Bigg Boss Telugu Winner Revanth: బిగ్‌బాస్ సీజన్ 6 విజేత రేవంత్ - అప్పుడు ఐడల్, ఇప్పుడు బిగ్‌బాస్
Bigg Boss Winner Revanth: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 విన్నర్ ని ప్రకటించేశారు. అందరూ ఊహించినట్టే రేవంత్ విన్నర్ అయ్యాడు.
Bigg Boss Winner Revanth: బిగ్‌బాస్ సీజన్ 6కు గ్రాండ్‌గా ముగింపు పలికారు. ముందు నుంచి అనుకున్నట్టే సింగర్ రేవంత్ విన్నర్ అయ్యాడు. ఈ సీజన్ మొదలైన కొన్ని వారాలకే రేవంత్ విన్నర్ అని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు. మొదట్నించి ఓటింగ్లో రేవంతే టాప్. విన్నర్‌ను ప్రకటించడానికి ముందు... బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున ఎంత చక్కగా చేశారో చెబుతూ ఆయన జర్నీని చూపించారు. మొత్తం ఈ సీజన్లోని మంచి మూమెంట్లను వేశారు. కంటెస్టెంట్లను తిట్టిన క్షణాలు, పొగిడిన క్షణాలు కలగలిపి ప్రదర్శించారు. తరువాత మాజీ కంటెస్టెంట్లను ఎవరు గెలుస్తారో ఊహించి చెప్పమని అడిగారు. 10 మంది శ్రీహాన్ అని చెప్పారు. మిగతా 9 మంది రేవంత్ గెలవాలని చెప్పారు.
ఇంట్లోకి గోల్డెన్ సూట్‌కేసుతో వెళ్లారు నాగార్జున. ఈ సూట్ కేసులో 25 లక్షలు ఉందని, ఆలోచించి ఆ మొత్తాన్ని తీసుకుని ఇంట్లోంచి ఎలిమినేట్ వెళ్లిపోవచ్చని చెప్పారు. మిగిలిన వ్యక్తి విన్నర్ అవుతారని, అతనికి ట్రోఫీ, మిగిలిన డబ్బు అందుతుందని చెప్పారు. అయినా రేవంత్, శ్రీహాన్ టెంప్ట్ అవ్వలేదు. నాగార్జున చాలా కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఇద్దరూ ట్రోఫీ మాత్రమే కావాలని చెప్పారు రేవంత్, శ్రీహాన్. తరువాత సూట్ కేసులో మొత్తాన్ని 30 లక్షల రూపాయలకు పెంచారు. అయినా కూడా వారిద్దరూ ఒప్పుకోలేదు. దీంతో మాజీ కంటెస్టెంట్లు మాత్రం ఎక్కువ మంది శ్రీహాన్ ఆ సూట్‌కేసు తీసుకోమని సూచించారు. వారిద్దరినీ తీసుకుని వేదిక మీదకు వచ్చారు నాగార్జున. శ్రీహాన్, రేవంత్ బిగ్ బాస్ ఇంటికి వీడ్కోలు చెప్పారు. తరువాత నాగార్జున సూట్ కేసులోని మొత్తాన్ని 40 లక్షల రూపాయలకు పెంచాడు. శ్రీహాన్ తండ్రి తీసుకోమని కొడుక్కి చెప్పాడు. దీంతో శ్రీహాన్ 40 లక్షల రూపాయలు తీసుకున్నాడు.
ఇద్దిరి చేతులు పట్టుకుని నిల్చున్నారు నాగార్జున. వారిద్దరిలో రేవంత్‌ను విన్నర్ గా ప్రకటించారు. శ్రీహాన్ రన్నర్ గా మిగిలారు. విన్నర్ అయ్యే సరికి రేవంత్ ఆనందం మామూలుగా లేదు. బిగ్ బాస్ రావడానికి ముందే ఆయన తాను విన్నర్ అయి వస్తానని గట్టిగా చెప్పి వెళ్లాడు. అతడు చెప్పినట్టే విజేతగా రావడం గొప్పే. అతని తల్లి సీతా సుబ్బలక్మ్షి కొడుకు విజయాన్ని చూసి చాలా ఆనందపడింది.
View this post on Instagram
Also read: ‘బిగ్ బాస్’ జర్నీ చూసి ఎమోషనల్ అయిన కంటెస్టెంట్స్ - గీతూ మాత్రం మారలే, అదే ఏడుపు!