By: Suresh Chelluboyina | Updated at : 21 Sep 2023 05:49 PM (IST)
Image Credit: Star Maa, Disney Hotstar
‘బిగ్ బాస్’లో ప్రస్తుతం పవర్ అస్త్ర కంటెస్టెంట్‌ల ఎంపిక జరుగుతోంది. అల్రెడీ బిగ్ బాస్ ఎంపిక చేసిన కంటెస్టెంట్లకు, వారిని వ్యతిరేకించిన ఇతర కంటెస్టెంట్లకు మధ్య ‘బిగ్ బాస్’ టాస్కులు పెడుతున్నాడు. ఇప్పటికే యావర్.. ఒక టాస్క్ గెలిచి పవర్ అస్త్రా పోటీకి సిద్ధమయ్యాడు. శోభాశెట్టి కూడా స్పైసీ చికెన్ టాస్క్‌లో శోభ, గౌతమ్, పల్లవి ప్రశాంత్‌లతో పోటీపడింది. ఆమే ఈ టాస్కులో గెలిచినట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరు పవర్ అస్త్ర పోటీకి సిద్దమైన నేపథ్యంలో అమర్ దీప్ వంతు వచ్చింది. అయితే, ఎవరూ ఊహించని టాస్క్ ఇచ్చి ‘బిగ్ బాస్’ అమర్ దీప్‌ను ఇరకాటంలో పెట్టేశాడు.
ఈ వారం పవర్ అస్త్ర కోసం ‘బిగ్ బాస్’ అమర్ దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టిలను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే, వారు పవర్ అస్త్ర పోటీకి అర్హులు కాదు అనడానికి కారణాలు చెప్పాలంటూ ‘బిగ్ బాస్’ ఫిట్టింగ్ పెట్టాడు. ఈ రోజు (గురువారం) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో శోభా శెట్టి, అమర్ దీప్‌లో టాస్క్‌లను ఎదుర్కోనున్నారు. శోభ శెట్టికి కారంతో ఉన్న చికెన్ తినే టాస్క్ ఇచ్చాడు ‘బిగ్ బాస్’. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్, శోభ, గౌతమ్‌లకు కూడా అదే టాస్క్ ఇచ్చాడు. ఇందులో శోభాశెట్టి గెలిచినట్లు సమాచారం. ఇక అమర్ దీప్, ప్రియాంకల విషయానికి వస్తే.. జుట్టును త్యాగం చేసే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. పవర్ అస్త్రకు తాము అర్హులమని భావిస్తే.. జుట్టు కత్తిరించుకోవాలని మెలిక పెట్టాడు. దీని ప్రకారం ప్రియాంక చెవుల వరకు జుట్టును కత్తిరించుకోవాలి. ఇక అమర్ అయితే దాదాపు గుండు చెయ్యించుకోవాలి. ట్రిమ్మర్‌తో 3 మిల్లీ మీటర్ల వరకు మాత్రమే జుట్టు ఉండేలా జుట్టును కత్తిరించుకోవాలి. దీంతో ప్రియాంక తాను అందుకే సిద్ధమేనని చెప్పేసింది. అమర్ మాత్రం వెనకడుగు వేస్తున్నాడు.
అమర్ తన జుట్టుపై ఉన్న ఇష్టం గురించి చెప్పకుంటూ వచ్చాడు. ‘‘నేను రవితేజ హార్డ్‌కోర్ ఫ్యాన్. ఆయన హగ్ చేసుకుని నా జుట్టు మీద చెయ్యి పెట్టి నాలాగే ఉందన్నారు’’ అమర్ దీప్ అన్నాడు. దీంతో టేస్టీ తేజ ‘‘జుట్టుదేముంది భయ్యా మళ్లీ వచ్చేస్తుంది. కాకపోతే కాస్త టైమ్ పడుతుంది అంతే’’ అని అని పంచ్ వేశాడు. అమర్ దీప్ గుండుకు వెనకాడుతున్నా.. ప్రియాంక మాత్రం ఉత్సాహంగా ఉన్నట్లే కనిపిస్తోంది. అమర్ ఫీలవుతాడనే ఉద్దేశంతో.. తనకు జుట్టు కత్తిరించుకోవడం ఇష్టం లేదు అన్నట్లుగా పైపైన మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తోంది. మరి, ఇద్దరిలో ఎవరు జుట్టు త్యాగం చేస్తారో చూడాలి.
