Bigg Boss 7 Telugu: అమర్‌దీప్, గౌతమ్ బూతులు - ఎమోషనల్‌గా సాగిన ప్రియాంక కెప్టెన్సీ పట్టాభిషేకం
Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7కు కొత్త కెప్టెన్‌గా ప్రియాంక బాధ్యతలు స్వీకరించింది. కానీ తన ఫ్రెండ్ అయిన అమర్‌దీప్ సైతం ఈ విషయంలో సంతోషంగా లేడు.
బిగ్ బాస్ రియాలిటీ షోలో కెప్టెన్సీని చాలామంది కంటెస్టెంట్స్ చాలా పర్సనల్‌గా తీసుకుంటారు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ 7లో 10 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. వారంతా తాజాగా జరిగిన కెపెన్సీ టాస్క్‌లో పోటీపడ్డారు. అందులో ముందు నుంచి కంటెస్టెంట్స్‌గా ఉన్న కెప్టెన్సీ దక్కనిది ఇద్దరికి మాత్రమే. వారే ప్రియాంక, అమర్‌దీప్. ఫైనల్‌గా వీరిద్దరే కెప్టెన్సీ కోసం పోటీపడే అవకాశం లభించింది. కానీ అదే సమయంలో తనకు ఎక్కడ కెప్టెన్సీ దక్కదేమో అన్న భయంతో అమర్‌దీప్ ఏడవడం మొదలుపెట్టాడు. అంతే కాకుండా ఆ ఎమోషన్‌లో బూతులు కూడా మాట్లాడాడు. అమర్ ప్రవర్తన.. కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచింది.
ఫ్రెండ్స్ మధ్య కెప్టెన్సీ పోరు..
కెప్టెన్సీ టాస్క్ కోసం కంటెస్టెంట్స్ అంతా ఇటుకలు సేకరించాలని బిగ్ బాస్ తెలిపారు. ఒక లెవెల్ అయిపోయిన తర్వాత తక్కువ ఇటుకలు సేకరించిన కంటెస్టెంట్.. ఆట నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అలా ఒక్కొక్కరికి తప్పుకుంటూ ఉండగా.. చివరికి అర్జున్, అమర్‌దీప్, ప్రియాంక, పల్లవి ప్రశాంత్.. కెప్టెన్సీ రేసులో రెండో లెవెల్‌కు చేరుకోగలిగారు. ఈ నలుగురు తాము సేకరించిన ఇటుకలతో టవర్స్ పేర్చాలి. ఆ తర్వాత వారు పేర్చిన టవర్స్‌ను మిగతా కంటెస్టెంట్స్ పడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో ఎవరి టవర్స్‌ను వారు కాపాడుకోవాలి. ఇందులో కూడా ముందుగా పల్లవి ప్రశాంత్, అర్జున్.. తమ తమ టవర్స్‌ను కాపాడుకోలేక గేమ్ నుంచి తప్పుకున్నారు. ఫైనల్‌గా అమర్‌దీప్, ప్రియాంక కెప్టెన్సీ రేసులో మిగిలారు.
అమర్, గౌతమ్ బూతులు..
ప్రియాంకను కెప్టెన్ చేయాలని గౌతమ్ నిర్ణయించుకున్నాడు. శోభా శెట్టి.. అమర్ వైపు సపోర్ట్‌గా నిలబడింది. మిగతా కంటెస్టెంట్స్ ఇద్దరికీ సమానంగా సపోర్ట్ చేస్తున్నట్టుగా ఆట మొదలుపెట్టారు. ప్రియాంక టవర్‌ను పడగొట్టడానికి కూడా కంటెస్టెంట్స్ ప్రయత్నిస్తున్నా.. అమర్ దానిని పట్టించుకోకుండా కేవలం తనపైనే ఫోకస్ పెట్టారని, తనను మాత్రమే ఓడించాలని చూస్తున్నారని ఫీలయ్యాడు. దీంతో అరవడం, ఏడవడం మొదలుపెట్టాడు. కాసేపు విచక్షణ కోల్పోయాడు. ఆట మధ్య అమర్‌ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు గౌతమ్. అవతల వైపు ఉంది నీ ఫ్రెండే కదా, ప్రియాంక కెప్టెన్ అవ్వకూడదు అని ఒక్క మాట చెప్పు.. ప్రియాంక టవర్ పడగొట్టేస్తా అని అమర్‌ను కన్‌ఫ్యూజ్ చేశాడు. మాట మధ్యలో నీ అమ్మ అని కూడా అన్నాడు గౌతమ్. అదే పదాన్ని అమర్‌దీప్ మళ్లీ మళ్లీ అన్నాడు. అది ఊతపదమని, బూతులాగా చూడొద్దని గౌతమ్ సమర్థించుకున్నాడు. చివరిగా చాలా తక్కువ తేడాతో అమర్ ఓడిపోయి ప్రియాంక గెలిచింది. దీంతో అమర్ ఎమోషన్ తారాస్థాయికి చేరుకుంది.
అమర్ ఆవేదన..
ఓడిపోవడంతో ఒక్కసారి కింద పడిపోయి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు అమర్‌దీప్. ఇదంతా చూసిన కంటెస్టెంట్స్.. తనను ఓదార్చే ప్రయత్నం చేశారు. తనకు కెప్టెన్ అయినట్టుగా కల వచ్చిందని, ఉదయం నుంచి దాని గురించే ఆలోచిస్తున్నానంటూ వాళ్ల అమ్మ మీద ఒట్టు వేశాడు అమర్. అమర్ ప్రవర్తన చూసి ప్రియాంక బాధపడింది. ఒకవేళ అమర్ గెలిచుంటే తాను మాత్రం ఇలా చేసేదాన్ని కాదని చెప్పింది. చిన్నప్పటి నుంచి తాను ఏం కోరుకున్నా దక్కేది కాదని ప్రియాంకకు చెప్తూ మరోసారి ఎమోషనల్ అయ్యాడు అమర్‌దీప్. మొత్తంగా మొదటిసారి ప్రియాంక కెప్టెన్ అయినందుకు తనకు కన్నీళ్లతో పట్టాభిషేకం జరిగింది.
Also Read: నాని రాజకీయ ప్రచారం - ఏ పార్టీ కోసమో తెలుసా?