Balakrishna in Bigg Boss 7: ‘బిగ్ బాస్’ హోస్ట్‌గా బాలకృష్ణ? నాగార్జున అందుకే తప్పుకుంటున్నారా?
తెలుగులో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్న షో ‘బిగ్ బాస్’ రియాలిటీ షో. ఇప్పటికే పలువురు హీరోలు ఈ షోకు హోస్టుగా చేయగా, సీజన్-7కు హోస్టుగా నందమూరి బాలకృష్ణ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తెలుగు బుల్లితెరపై ‘బిగ్ బాస్’ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 6 సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యాయి. ‘బిగ్ బాస్’ షో హోస్టులుగా జూనియర్ ఎన్టీఆర్, నాని, నాగార్జున వ్యవహరించి ఆకట్టుకున్నారు. అయితే ‘బిగ్ బాస్’ సీజన్-6 ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని, దీనిపై హోస్ట్ నాగార్జున కూడా అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. అందుకే ఆయన తర్వాతి సీజన్‌కు వీడ్కోలు తెలపనున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అంతేగాక, గతేడాది ప్రారంభించిన ‘బిగ్ బాస్-నాన్ స్టాప్’ (ఓటీటీ వెర్షన్) గురించి కూడా ‘బిగ్ బాస్’ సీజన్-6 ఫినాలేలో ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. దీంతో నాగ్ నిజంగానే బిగ్ బాస్‌ను వదిలేస్తున్నారా అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్ కు ఎవరు హోస్టుగా చేయబోతున్నారు? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఓ పేరు బయటకు వచ్చింది. అది మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ.
టాక్ షోతో అదరగొడుతున్న బాలయ్య
ప్రస్తుతం బాలయ్య ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమవుతున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షోతో అదరగొడుతున్నారు. ప్రముఖ సినీ, రాజకీయ దిగ్గజాలను ఈ షోకు పిలిచి తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. తన చలాకీ మాటలతో షోకు మరింత హుషారు తెస్తున్నారు. ఇప్పటికే ఈ టాక్ షో మొదటి సీజన్ ను పూర్తి చేసుకుని, రెండో సీజన్ లోకి ఎంటర్ అయ్యింది. అద్భుత ప్రజాదరణతో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. అలాంటి బాలయ్య వచ్చే ‘బిగ్ బాస్’ సీజన్ ను హోస్టుగా చేయబోతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. బాలయ్య గానీ బిగ్ బాస్ హోస్ట్‌గా ఉంటే.. కంటెస్టెంట్లకు దబిడి దబిడేనని అభిమానులు అంటున్నారు. అయితే, ఇందులో నిజమేంటి అనేది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.
కీలక విషయం చెప్పిన రాహుల్ సిప్లిగంజ్
తాజాగా ఇదే విషయానికి సంబంధించి ‘ బిగ్ బాస్’ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఓ కీలక విషయాన్ని వెల్లడించాడు. ‘బిగ్ బాస్’ హోస్టుగా బాలయ్యను చూడాలి అనుకుంటున్నట్లు చెప్పాడు. తాజాగా ఆయన ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ విషయాన్ని వెల్లడించాడు. తనకు ఎప్పటి నుంచో ‘బిగ్ బాస్’ హోస్టుగా బాలయ్యను చూడాలని ఉన్నట్లు చెప్పాడు. ప్రస్తుత హీరోల్లో ఎవరు ‘బిగ్ బాస్’ హోస్టు అయితే బాగుంటుంది? అనే ప్రశ్నకు ఆయన ఈ సమాధానం చెప్పాడు. ఆయన ‘బిగ్ బాస్’ హౌస్ లోకి వెళ్తే కంటెస్టెంట్లు అంతా వణికిపోతారంటూ నవ్వాడు.
రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారా?
రాహుల్ సిప్లిగంజ్ కామెంట్స్ నేపథ్యంలో వచ్చే ‘బిగ్ బాస్’ సీజన్ హోస్టుగా బాలయ్యే ఉండబోతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే షో హోస్టుగా ఆయన ఫిక్స్ అయ్యారంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ షో కోసం తను ఏకంగా రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నాడనే చర్చ జరుగుతోంది. అటు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వీర సింహారెడ్డి’ సినిమాలో బాలయ్య హీరోగా నటిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా జనవరి 12, 2023లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
బిగ్ బాస్ 7 హోస్ట్ గా బాలయ్య బాబు ఫిక్స్..
— మాలతి రెడ్డి tdp (@malati_reddi) December 21, 2022
రెమ్యూనరేషన్ 10 కోట్లు.. బిగ్ బోస్ చరిత్రలోనే అత్యధిక రెమ్యూనరేషన్!!! @JaiTDP pic.twitter.com/RiTomhLEr8
Big Boss Telugu Next Host Nandamuri Balakrishna...? #Balakrishna #NandamuriBalakrishna #NBK #Balayya #bigbosstelugu pic.twitter.com/8COBysHcFG
— PrathiVaartha (@PrathiVaartha) December 22, 2022
Read Also: కావాలని కరోనా తెచ్చుకున్న చైనీస్ సింగర్, తిట్టిపోస్తున్న నెటిజన్లు