Bigg Boss Season 7 Nominations : క్షమిస్తే అయిపోద్ది కదా అన్న శివాజీ.. కామన్సెన్స్ లేదంటూ మండిపడిన శోభ
ఆదివారం రతిక బిగ్ బాస్ ఇంట్లోకి రీ ఎంట్రీ ఇవ్వగా.. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది.
దసరా, బతుకమ్మ సెలబ్రేషన్స్‌తో అదిరేలా ఎంజాయ్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్.. సోమవారం నామినేషన్స్‌తో ఫైర్‌గా మారారు. ఆదివారం ప్రేమలు, అనురాగం, ఆప్యాయతలు కురింపించుకుని ఈ రోజు నామినేషన్స్‌లో నిప్పులు చెరుగుతున్నారు. నామినేషన్స్ అంటేనే ఒకరు మరో కంటెస్టెంట్‌పై తమనకు నచ్చని విషయాన్ని చెప్పడం.. ఎదుటివారు కంటెస్టెంట్ ఆలోచనలను తప్పుబట్టడం జరుగుతుంది. ఈ వారం నామినేషన్స్‌లో కూడా అదే జరుగుతుంది.
శోభను నామినేట్ చేసిన శివాజీ..
తాజాగా విడుదలైన బిగ్‌బాస్ నామినేషన్స్ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఇంట్లో ఉండడానికి ఏ ఇద్దరు అనర్హులో వారి ఫోటోలను మంటలో వేయాలని బిగ్‌బాస్ ఆదేశించారు. ప్రోమోలో భాగంగా ముందుగా శివాజీ ఇద్దరిని నామినేట్ చేసేందుకు ముందుకు వచ్చారు. భోలే విషయమై శివాజీ.. శోభను నామినేట్ చేశారు. "తను తప్పు మాట్లాడాడు 100%. రెండు వందల పర్సెంట్ తప్పే. కానీ వెంటనే ఆ విషయంపై సారీ కూడా చెప్పాడు. మన తోటి మనిషే కదా. క్షమిస్తే ఏమిపోద్ది అని నా అభిప్రాయం" అని శివాజీ అనగా.. "మీకు దేవుడు క్షమించే మనసు ఇచ్చాడు. నాకు క్షమించే మనసు ఇవ్వలేదు" అంటూ శోభ బదులు చెప్పింది.
"నిన్ను మార్చే హక్కు కానీ, నిన్ను మారమని ప్రెజర్ చేసే రైట్ కానీ నాకు లేవు" అంటూ శోభ ఫోటోను శివాజీ మంటల్లో వేశారు. "కామన్ సెన్స్ కూడా ఉండదు నామినేషన్స్ వేస్తారు" అంటూ శోభ తన ఫీలింగ్ వెల్లడించింది. శివాజీ నామినేషన్స్ తర్వాత గౌతమ్ నామినేషన్స్ ప్రక్రియ చేశాడు. ప్రశాంత్‌ని తను నామినేట్ చేస్తున్నట్లు వెల్లడించాడు.
రైతు బిడ్డను నామినేట్ చేసిన గౌతమ్
"పూజా ఏమన్నది నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావుగా.. వేరేవాళ్లకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నది" అని గౌతమ్ అనగా.. "ఆ బుక్‌లో ఏమున్నది" అంటూ ప్రశాంత్ రిప్లై ఇచ్చాడు. "అరేయ్ నీ కెప్టెన్సీ నేను దూరం చేసుంటే నన్ను ఆ విషయం అడుగురా" అని గౌతమ్ అనగా.. "మరి ఆ విషయంపైనేగా నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావంటూ ప్రశాంత్ కౌంటర్ వేశాడు. "నా ఫోటో కాలిపోతున్నా పర్లేదు కానీ.. నా గుండెల్లో మంట అలా రగులుతూనే ఉంటుంది" అంటూ గౌతమ్‌కి చెప్పాడు ప్రశాంత్.
కంటిన్యూ అవుతున్న భోళే-ప్రియాంక వార్
అనంతరం ప్రియాంక నామినేషన్స్ చేస్తూ.. భోళేను నామినేట్ చేస్తున్నట్లు తెలిపింది. భోళేను ఇమిటేట్ చేస్తూ.. ఆమెకి నచ్చని కారణాలు చెప్పింది. భోళే దానిని వ్యతిరేకించారు. కెప్టెన్సీ అనేది అరుదుగా దొరికే అవకాశం.. మీరు దానిని చాలా ఈజీగా వదిలేసుకున్నారు అంటూ ప్రియాంక వాదించగా.. మీకు ఈ జన్మలో పాజిటివ్‌గా ఉండడం రాదు అంటూ భోళే బదులిచ్చారు. ఇలా ఆర్గ్యూ చేస్తూ అతని ఫోటోను మంటల్లో వేసింది. రీ ఎంట్రీ తర్వాత రతికకు ఇది తొలి నామినేషన్స్ వారం. ఆమె ఎవరినీ నామినేట్ చేస్తుందో.. ఆమెను ఎవరు నామినేట్ చేస్తారో అని బిగ్‌బాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మొత్తంగా ఈ వారం ఎవరెవరూ నామినేషన్స్‌లో ఉంటారో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. ఈ రోజు ఎపిసోడ్లో ఇంకా హీట్ ఆర్గ్యూమెంట్స్ ఉంటాయని బిగ్‌బాస్ విశ్లేషకులు చెప్తున్నారు.
">
Also Read : శివాజీ కాళ్లు పట్టేసుకున్న రతిక, పట్టించుకోని పల్లవి ప్రశాంత్ - శోభా, ప్రియాంకలకు శివన్న షాక్