By: ABP Desam | Updated at : 18 Mar 2022 03:44 PM (IST)
డేంజర్ జోన్ లో ఆ ముగ్గురు కంటెస్టెంట్స్
మొదటివారంలో హౌస్ నుంచి ముమైత్ ఎలిమినేట్ కాగా.. రెండోవారం ఎలిమినేషన్ లో శ్రీరాపాక బయటకొచ్చేసింది. ఇక మూడో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడానికి పన్నెండు మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారెవరంటే.. మిత్రా, శివ, చైతు, తేజస్వి, అజయ్, స్రవంతి, అఖిల్, మహేష్, హమీద, నటరాజ్, అరియానా, బిందు. ఇందులో తేజస్వి, బిందు, అజయ్, స్రవంతి మొదటిసారి నామినేషన్స్ లోకి వచ్చారు. గతవారం ఓటింగ్ లో అఖిల్ టాప్ ప్లేస్ లో ఉన్న సంగతి తెలిసిందే.
అయితే ఈసారి హౌస్ లో ఎక్కువమంది నామినేషన్స్ లో ఉండడం వలన ఎవరికి ఎంత పెర్సెంట్ ఓటింగ్ జరుగుతుందనేది అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ ద్వారా తెలుస్తోంది. ఈసారి ఊహించని విధంగా బిందు మాధవి.. అఖిల్ కి టఫ్ ఫైట్ ఇచ్చింది. మొదటి వారం నుంచి కూడా బిందు.. అఖిల్ వ్యతిరేకంగానే ఉంది. దీంతో వీరిద్దరి మధ్య పోటీ నెలకొంది. ఓటింగ్ లో అఖిల్ ని ఓవర్ టేక్ చేసి ముందుకు దూసుకుపోతుంది బిందు.
అఖిల్ కి 27 శాతం ఓటింగ్ వస్తే.. బిందుకి 28 శాతం వరకు ఓటింగ్ వచ్చింది. అయితే ఇది కేవలం అన్ అఫీషియల్ ఓటింగ్ మాత్రమే. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఓటింగ్ ఎలా జరిగిందనేది ముఖ్యం. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ వారం డేంజర్ జోన్ లో ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది. వారెవరంటే.. నటరాజ్ మాస్టర్, అజయ్, స్రవంతి. ముఖ్యంగా స్రవంతి, అజయ్ లకు ఓట్లు పెద్దగా పడలేదని తెలుస్తోంది. చాలా తక్కువ పెర్సెంటేజ్ లో ఓటింగ్ జరిగిందట.
మరి వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరం. ప్రస్తుతం అన్ని చోట్లా అయితే.. అజయ్, స్రవంతి ఇద్దరు మాత్రమే లీస్ట్ పొజిషన్ లో ఉన్నారు. ఎలిమినేషన్ జరిగితే వీరిద్దరి మధ్యలోనే జరిగే అవకాశం కనిపిస్తోంది.
Also Read: పార్టీలో ఆ హీరోయిన్ తో విజయ్ దేవరకొండ, వీడియో తీసిన ఛార్మి
Also Read: డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి 'Y' కేటగిరీ సెక్యూరిటీ
ఇక ఈరోజు ఎపిసోడ్ లో అరియనా, సరయుల మధ్య ఇష్యూ జరిగినట్లు తెలుస్తోంది. అరియనా సరదాగా చేసిన కామెంట్ కి సరయు బాగా హర్ట్ అయింది. ఏడ్చేసింది కూడా.. కానీ అరియనా, శివ మాత్రం చిన్న విషయాన్ని పెద్దది చేస్తుందంటూ నవ్వుకున్నారు.
Guri tappithe koodu undadu! Aim lekunte em chestaru ee housemates? Chudandi 9 PM #BiggBossNonstop @DisneyPlusHS lo!#BiggBoss #BiggBoss@EndemolShineIND pic.twitter.com/X56r0FlzAu
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 18, 2022
Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం
Urfi Javed: పగిలిన గాజు ముక్కలతో డ్రెస్, ఉర్ఫి జావెద్ మరో అరాచకం, తాకితే చేతులు తెగుతాయ్!
Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?
Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
Bindu Madhavi vs Nataraj: నటరాజ్తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం
PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్పోర్ట్
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి