News
News
X

Bigg Boss 6 Telugu Revanth: విన్నర్ రేవంత్ బిగ్‌బాస్ నుంచి మొత్తం ఎంత సంపాదించాడంటే

బిగ్‌బాస్ విన్నర్ రేవంత్ ఈ సీజన్‌కు ఎంత సంపాదించాడో తెలుసుకోవాలని అతని అభిమానులకు ఉంటుంది.

FOLLOW US: 
Share:

ట్విస్టుల మధ్య బిగ్‌బాస్ సీజన్ 6 ముగిసింది. విజేతగా రేవంత్, రన్నరప్ స్థానంలో శ్రీహాన్ నిలిచాడు. శ్రీహాన్ గోల్డెన్ సూట్‌కేసును ఎంచుకోవడంతో రేవంత్ విజేత అయ్యాడు. శ్రీహాన్ ఆ పని చేసి ఉండకపోతే రేవంత్ పెద్ద లాభం ఉండేది కాదు. కీర్తి సూట్ కేసుతో బయటికి వచ్చినా కూడా రేవంత్‌కే దెబ్బపడేది. ఎందుకంటే సూట్ కేసు తీసుకునే ఆఫర్ ఒక్కరికే ఇస్తారు. కీర్తి సూట్‌కేసు ఆఫర్ ఒప్పుకుని ఉంటే శ్రీహాన్ - రేవంత్‌లకు మళ్లీ సూట్‌కేసు ఆఫర్ ఇవ్వరు. అప్పుడు కేవలం విన్నర్, రన్నర్‌ను ప్రకటించడమే మిగులుతుంది. అలా అయితే శ్రీహాన్ విన్నర్ అయ్యేవాడు. రేవంత్ రన్నర్‌గా మిగిలేవాడు. నగదు, కారు, ప్లాటు అన్నీ శ్రీహాన్‌కే దక్కేవి. కానీ కీర్తి సూట్‌కేసు ఆఫర్ వద్దనడం, తరువాత శ్రీహాన్ తీసుకోవడం కూడా రేవంత్‌కే కలిసి వచ్చింది. శ్రీహాన్ కూడా సూట్‌కేసు వద్దనుకుంటే పరిస్థితి మరోలా ఉండేది. అతనికే ఎక్కువ ఓట్లు పడ్డాయని నాగార్జున చెప్పారు కాబట్టి ఆయనే విన్నర్ అయ్యే వాడు. రేవంత్‌కు మొండి చెయ్యే మిగిలేది. కీర్తి, శ్రీహాన్ తీసుకున్న నిర్ణయాలు రేవంత్ లాభపడేలా చేస్తాయి. 

మొత్తం ఎంత ముట్టిందంటే...
 విన్నర్ ప్రైజ్ మనీ యాభై లక్షల నుంచి శ్రీహాన్ 40 లక్షల రూపాయలు దక్కించుకున్నాడు. దీంతో మిగిలిన పది లక్షలు, మారుతి బ్రెజా కారు (10 నుంచి 12 లక్షల రూపాయలు), 30 లక్షలు విలువ చేసే 605 గజాల స్థలం వచ్చింది. ఇది కాకుండా అతనికి బిగ్ బాస్ ఇంట్లో ఉన్నందుకు ముందుగా రెమ్యునరేషన్ మాట్లాడుకున్నారు. వారానికి రూ.60వేల నుంచి రూ.80 వేల వరకు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా చూసుకున్నా మొత్తం పదిలక్షల రూపాయలు రెమ్యునరేషన్ కింద వస్తుంది. అంటే క్యాష్ రూపంలో 20 లక్షల రూపాయలు, పది లక్షల కారు, 30 లక్షల ఖరీదు ప్లాటు... మొత్తం 60 లక్షల వరకు సంపాదించాడు. మూడు నెలలకు ఇది తక్కువ సంపానేమీ కాదు. శ్రీహాన్ సూట్‌కేసు ఎంచుకోకపోతే కేవలం పదిలక్షల రెమ్యునరేషన్‌తో ఇంటికెళ్లే వాడు. అందుకే సీజన్లో ఇద్దరూ విన్నర్లేనని చెప్పాలి. 

గతంలో  బిగ్ బాస్ సీజన్ 4లో కూడా ఇలాగే జరిగింది. సొహైల్ పాతిక లక్షల సూట్‌కేసు తీసుకెళ్లిపోవడంతో విజేత అయిన అభిజిత్‌కు కేవలం పాతిక లక్షలే దక్కింది. అది కాకుండా రెండున్నర లక్షలు విలువ చేసే బైకు ఇచ్చారు. రన్నరప్ అయిన అఖిల్ అన్యాయమైపోయాడు. సోహైల్ మాత్రం పాతిక లక్షలతో పాటూ, చిరు ఇచ్చిన మరో పది లక్షలు కూడా తీసుకుని విజేత కన్నా ఎక్కువ సంపాదించాడు.  

View this post on Instagram
 
A post shared by Singer Revanth 🎤 (@singerrevanth)

Also read: రన్నర్‌గా మారిన విన్నర్ శ్రీహాన్, అత్యధిక ఓట్లు ఆయనకే, కానీ - ప్రైజ్ మనీ ఎంతొచ్చిందంటే

Published at : 19 Dec 2022 01:15 PM (IST) Tags: Biggboss 6 telugu Revanth Winner BiggBoss Winner Prize money Revanth Earnings

సంబంధిత కథనాలు

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

Monkey Selfie With Abijeet: అభిజీత్‌తో కోతి సెల్ఫీ - ఆ ఫొటో కోతే తీసిందట!

Monkey Selfie With Abijeet: అభిజీత్‌తో కోతి సెల్ఫీ - ఆ ఫొటో కోతే తీసిందట!

Archana Gautam: ప్రియాంక గాంధీ పీఏపై బిగ్ బాస్ కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు, కేసు నమోదు చేసిన పోలీసులు

Archana Gautam: ప్రియాంక గాంధీ పీఏపై బిగ్ బాస్ కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు, కేసు నమోదు చేసిన పోలీసులు

Gangavva on Nagarjuna: కల నెరవేర్చుకున్న గంగవ్వ, కొత్త ఇంటి కోసం నాగార్జున ఎంత సాయం చేశారంటే?

Gangavva on Nagarjuna: కల నెరవేర్చుకున్న గంగవ్వ, కొత్త ఇంటి కోసం నాగార్జున ఎంత సాయం చేశారంటే?

Ashu Reddy : అషు రెడ్డి బికినీ రేటు ఎంతో తెలుసా? - ఆ 'విక్టోరియా సీక్రెట్' కొనొచ్చా?

Ashu Reddy : అషు రెడ్డి బికినీ రేటు ఎంతో తెలుసా? - ఆ 'విక్టోరియా సీక్రెట్' కొనొచ్చా?

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైండ్‌ గేమ్‌తో ప్రచారం- ప్రత్యర్థులను పరుగులు పెట్టేంచేలా స్కెచ్‌

ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైండ్‌ గేమ్‌తో ప్రచారం- ప్రత్యర్థులను పరుగులు పెట్టేంచేలా స్కెచ్‌

TSPSC Paper Leak: 'ఓఎంఆర్' విధానానికి టీఎస్‌పీఎస్సీ గుడ్‌బై? ఇక నియామక పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే!

TSPSC Paper Leak: 'ఓఎంఆర్' విధానానికి టీఎస్‌పీఎస్సీ గుడ్‌బై? ఇక నియామక పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు - వెంటనే బెయిల్

రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు - వెంటనే బెయిల్