Bigg Boss Season 7 Day 16 Updates: పవర్ అస్త్రాను కొట్టేసిన అమర్‌దీప్‌కు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన శివాజీ - ఇప్పుడు ఏం చేస్తాడో!
మొదటి వారంలో సందీప్ పవర్ అస్త్రాను దొంగిలించిన కంటెస్టెంట్స్.. రెండోవారంలో శివాజీకి చెందిన పవర్ అస్త్రాను దొంగలించడానికి ట్రై చేశారు. కానీ శివాజీ వారి ఎత్తులకు పైఎత్తులు వేశాడు.
బిగ్ బాస్ సీజన్ 7ను ఇతర సీజన్స్ కంటే డిఫరెంట్‌గా మార్చిన అంశం పవర్ అస్త్రా. కెప్టెన్సీ టాస్క్‌ల స్థానంలో ‘పవర్ అస్త్రా’ను ప్రవేశపెట్టారు. అసలు ఈ పవర్ అస్త్రా ఎవరికి దక్కుతుంది అనే అంశమే ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. దీనికోసం జరుగుతున్న పోటీలు, టాస్కులు, దీని వల్ల కంటెస్టెంట్స్ మధ్య జరుగుతున్న గొడవలు ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయని బిగ్ బాస్ ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7లో రెండు వారాలు ముగిశాయి. ఈ రెండు వారాల్లో రెండు పవర్ అస్త్రాలను ఇద్దరు కంటెస్టెంట్స్ దక్కించుకున్నారు. వారే సందీప్, శివాజీ. కానీ మిగతా కంటెస్టెంట్స్‌లో పలువురు కలిసి.. సందీప్‌పై ఉపయోగించిన స్ట్రాటజీని శివాజీపై కూడా ఉపయోగించారు.
అప్పుడు సందీప్.. ఇప్పుడు శివాజీ..
పవర్ అస్త్రా పోటీలో గెలిచిన కంటెస్టెంట్స్‌కు రెండు షీల్డ్స్‌ను అస్త్రాలుగా అందజేశారు బిగ్ బాస్. ముందుగా మొదటి వారంలో ఆ పవర్ అస్త్రా షీల్డ్‌ను అందుకున్న కంటెస్టెంట్ సందీప్. అయితే ఆ పవర్ అస్త్రాను కాపాడుకోవాలని, కాపాడుకోలేకపోతే మెల్లగా బ్యాటరీ తగ్గిపోతుందని తనకంటూ ఒక బ్యాటరీని కూడా ఇచ్చారు. ఆ బ్యాటరీ రెడ్‌లోకి వచ్చేస్తే.. పవర్ అస్త్రాకు ఉన్న పవర్స్ అన్నీ పోతాయని బిగ్ బాస్ ముందే వార్నింగ్ ఇచ్చారు. అది గుర్తుపెట్టుకున్న కంటెస్టెంట్స్.. తన పవర్ అస్త్రాను కొట్టేసి దాచేశారు. ఈ విషయాన్ని మరికొందరు కంటెస్టెంట్స్.. తనకు లీక్ చేశారు. దీంతో అలర్ట్ అయిన సందీప్.. అతి తక్కువ సమయంలోనే తన పవర్ అస్త్రాను కాపాడుకోగలిగాడు. దీంతో బ్యాటరీ కూడా సేవ్ అయ్యింది. అదే స్ట్రాటజీని శివాజీపై కూడా ఉపయోగించాలని అనుకున్నాడు అమర్‌దీప్. కానీ అది తనకే రివర్స్ అయ్యింది.
అమర్‌దీప్ మాస్టర్ ప్లాన్..
రెండో వారంలో రెండు గ్రూపులుగా విడిపోయి పవర్ అస్త్రా కోసం పోటీపడ్డారు కంటెస్టెంట్స్. అందులో చివరిగా శివాజీనే పవర్ అస్త్రా వరించింది. అయితే శివాజీతో పవర్ అస్త్రా కోసం పోటీపడి ఓడిపోయిన అమర్‌దీప్.. ఆ అస్త్రాన్ని కొట్టేయాలని ప్లాన్ చేశాడు. శోభా శెట్టితో కలిసి ప్లాన్ గురించి చర్చించాడు. కచ్చితంగా ఆ పవర్ అస్త్రాను కొట్టేస్తానని అన్నాడు. అనుకున్నట్టుగానే ఎవరూ లేని సమయంలో ఆ పవర్ అస్త్రాను కొట్టేసిన అమర్‌దీప్.. అసలు ఎవరూ ఊహించని విధంగా బాత్‌రూమ్ రూఫ్‌లో దాన్ని దాచిపెట్టాడు. ఆ తర్వాత బిగ్ బాస్‌కు ఈ విషయాన్ని చెప్పాడు. కాసేపు అయిన తర్వాత తన పవర్ అస్త్రా పోయిందని గమనించిన శివాజీ.. కంటెస్టెంట్స్‌తో ఈ విషయాన్ని చెప్పాడు. తీసినవారిని క్షమించేది లేదు అంటూ వ్యాఖ్యలు చేశాడు.
శివాజీ ఎదురుదెబ్బ..
అసలు శివాజీ పవర్ అస్త్రాను ఎవరు కొట్టేశారు అంటూ పెద్ద చర్చే నడిచింది. అమర్‌దీప్‌ను అనుమానిస్తూ పల్లవి ప్రశాంత్ వ్యాఖ్యలు చేశాడు. కానీ అమర్‌దీప్ మాత్రం డౌట్ తన మీదకు రాకుండా చాలావరకు మ్యానేజ్ చేశాడు. అలా ఎలా చీప్‌గా కొట్టేస్తారు అంటూ అమర్‌దీప్ ముందే శివాజీ తిట్టినా.. అమర్ మాత్రం తన మీదకు డౌట్ రానివ్వలేదు. ఇంతలోనే మూడోవారంలో పవర్ అస్త్రా కోసం పోటీపడుతున్న అమర్‌దీప్, యావర్, శోభా శెట్టిలకు కంటెండర్స్ అంటూ బ్యాచ్‌లు వచ్చాయి. ఆ బ్యాచ్‌లను వారికి చూపిస్తుండగానే.. శివాజీ వాటిని తీసుకున్నాడు. అసలు వారికి ఇవ్వనని, తన పవర్ అస్త్రా ఎవరు కొట్టేసారో.. వారు దానిని తిరిగి ఇచ్చిన తర్వాతే కూల్ అవుతానన్నాడు. దీంతో శివాజీ మరోసారి తన మైండ్ గేమ్‌తో అమర్‌దీప్ మైండ్ బ్లాక్ చేశాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
Also Read: ‘బేబీ 2’ చూపిస్తున్న రతిక - ప్రశాంత్‌తో గిల్లికజ్జాలు, ప్రిన్స్‌కు వెన్నుపోటు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial