అన్వేషించండి

Gangavva: చాలు బిగ్ బాస్, ఇక చాలు... గంగవ్వను పంపేయడం బెటర్ - జనాల అభిప్రాయం మీకు అర్థమవుతోందా?

గంగవ్వను ఇంటికి పంపేయడం బెటర్ అనే ఫీలింగ్ కలుగుతోంది. బిగ్ బాస్ ఇంటిలో తనకు తెలియకుండానే టాస్కులకు అడ్డంకిగా మారుతున్న గంగవ్వను నామినేట్ చేయడానికి కూడా హౌస్ మేట్లు భయపడుతున్నారు.

'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8 కీలక దశకు చేరుకుంది. రేటింగ్స్ విషయం ఎలా ఉన్నా... గత సీజన్ తో పోలిస్తే ఈసారి షో చూపిస్తున్న ఇంపాక్ట్ తక్కువే అని చెప్పాలి. గత సీజన్లో సరిగ్గా ఇదే సమయానికి  SPY వర్సెస్ SPA వర్గాలు ఏర్పడిపోవడం, ఉన్న హౌస్ మేట్స్ అందరూ ప్రాణం పెట్టి ఆడడంతో ఆడియన్స్ అందరూ ఏదో ఒక గ్రూపును ఓన్ చేసుకున్నారు. కానీ ఈసారి సీజన్ 8కు ఆ స్థాయిలో ఫ్యాన్స్ ఏర్పడలేదు. ఆట ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతోంది. పృథ్వీ, నిఖిల్, గౌతమ్, నబీల్ లాంటి వాళ్ళు ఫిజికల్ గేమ్స్ లో దూసుకుపోతుంటే ఎంటర్టైన్మెంట్, మైండ్ గేమ్ లతో తేజ, అవినాష్ తమ ఇంపాక్ట్ చూపిస్తున్నారు. ఇక అమ్మాయిల్లో ప్రేరణ, యస్మి, రోహిణితో పాటు కొంతవరకూ హరితేజ కూడా అదరగొడుతున్నారు. నయని బాగానే ఆడుతున్నా... ఎక్కువగా ఏడుస్తుండడం ఆమెకు మైనస్ గా మారుతోంది. ఇక విష్ణు ప్రియ ఆట కంటే ఎక్కువగా పృథ్వీతో ట్రాక్ పైనే ఆధారపడినట్టు అనిపిస్తోంది. వీళ్ళందరూ ఏదో ఒక స్ట్రాటజీతో ఆటలో ముందుకు పోతుంటే ఒక్క హౌస్ మేట్ మాత్రం ఆటకు అడ్డంకిగా మారుతోందన్న అభిప్రాయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమే గంగవ్వ.

సీజన్ 4 లో సందడి చేసిన గంగవ్వ
అతి సామాన్య స్థితి నుంచి "మై విలేజ్ షో" యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెలుగులోకి వచ్చిన గంగవ్వ సీజన్ 4లో తెలుగు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్ మోస్ట్ సక్సెస్ ఫుల్ సీజన్లలో ఒకటైన బిగ్ బాస్ 4లో బ్యాటరీ టాస్క్ లో అభిజిత్ టీం తరపున దివిని కిడ్నాప్ చేసే టాస్క్ లో గంగవ్వ కీలక పాత్ర పోషించింది. అయితే బిగ్ బాస్ వాతావరణం, అక్కడి ఏసీ  చల్లదానాన్ని తట్టుకోలేక తొందరగానే బిగ్ బాస్ నుండి తనకు తానుగా బయటకు వచ్చేసింది. నాలుగేళ్ల తర్వాత వైల్డ్ కార్డుగా మళ్లీ సీజన్ 8లో ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. ఎంటర్ అయిన వెంటనే ఫిజికల్ టాస్క్ లో సైతం ఆమె ఓజీ టీంను ఓడించింది. అయితే ఆ తర్వాత  పరిస్థితి మారింది.

Also Read: బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 62 రివ్యూ: గౌతమ్, నయని గొడవ... కంటెస్టెంట్లను ఏడ్పించారు - ప్రేక్షకుల సంగతేంటి బిగ్ బాస్?

ఇప్పటికీ స్ట్రాంగ్ గానే గంగవ్వ... కానీ?
బిగ్ బాస్ సీజన్ 8 రాను రాను మరింత కఠినంగా, ఫిజికల్ గా మారుతోంది. ఆడ మగ కలిపి మరి  ఫిజికల్ టాస్కుల్లో పోటీ పడుతున్నారు. దాంట్లో చిన్న చిన్న దెబ్బలు కూడా తింటున్నారు. వీటిల్లో గంగవ్వ పాల్గొనకుండా బిగ్ బాస్ టీం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆమె ఆరోగ్య పరంగా ఇది బాగానే ఉన్నా మరి ఇంత క్రిటికల్ గా మారుతున్న బిగ్ బాస్ టాస్కుల్లో ఆమె పరిమితం అయిపోతోంది. పోనీ సంచాలక్ గా పెడదామన్నా మొన్నటి వాటర్ ట్యాంక్ టాస్క్ లో ఆమె జడ్జిమెంట్ పై హౌస్ మేట్లలోనూ, ఆడియన్స్ లోనూ తీవ్ర అసంతృప్తి కనిపించింది. నామినేషన్స్ లోనూ హౌస్ మేట్లు ఎవరూ ఆమె జోలికి రావడం లేదు. కారణం ఆమెను నామినేట్ చేస్తే ఆమెకు బయట ఉన్న ఫాలోయింగ్, సింపతి తమకు వ్యతిరేకంగా మారుతాయేమో అన్న భయమే. దీనితో తెలియకుండానే గంగవ్వ బిగ్ బాస్ గేమ్ కి అడ్డంకి అయిపోతుందన్న అభిప్రాయం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. గంగవ్వ పరంగా గట్టిగానే బిగ్ బాస్ లో నిలబడుతున్నా రానున్న టాస్కులు, హౌస్ మేట్ల ఓటింగ్ భయాన్ని దృష్టిలో పెట్టుకుని గంగవ్వను మర్యాదపూర్వకంగానే బయటికి రప్పిస్తే బాగుంటుందని బిగ్ బాస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి బిగ్ బాస్ టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Also Readబిగ్ బాస్ తెలుగు 8 ఎపిసోడ్ 61 రివ్యూ: యష్మిని టార్గెట్ చేసిన నిఖిల్... చిన్న పిల్లల్లా మారిన అవినాష్, ప్రేరణ - స్టామినా లేదంటూ ఏడ్చిన టేస్టీ తేజా

టాప్ హెడ్ లైన్స్

Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Aishwarya Sindogi: బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరి కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Nara Rohith Birthday: హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
Naga Chaitanya Sobhita: పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైమ్ వంట చేసింది... శోభితను నాగ చైతన్య ట్రోల్ చేశాడా?
Jhandu Kumar In Commonwealth Games: కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
కూరగాయలు అమ్మాడు, రిక్షా నడిపాడు, ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని తీసుకొచ్చాడు!
Embed widget