Bigg Boss Telugu 5 : లీకైన నామినేషన్ లిస్ట్.. ఎవరెవరు ఉన్నారో తెలుసా..?
బిగ్ బాస్ హౌస్ లో రెండో వారం రచ్చ మొదలైంది.
బిగ్ బాస్ హౌస్ లో రెండో వారం రచ్చ మొదలైంది. ఇప్పటికే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా సరయు బయటకు రాగా.. రెండో వారం నామినేషన్ ప్రక్రియను సోమవారం ఎపిసోడ్ లో మొదలుకానుంది. అయితే ఎపిసోడ్ ఇంకా టెలికాస్ట్ కాకముందే నామినేషన్ లిస్ట్ ఒకటి బయటకు వచ్చేసింది. నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. ఇందులో శ్వేతా వర్మ హమీద, లోబోలపై మండిపడింది. మొదటిసారి శ్వేతా అరుస్తూ మాట్లాడడం చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.
Also Read : Samantha on Twitter: అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టిన సమంత.. ఇప్పటికైనా రూమర్లు ఆగుతాయా..?
మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ మాత్రం రసవత్తరంగా ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. ఒక్కో కంటెస్టెంట్ చాలా ఫైర్ మీద ఉన్నారనిపిస్తుంది. అయితే రెండో వారంలోకి వచ్చిన నామినేషన్ సభ్యుల లిస్ట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కార్తీక దీపం ఉమాదేవి, యానీ మాస్టర్, నటరాజ్, ప్రియాంక సింగ్, ప్రియా, ఆర్జే కాజల్, లోబోలు నామినేషన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే ఈసారి కాజల్ తప్ప అందరూ కొత్తగా నామినేషన్ లోకి ఎంటర్ అయినవాళ్లే.
వీరిలో ఉమాదేవి, నటరాజ్ లాంటి వాళ్లకు సోషల్ మీడియాలో పెద్దగా ఫాలోయింగ్ లేదు కాబట్టి వాళ్లపై ఎలిమినేషన్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. మరి ఈ వారం ఎవరెవరు ఎలా ఆడతారో.. ఎలాంటి ఇమేజ్ ను దక్కించుకుంటారో చూడాలి!
Nominations day .. It's going to be tough for sure!#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/mlTpWPeZSw
— starmaa (@StarMaa) September 13, 2021
Nominations lo fire chala gattiga undi 🔥 #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/rtXHSEsmWV
— starmaa (@StarMaa) September 13, 2021
Also Read : Love Story Update: ‘లవ్ స్టోరీ’ ట్రైలర్: బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవను జాబ్ అడిగితే పొమ్మంటాడట.. డైలాగ్స్ భలే ఉన్నాయ్!
Also Read: ఖరీదైన కారు కొన్న చెర్రీ.. స్పెషల్‌గా డిజైన్ చేయించుకున్న మెగా పవర్ స్టార్, ధర ఎంతంటే..
Also Read: సాయిధరమ్ తేజ్‌కు కాలర్ బోన్ సర్జరీ పూర్తి.. హెల్త్ బులెటిన్ విడుదల