అన్వేషించండి

Bigg Boss Season 7: ఆ ఇద్దరికి బ్రెయిన్‌ లేదు అంటున్న కంటెస్టెంట్స్, భోలే బిగ్ బాస్‌కు ఎందుకు వచ్చాడో తెలీదట!

Bigg Boss Season 7: బిగ్ బాస్ సీజన్ 7లో వేర్వేరు బ్యాక్‌గ్రౌండ్స్ నుండి వచ్చిన కంటెస్టెంట్స్ అంతా ఒక్కచోట ఉంటారు కాబట్టి అందరికీ ఒక్కొక్క కంటెస్టెంట్‌పై ఒక్కొక్క విధమైన అభిప్రాయం ఏర్పడుతుంది.

బిగ్ బాస్ రియాలిటీ షోలలో వీకెండ్ ఎపిసోడ్‌లో ఎంత ఫన్ ఉంటుందో.. అంతే సీరియస్ యాంగిల్ కూడా ఉంటుంది. మామూలుగా ప్రతీ శనివారం ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో నాగార్జున.. కంటెస్టెంట్స్‌తో ఆడించే గేమ్స్ సరదాగానే ఉన్నా.. దాని వల్ల కంటెస్టెంట్స్ మధ్య గొడవలు ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుంది. తాజాగా అలాంటి ఒక టాస్కే కంటెస్టెంట్స్‌తో ఆడించారు నాగ్. కంటెస్టెంట్స్ ముందు మూడు రకాల ట్యాగ్స్ పెట్టారు. అవే ‘బ్రెయిన్‌లెస్, యూజ్‌లెస్, ఏయిమ్‌లెస్’. అంటే ఒక్కొక్క కంటెస్టెంట్ వచ్చి తమ దృష్టిలో ఎవరు ఎక్కువగా మెదడు ఉపయోగించడం లేదని అనుకుంటున్నారో లేదా ఎవరు హౌజ్‌లో పనికిరారు అనుకుంటున్నారో లేదా ఎవరైతే లక్ష్యం లేకుండా ముందుకు వెళుతున్నారని అనుకుంటున్నారో చెప్పమన్నారు. అయితే కంటెస్టెంట్స్‌లో ఎక్కువమంది ఇద్దరిని బ్రెయిన్‌లెస్ అని, ఒకరిని ఏయిమ్‌లెస్ అని ఫిక్స్ చేశారు.

ఆట మొదలుపెట్టని భోలే షావలి..
ఈ టాస్కును అర్జున్‌తో మొదలుపెట్టమన్నారు నాగార్జున. దీంతో ముందుగా అర్జున్ వచ్చి ఏయిమ్‌లెస్ అనే ట్యాగ్‌ను తీసుకొని భోలే షావలి మెడలో వేశాడు. భోలే ఎప్పుడూ సరదాగా ఉంటూ, అందరినీ నవ్విస్తూ ఉంటున్నారు కానీ అసలు ఏది లక్ష్యం పెట్టుకోకుండా బిగ్ బాస్‌లోకి వచ్చారేమో అనిపిస్తుందని అర్జున్ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు. అర్జున్ తర్వాత ప్రియాంక కూడా భోలే ఏయిమ్‌లెస్ అని ఫీల్ అయ్యింది. సందీప్ కూడా అసలు భోలే ఇంకా గేమ్ సీరియస్ తీసుకోవడం లేదని, ఫన్నీగా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారు కానీ ఒక్కొక్కసారి ఆయన మాటలకు కంట్రోల్ ఉండడం లేదని అన్నాడు. సందీప్, ప్రియాంక, అర్జున్.. భోలేను ఏయిమ్‌లెస్ అని భావిస్తే.. అమర్‌దీప్ మాత్రం బ్రెయిన్‌లెస్ అని భావించి తనకు ఆ ట్యాగ్‌ను ఇచ్చాడు.

జీనియస్ టాస్కులో ఫెయిల్..
ఇక ఈ వారం అమర్‌దీప్ ఆట బాగుందని నాగార్జున ప్రశంసించారు. కానీ కంటెస్టెంట్స్ మాత్రం తనను బ్రెయిన్‌లెస్ అని ట్యాగ్ వేశారు. ఇక శివాజీ తన అభిప్రాయాన్ని చెప్పడానికి ముందుకు వచ్చిన ప్రతీసారి అందులో అమర్‌దీప్ పేరు కచ్చితంగా ఉంటుంది. ఈసారి కూడా జీనియస్‌ టాస్క్‌లో అమర్‌దీప్ సరిగా ఆడకపోవడం వల్లే తనకు బ్రెయిన్‌లెస్ ట్యాగ్ ఇస్తున్నట్టు కారణం చెప్పి మరీ ఇచ్చారు శివాజీ. ఇక గౌతమ్ కూడా అదే టాస్క్‌ను గుర్తుచేసుకొని అమర్‌కు బ్రెయిన్‌లెస్ ట్యాగ్‌ను ఇచ్చాడు. ప్రిన్స్ యావర్ కూడా తనతో కూల్ డ్రింక్ విషయంలో గొడవపడ్డాడని, కెప్టెన్ తప్పా కూల్ డ్రింక్ తాగే అధికారం ఎవరికీ లేదని తెలిసినా.. గొడవపడ్డాడని అమర్‌ను బ్రెయిన్‌లెస్ అన్నాడు యావర్.

అశ్వినితో పూజా పోటీ..
వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అయిన అశ్విని శ్రీ.. మొదటిరోజు నుండే అందరితో గొడవపెట్టుకోవడం మొదలుపెట్టింది. దీంతో నయని పావని, పూజా, శోభా శెట్టి.. అశ్వినితో అయిన గొడవలను గుర్తుచేసుకొని తనకు బ్రెయిన్‌లెస్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఈ క్రమంలో తను స్ట్రాంగ్ అని చెప్పినా ఎవరూ నమ్మడం లేదని అశ్విని వాపోయింది. దీంతో పూజాతో కలిసి చేతి కుస్తీలో పోటీపడమని నాగార్జున చెప్పారు. ఆడిన మూడు ఆటల్లో రెండుసార్లు అశ్వినినే గెలిచి చూపించింది. అయితే తనను అందరూ కలుపుకోవాలి అంటే ముందు తను అందరితో కలవాలి అని అశ్వినికి సలహా ఇచ్చారు నాగార్జున.

Also Read: శోభా శెట్టి, తేజ డేటింగ్ - మోకాళ్లపై కూర్చొని ప్రపోజల్, శోభా సమాధానం ఇదే!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
'బిగ్ బాస్'కి వెళ్ళట్లేదు... అదంతా ఫేక్ - క్లారిటీ ఇచ్చిన యంగ్ ఫిమేల్ యాంకర్
Futa Japan: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో జపాన్ కుర్రాడు ఫుతా.. తెలుగుపై ప్రేమ.. రియల్ లైఫ్ విశేషాలు
Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget