో అడుగు పెట్టిన కొన్ని గంటల్లోనే ఆ కంటెస్టెంట్ ఔట్, ఇదే ఫస్ట్ టైమ్!

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న పునీత్ కుమార్.. బిగ్ బాస్ OTT సీజన్-2 హౌస్‌లోకి ప్రవేశించారు. కానీ, తన పిచ్చి చేష్టల కారణంగా 24 గంటలు గడవక ముదే ఎలిమినేట్ అయ్యాడు.

దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న రియాలిటీ షో బిగ్ బాస్. పలు భాషల్లో పలువురు స్టార్ హీరోలు ఈ షోలకు హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా హిందీలో బిగ్ బాస్ OTT సీజన్-2 ప్రారంభం అయ్యింది. ఈ షో JioCinemaలో జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈసారి హౌస్ లోకి పలువురు సెలబ్రిటీలు అడుగు పెట్టారు. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన పునీత్ సూపర్ స్టార్ బిగ్ బాస్ OTT 2 హౌస్‌లోకి ప్రవేశించాడు. 12వ కంటెస్టెంట్ గా షోలోకి అడుగు పెట్టాడు. అయితే, గతంలో ఎప్పుడూ లేని విధంగా పునీత్ 24 గంటలు గడవక ముందే షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇంత తక్కువ సమయంలో షో నుంచి తొలగించబడిని తొలి కంటెస్టెంట్ గా ఆయన చరిత్ర సృష్టించాడు.

BB OTT 2 నుంచి పునీత్ ను ఎందుకు తొలగించారంటే?   

బిగ్ బాస్ OTT 2 హౌస్ లోకి  పునీత్ సూపర్ స్టార్ ను సల్మాన్ ఖాన్ సాదరంగా స్వాగతించారు. చాలా మంది ప్రేక్షకులు సైతం పునీత్ రాకపట్ల సంతోషం వ్యక్తం చేశారు. మంచి ఆటతీరుతో ఆకట్టుకుంటాడు అనుకున్నారు. కానీ, షో మొదలైన కొద్ది గంటల్లోనే ఆయన హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో ఆయన ప్రవర్తన సరిగా లేకపోవడం కారణంగా ఇంటి సభ్యులంతా కలిసి ఆయనను ఎలిమినేట్ చేశారు. ఈ తొలగింపు బిగ్ బాస్ షో లోనే సరికొత్త రికార్డుగా చెప్పుకోవచ్చు. షో మొదలైన 24 గంటల్లోనే బయటకు వచ్చేశాడు. బిగ్ బిస్ హౌస్ లో ఉన్నంత సేపు ముఖానికి టూత్ పేస్ట్ పూసుకునే కనిపించాడు. అలా ఉండకూడదు అని చెప్పిన తోటి కంటెస్టెంట్లతో అనుచితంగా ప్రవర్తించాడు. బిగ్ బాస్ పదే పదే హెచ్చరించినా అతడిలో మార్పు రాలేదు. దీంతో బయటకు పంపక తప్పలేదు.

పునీత్ బిగ్ బాస్ షోలోకి రావడం పట్ల నెటిజన్ల సంతోషం

బిగ్ బాస్ OTT 2లో పునీత్ సూపర్ స్టార్ కంటెస్టెంట్ గా ఉండబోతున్నట్లు జియో సినిమా మొదట వెల్లడించినప్పుడు,   నెటిజన్లు హ్యాపీగా ఫీలయ్యారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు బిగ్ బాస్ హౌస్ లో అవకాశం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సీజన్‌లో అతను ట్రోఫీని ఎగురవేస్తాడని చాలా మంది భావించారు. కానీ, ఆయన నెటిజన్ల ఆనందాన్ని ఎక్కువసేపు ఉంచలేకపోయాడు. కొద్ది గంటల్లోనే బయటకు వచ్చాడు. పునీత్ సోషల్ మీడియాలో రకరకాల విన్యాసాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. బురద నీటిలో ఈత కొట్టడం, టూత్ పేస్టు, కారం పొడిని ముఖానికి పూసుకోవడంతో బాగా పాపులర్ అయ్యాడు. రోడ్ల మీద డ్యాన్సులు వేయడం, జనాలకు ఆసక్తి కలిగించేలా వీడియోలు చేయడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ గుర్తింపు ద్వారానే తను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు.   

బిగ్ బాస్ OTT 2 గురించి..

బిగ్ బాస్ OTT సీజన్ 2,  జూన్ 17 నుంచి జియో సినిమాలో స్ట్రీమ్ అవుతోంది.  ఈ షోకి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్నారు. సిమా తపారియా, అంజలి అరోరా, అవేజ్ దర్బార్, జియా శంకర్, పూజా గోర్ సహా పలువురు ఈ షోలో కంటెస్టెంట్ గా ఉన్నారు.  

Read Also: వయొలెంట్ పోలీస్‌గా కాజల్ అగర్వాల్ - ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా!

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Bigg Boss Agnipariksha 2026: 'బిగ్ బాస్' అగ్నిపరీక్ష ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్ళే... పదిహేను మందిలో ఎవరున్నారంటే?
'బిగ్ బాస్' అగ్నిపరీక్ష ఫైనల్ కంటెస్టెంట్లు వీళ్ళే... పదిహేను మందిలో ఎవరున్నారంటే?
Vindhya Vishaka: ఐపీఎల్ సుందరి వింధ్యా విశాఖ.. న్యూస్ రీడర్ నుంచి స్టార్ యాంకర్ వరకు.. బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ!
ఐపీఎల్ సుందరి వింధ్యా విశాఖ.. న్యూస్ రీడర్ నుంచి స్టార్ యాంకర్ వరకు.. బిగ్ బాస్ 10లోకి ఎంట్రీ!
Nikhil Vijayendra Simha: డిజిటల్ స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ.. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ రేస్ వరకు.. కెరీర్, రియల్ లైఫ్ ముచ్చట్లు!
డిజిటల్ స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ.. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ రేస్ వరకు.. కెరీర్, రియల్ లైఫ్ ముచ్చట్లు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Adilabad Latest News: సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
సీసీఐ పరిశ్రమపై జెన్ జీల పోరాటం- ముందే మేల్కోవాలని ముఖ్యమంత్రికి ప్రొఫెసర్ కాశీం సూచన 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
మంగళ గౌరీ వ్రత కథ: శ్రావణ మంగళవారం గౌరీ దేవి పూజ సమయంలో ఈ కథ తప్పనిసరిగా చదువుకోవాలి!
Embed widget