శోభాని వ్యతిరేకించిన ముగ్గురు ఇంటి సభ్యులతో పోటీ పడి కంటెండర్ షిప్ ని డిఫెండ్ చేసుకునే అవకాశాన్ని బిగ్ బాస్ తనకి ఇచ్చాడు. కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ఎదురుగా బౌల్ లో అత్యంత కారంగా ఉన్న చికెన్ తినమని బిగ్ బాస్ ఆదేశించాడు. మీలో గెలవాలనే ఆకలిని నిరూపించుకునే సమయం వచ్చిందని చెప్పారు. శోభా కారంగా ఉన్న చికెన్ తినేందుకు చాలా వరకు ట్రై చేసింది. తన లైఫ్ లో ఇంతవరకు ఎప్పుడు ఇంత కారం తినలేదని ఏడ్చేసింది. మీరు ఎంత ఎక్కువ కారం తింటే అది మీ ప్రత్యర్థులని బీట్ చేయడానికి ఇచ్చే బెంచ్ మార్క్ అవుతుందని బిగ్ బాస్ చెప్పాడు. పాపం ఒకానొక టైమ్ లో కారం తట్టుకోలేక బాగా ఏడ్చింది. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేటప్పుడు ఏడవనని అమ్మకి మాట ఇచ్చాను కానీ అంటూ కారం ఘాటు తట్టుకోలేక గుక్కపట్టి ఏడ్చేసింది. శోభాని వ్యతిరేకించిన శుభశ్రీ, ప్రశాంత్, గౌతమ్ కృష్ణ ముందు కారంగా ఉన్న చికెన్ పెట్టారు. ముగ్గురిలో ఎవరు త్వరగా వాటిని తినేస్తారో వాళ్ళు శోభ స్థానంలో కంటెండర్ గా ఉంటారని బిగ్ బాస్ వాళ్ళకి పోటీ పెడతాడు. గౌతమ్ తింటుంటే అయ్యయ్యో డాక్టర్ బాబు అని దామిని అంటుంది. ముగ్గురు కూడా పోటా పోటీగా స్పైసీ చికెన్ లాగించేస్తూ కనిపించారు. మరి ఈ పోటీలో ఎవరు విజేతలుగా నిలిచారు. లేదంటే శోభానే కంటెండర్ గా కొనసాగిందా లేదా తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.
Also Read: ఫేక్ సింపతీ గేమ్స్ ఎప్పటివరకు? ‘బిగ్ బాస్’ రతికపై రాహుల్ సిప్లిగంజ్ కామెంట్స్?
Shobha Shetty: బిగ్ బాస్: 14 వారాలకు శోభా శెట్టి అందుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే?
Bigg Boss 7 Telugu: అమర్, అలా అడిగేశావ్ ఏమిటీ? నాగార్జున ధరించిన ఆ స్వెటర్ ధర ఎంతో తెలుసా?
Bigg Boss 7 Telugu: అమర్‌కు ‘బిగ్ బాస్’ సర్‌ప్రైజ్ - చూస్తుంటే బాధగా ఉందంటూ వ్యాఖ్యలు
Bigg Boss 17: బిగ్ బాస్‌లోకి కొరియన్ పాప్ సింగర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ నుంచి శోభా శెట్టి ఔట్ - అమర్‌దీప్ వీడియో చూసి షాక్
TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం
Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!
Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !
YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు
/body>