అన్వేషించండి

Bigg Boss 9: 'బిగ్ బాస్' సీజన్ 9 అప్ డేట్ వచ్చేసింది - హోస్ట్ కింగ్ నాగార్జున ఎంట్రీ అదుర్స్

Bigg Boss: ఫేమస్ రియాలిటీ షో 'బిగ్ బాస్' నుంచి అప్డేట్ వచ్చేసింది. సీజన్ 9కు కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా... తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో అదిరిపోయింది.

Bigg Boss Season 9 Promo Released: టీవీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఫన్ అందించే ఫేమస్ రియాల్టీ షో 'బిగ్ బాస్' కొత్త సీజన్ అప్డేట్ వచ్చేసింది. ఈసారి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేయగా వైరల్ అవుతోంది.

నాగ్ ఎంట్రీ అదుర్స్

'బిగ్ బాస్' సీజన్ 9 ప్రోమోలో హోస్ట్ నాగ్ ఎంట్రీ అదిరిపోయింది. స్టైలిష్ లుక్‌లో తనదైన డైలాగ్‌తో గూస్ బంప్స్ తెప్పించారు. 'ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. గెలుపు రావాలంటే యుద్ధం సరిపోదు ప్రభంజనం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు రణరంగమే.' అంటూ నాగ్ చెప్పే డైలాగ్ భారీ హైప్ క్రియేట్ చేసింది.

ఆ రూమర్లకు చెక్

గతంలో 'బిగ్ బాస్' హోస్ట్‌ను మారుస్తారనే ప్రచారం సాగింది. తాజా ప్రోమోతో మళ్లీ హోస్ట్‌గా కింగ్ నాగార్జునే ఉంటారని కన్ఫర్మ్ అయ్యింది. ఫస్ట్ సీజన్‌కు ఎన్టీఆర్, సెకండ్ సీజన్‌కు నాని హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత సీజన్ల నుంచి నాగార్జునే హోస్ట్‌గా ఉన్నారు. 'బిగ్ బాస్' అంటేనే గుర్తొచ్చేలా నాగ్ ఆ షోకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సీజన్ 9కు కొత్త హోస్ట్ వస్తారని రూమర్స్ వచ్చాయి. బాలకృష్ణ, విజయ్ దేవరకొండ పేర్లు వినిపించాయి. అయితే, కింగ్ నాగార్జుననే ఈ షోకు మళ్లీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

వెయిటింగ్ చెక్.. ఎగ్జైటింగ్

బిగ్ బాస్ అంటే టీవీ ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌కు ఎప్పటికీ క్రేజే. ఈ షోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారి వెయిటింగ్‌కు చెక్ పెట్టారు. ఇక ఈ షోలో పార్టిసిపెంట్స్, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇక సీజన్ 8లో విన్నర్‌గా నిఖిల్ నిలిచారు. ఫైనల్‌లో గౌతమ్‌ను వెనక్కి నెట్టి రూ.55 లక్షల ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీ, మారుతీ కారును గెలుచుకున్నారు. మొత్తం 21 మంది కంటెస్టెంట్లను వెనక్కు నెట్టి తన ఆటతో గెలుపు సొంతం చేసుకున్నారు.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by STAR MAA (@starmaa)

Also Read: కన్నప్ప ట్విట్టర్ రివ్యూ: ప్రభాస్ ఎంట్రీకి అరుపులే... సర్‌ప్రైజ్ చేసిన విష్ణు మంచు... సోషల్ మీడియాలో సినిమా టాకేంటి?

కంటెస్టెంట్స్ వాళ్లేనా..

బిగ్ బాస్ సీజన్ 9లో కంటెస్టెంట్స్ ఎవరనే దానిపై ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ 2లో ఉన్న వారిలో చాలా మంది ఈ షోలో భాగం కానున్నట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ కుకింగ్ షో 'కూకు విత్ జాతిరత్నాలు' కామెడీ షోలోని కంటెస్టెంట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆగస్ట్ లాస్ట్ వీక్ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో షో స్టార్ట్ కానుంది.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అపూర్వని బయటకు పంపేసిన ఇంటి సభ్యులు! ఇంట్లో దోమగా మారిపోయిన ముకేశ్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అపూర్వని బయటకు పంపేసిన ఇంటి సభ్యులు! ఇంట్లో దోమగా మారిపోయిన ముకేశ్!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి ఆ జంట సేఫ్! అపూర్వ, షాలినిలకు గొడవ పెట్టేసిన రోహిత్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఆ జంట సేఫ్! అపూర్వ, షాలినిలకు గొడవ పెట్టేసిన రోహిత్!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: దేబ్జానీకి లవ్‌ ప్రపోజ్ చేసిన కామనర్స్! రాంప్రసాద్ బావగారు ఆ ఇద్దరిలో ఎవరో?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: దేబ్జానీకి లవ్‌ ప్రపోజ్ చేసిన కామనర్స్! రాంప్రసాద్ బావగారు ఆ ఇద్దరిలో ఎవరో?
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వని ఒంటరిని చేసేసిన గ్రూప్స్! రానున్న సునామీని అడ్డుకోవడానికి 5 టీమ్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వని ఒంటరిని చేసేసిన గ్రూప్స్! రానున్న సునామీని అడ్డుకోవడానికి 5 టీమ్స్!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget