అన్వేషించండి

Shobha Shetty: కెప్టెన్సీ గోవింద, పూర్తిగా చంద్రముఖిలా మారిన శోభాశెట్టి - అశ్వినీపై టేస్టీ తేజ ఆగ్రహం

బిగ్ బాస్ సీజన్ సెవెన్ తాజా ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ మధ్య డిస్కషన్ నడిచింది. చాలామంది పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసినట్లు కనిపించారు.

బిగ్ బాస్ షోలో.. 8వ వారం కెప్టెన్సీ టాస్క్ చివరి దశకు చేరుకుంది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ బిగ్ బాస్ ఇచ్చిన గేమ్స్‌లో గెలుపొంది కంటెండర్స్ గా నిలిచారు. ప్రియాంక, పల్లవి ప్రశాంత్, సందీప్, శోభా శెట్టి, గౌతమ్ కెప్టెన్సీ రేసులో నిలిచారు. ఈ క్రమంలోనే ఈ వారం బిగ్ బాస్ ఇంటికి ఎవరు కెప్టెన్ అవుతారో తెలుసుకునేందుకు బిగ్ బాస్ ఫైనల్ టాస్క్ ఇచ్చారు. అదే ఈ మిర్చి చాలా హాట్. ఈ టాస్క్ లో భాగంగా కెప్టెన్సీ కండైనర్స్ నుంచి ఎవరు కెప్టెన్ అవుతారు అనేది మిగతా ఇంటి సభ్యులు నిర్ణయించాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రోమోలో అమర్ పల్లవి ప్రశాంత్ ని, భోలే ప్రియాంకను.. రతిక, యావర్ శోభాశెట్టిని కెప్టెన్సీ రేసు నుంచి తొలగిస్తూ నామినేట్ చేశారు.

ఈ క్రమంలోనే వాళ్ల మధ్య డిస్కషన్ తో పాటు కాసేపు వాదోపవాదాలు కూడా జరిగాయి. ముఖ్యంగా యావర్, శోభ శెట్టిల మధ్య పెద్ద వారే జరిగింది. శోభ శెట్టి యావర్ ని పిచ్చోడివి అనగానే చాలా సీరియస్ అయ్యాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో మిగతా కంటెస్టెంట్స్ పల్లవి ప్రశాంత్ నే టార్గెట్ చేసినట్లు కనిపించింది. ఒకసారి ప్రోమోని గమనిస్తే... పిచ్చోడు అనేది బ్యాడ్ వర్డ్ అని రతిక యావర్ తో చెబుతుంది. అమ్మాయి అయితే ఏదైనా అనొచ్చా అని యావర్ అంటే దానికి రతిగా బదిలిస్తూ.. ‘‘అమ్మాయి అయితే ఏదైనా మాట్లాడొచ్చనేది కరెక్ట్ కాదు’’ అని అంది. తర్వాత శోభ.. "నువ్వు నామినేట్ చేసిన రీజన్ ఏమిటి" అని తేజపై ఫైర్ అయింది.

"ఐదుగురిలో ముగ్గురు మాత్రమే వేరే వాళ్లకు ఇస్తారు. ప్రశాంత్ ని ఎవరు ముట్టుకోరు. నాకు తెలుసు" అని అమర్ రతికతో చెప్తాడు. ఆ తర్వాత అమర్.. "పంట పండించే వాడివి పంచుకోవడం కూడా తెలియాలి నీకు, ఏదైనా చెప్పినప్పుడు తొడలు కొట్టేది, మీసాలు మెలేయడం, పక్కవాళ్ళు నవ్వితే చంకలు గుద్దుకోవడం అలాంటిది కాదు" అని ప్రశాంత్ పై ఫైర్ అవుతాడు. తేజ కూడా ప్రశాంత్ ని నామినేట్ చేస్తూ.. ‘‘నువ్వు కెప్టెన్ అయ్యావు. మిగతావాళ్లు అవలేదు. వాళ్ళకి అవకాశం రావాలి’’ అని రేస్ నుంచి తొలగిస్తాడు. దానికి ప్రశాంత్ బదులిస్తూ.. "ఈ మాల వేస్తుంటే మా రైతులు పండించిన పంట నాకు పూలమాల లెక్క కనిపిస్తుంది. నాకు సంతోషంగా ఉంది. మంచితనానికి మంచి మంచి దండలు వస్తుంటే ఎవరు వద్దంటారు" అని ప్రశాంత్ మిగతా హౌస్ మెట్స్ తో అంటాడు.

ఆ తర్వాత ప్రియాంక.. "గట్స్ ఉంటే రీజన్ చెప్పి తీయండి" అని బోలేని పరోక్షంగా అంటుంది. అందుకు భోలే.." ఆమె ప్రతిదానికి చాలా ఇరిటేట్ గా ఫీల్ అవుతుంది" అని రతికతో చెప్తాడు. "నీ ఇరిటేషన్ లో నువ్వు ఉన్నప్పుడు మా ఇరిటేషన్ లో మేము ఉంటాం కదా" అని ప్రియాంక అంటుంది. ఇక అశ్విని వంతు వచ్చినప్పుడు.." ప్రశాంత్ ఈ డిజర్వ్, అన్ డిజర్వ్ లో తీయడానికి అసలు ఇక్కడ ఎవరికీ అర్హత లేదు" అని అనగానే టేస్టీ తేజ.." ప్రశాంత్ ని తీయడానికి ఇక్కడ ఎవరికీ అర్హత లేదు అన్నావ్. అసలు ఆ స్టేట్మెంట్ ఏంటి?" అని తేజ అశ్వినీని అడుగుతాడు. వాళ్లను నేనేమీ అనలేదు అని అశ్విని సమర్ధించుకుంటుండగా తేజ.. "ఇక్కడున్న ఎవ్వరికీ అర్హత లేదు అన్నావు. నువ్వు ఎవరు చెప్పడానికి?" అంటూ అశ్విని పై ఫైర్ అవుతాడు. "నేను ఆపోజిట్ లో ఉన్నంతవరకు అయిన వాళ్ళను ఇంకోసారి అవ్వనివ్వను" అంటూ అమర్ దీప్ చెప్పడంతో ప్రోమో ఎండ్ అవుతుంది.

Also Read : నువ్వు పిచ్చోడివి అంటూ రెచ్చగొట్టిన శోభ.. మిర్చిదండ నేలకేసి కొట్టిన యావర్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 

టాప్ హెడ్ లైన్స్

Nikhil Vijayendra Simha: డిజిటల్ స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ.. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ రేస్ వరకు.. కెరీర్, రియల్ లైఫ్ ముచ్చట్లు!
డిజిటల్ స్టార్ నిఖిల్ విజయేంద్ర సింహ.. యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ రేస్ వరకు.. కెరీర్, రియల్ లైఫ్ ముచ్చట్లు!
Kadali Satyanarayana: బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు!
బిగ్ బాస్ 10 తెలుగులోకి రచయిత్రి.. కడలి సత్యనారాయణ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Rocking Rakesh: మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి జబర్దస్త్ వరకు.. రాకింగ్ రాకేష్ రియల్ లైఫ్ విశేషాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget