బిగ్ బాస్ హౌస్లో గ్రాండ్గా దసరా సెలెబ్రేషన్స్ - చివర్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున!
బిగ్ బాస్ హౌస్లో దసరా సంబరాలు మొదలయ్యాయి. అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా స్టార్ మా విడుదల చేసింది.
బిగ్ బాస్లో సండే అంటే ఫన్ డే అనే విషయం తెలిసింది కదా. ప్రస్తుతం సీజన్ సెవెన్ ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఆదివారం(అక్టోబర్ 22) బిగ్ బాస్ లో దసరా సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరగబోతున్నాయి. నిన్న శనివారం కావడంతో నాగార్జున హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ క్లాస్ తీసుకున్నారు. వారం మొత్తం లో జరిగిన విషయాల గురించి మాట్లాడుతూ వాళ్ళ తప్పుల గురించి బయటపెట్టారు. అలాగే వారం మొత్తంలో బాగా ఆడిన వాళ్ళని మెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే హౌస్ లో ఎవరు నిచ్చెన, ఎవరు పాము అనే గేమ్ కూడా ఆడించారు.
ఇందులో ఒక్కొక్కరు తమకు సపోర్ట్ చేసే వారిని నిచ్చెన అని, నచ్చని వాళ్ళని పాము అని అందుకు కారణాలు కూడా చెప్పాలని నాగార్జున చెప్పడంతో కంటెస్టెంట్స్ అంతా కారణాలతో నిచ్చెన ఎవరో, పాము ఎవరో చెప్పారు. ఇక ఎపిసోడ్ చివర్లోనే సండే బిగ్ బాస్ లో దసరా సెలబ్రేషన్స్ ఉంటాయని నాగార్జున అన్నారు. చెప్పినట్లుగానే బిగ్ బాస్ హౌస్ లో దసరా సంబరాలు అంబరాన్ని అంటాయి. అందుకు సంబంధించి నేటి(అక్టోబర్22) ఎపిసోడ్ ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు. ఈ ప్రోమో ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగుతూనే చివర్లో ఓ ట్విస్ట్ తో ముగిసింది. ఇక ప్రోమోని పరిశీలిస్తే.. దసరా సందర్భంగా బిగ్ బాస్ హౌస్లో హౌస్ మేట్స్ అంతా బతుకమ్మ ఆడారు.
ఆ తర్వాత నాగార్జున కొంతమంది సెలెబ్రెటీలతో డాన్స్ పెర్ఫార్మెన్స్లో చేయించారు. వారిలో డింపుల్ హయాతి, పాయల్ రారాజ్ పుత్ తమ డాన్స్ లతో అదరగొట్టేసారు. అనంతరం హౌస్ మేట్స్ తో నాగార్జున కొన్ని గేమ్స్ ఆడించారు. అలాగే హౌస్ లో ఉన్న వాళ్ళకి వాళ్ల కుటుంబ సభ్యులు రాసిన లెటర్స్ ని పంపించారు. ఆ లెటర్ చదువుతూ అందరూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా శోభా శెట్టి, యావర్ తీవ్ర కన్నీటి పర్యంతమయ్యారు. ఇక చివరిలో నాగార్జున భారీ ట్విస్ట్ ఇచ్చారు. అదే వైల్డ్ కార్డు ఎంట్రీ. గతవారమే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇప్పటికే హౌస్ నుండి ఎలిమినేట్ అయిన వారిలో ఒకరు హౌస్ లోకి రాబోతున్నారని నాగార్జున ఓటింగ్ పెట్టిన విషయం తెలిసిందే.
దామిని, రతిక, శుభశ్రీ ఈ ముగ్గురిలో ఒకరు మాత్రమే వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వస్తారని, హౌస్ మేట్స్ అంతా తమకు నచ్చిన కంటెస్టెంట్ కి ఓటు వేశారు. ఈ ఓటింగ్ లో ఎవరికైతే తక్కువ ఓట్లు పడ్డాయో వాళ్లే హౌస్ లోకి వస్తారని నాగార్జున మరో ట్విస్ట్ ఇచ్చారు. దాని ప్రకారం ఈ రోజే ఆ ట్విస్ట్ ని రివిల్ చేస్తూ వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండబోతుందని ప్రోమోలో చూపించారు. ఈ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రతికా హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
హౌస్ మేట్స్ ఓటింగ్ ప్రకారం రతికకు తక్కువ ఓట్లు రావడంతో ఆమెనే తిరిగి హౌస్ లోకి పంపించారు. అలాగే ఈ వారం ఎలిమినేషన్ లో భాగంగా పూజ హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. మొత్తం మీద బిగ్ బాస్ హౌస్ లో దసరా సంబరాలు మాత్రం నెక్స్ట్ టైం లో ఉండబోతున్నాయని ప్రోమో ద్వారా చెప్పేశారు. అలాగే ఎంటర్టైన్మెంట్ తో పాటు కొన్ని ట్విస్టులు కూడా ఉండబోతున్నాయి. అవేంటో తెలియాలంటే ఆదివారం ప్రసారం కాబోయే బిగ్ బాస్ 7 ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.
Also Read : మరోసారి వాయిదా పడ్డ 'గేమ్ చేంజర్' ఫస్ట్ సింగిల్ - దసరాకి రావడం లేదట, కారణం?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial