Bigg Boss 7 Telugu: ‘బిగ్ బాస్’ బంపర్ ఆఫర్ - సూట్‌కేసులో రూ.15 లక్షలు, ఆలోచనలో పడిన శివాజీ
Bigg Boss Telugu 7: సీజన్ 7లో ఉన్న టాప్ 6 కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇచ్చారు. రూ.15 లక్షల సూట్‌కేస్ ఇచ్చి ఆ క్షణమే గేమ్ నుంచి తప్పుకోవచ్చన్నారు.
Telugu Bigg Boss 7: ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో మిగిలిపోయిన టాప్ 6 కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా ఎంటర్‌టైన్ చేయాలని బిగ్ బాస్ ఫిక్స్ అయ్యారు. అందుకే కంటెస్టెంట్స్‌కు బ్యాక్ టు బ్యాక్ ఫన్నీ టాస్కులు ఇస్తూ.. ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. శనివారం ప్రసారం కానున్న బిగ్ బాస్ ఎపిసోడ్‌లో సింగింగ్ ఆడిషన్స్ జరగనున్నాయని, రీక్రియేషన్ జరగనుందని ఇప్పటికే విడుదలయిన ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది. ఇక వీటితో పాటు కంటెస్టెంట్స్‌కు మరో ఫన్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. దానికి సంబంధించిన ప్రోమో కూడా తాజాగా విడుదలయ్యింది.
అమర్‌దీప్‌ను ఆడేసుకున్న హౌజ్‌మేట్స్
‘‘హెల్మెట్, బ్లైండ్ ఫోల్డ్ ధరించి కంటెస్టెంట్స్.. గార్డెన్ ఏరియాలో ఏర్పరిచిన కుర్చీలో కూర్చోవాల్సి ఉంటుంది. ఒకరు తర్వాత ఒకరు కుర్చీలో కూర్చున్నవారి హెల్మెట్‌పై సాఫ్ట్ స్టిక్‌తో కొట్టాల్సి ఉంటుంది. కుర్చీలో కూర్చున్నవారు.. వారిని కొట్టిందెవరో గెస్ చేయాల్సి ఉంటుంది’’ అని టాస్క్ గురించి వివరించారు బిగ్ బాస్. ముందుగా అమర్‌దీపే కళ్లకు గంతలు కట్టుకొని కుర్చీలో కూర్చున్నాడు. కంటెస్టెంట్స్ అంతా దొరికించే ఛాన్స్ అని తనతో ఒక ఆట ఆడుకున్నారు. శివాజీ వచ్చి ముందుగా తన స్టిక్‌తో రెండుసార్లు అమర్ తలపై గట్టిగా కొట్టాడు. కానీ కొట్టింది అర్జున్ అనుకున్నాడు అమర్.
నేను ఆడను
ఒకరు తర్వాత ఒకరు కొట్టమని బిగ్ బాస్ చెప్పిన రూల్‌ను పక్కన పెట్టి కంటెస్టెంట్స్ అంతా అమర్‌ను కొట్టడం మొదలుపెట్టారు. ‘‘దొంగను కొట్టినట్టు కొడతారేంటి ఆగండి’’ అని అమర్ అరవగానే ఆగిపోయారు. ఫైనల్‌గా శివాజీ కొట్టినప్పుడు తనే అని కరెక్ట్‌గా గెస్ చేసి చెప్పాడు. దీంతో తరువాత టర్న్ శివాజీకి వచ్చింది. ముందుగా పల్లవి ప్రశాంత్ వచ్చి శివాజీని మెల్లగా తలపై కొట్టాడు. అది యావర్ అనుకున్నాడు శివాజీ. ఆ తర్వాత యావర్ నిజంగానే కొట్టగానే.. తనే అని శివాజీ కరెక్ట్‌గా గెస్ చేశాడు. దాంతో టర్న్ యావర్‌కు వచ్చింది. ఒకరు తర్వాత ఒకరు యావర్‌ను కొడుతుండగా.. ప్రశాంత్ కొట్టినప్పుడు మాత్రం కరెక్ట్‌గా గెస్ చేశాడు. దీంతో ప్రశాంత్ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. కంటెస్టెంట్స్ అంతా తన చుట్టూ చేరి ఆడుకోవడం మొదలుపెట్టారు. ‘‘నేనెమైనా తబల అనుకున్నారా’’ అన్నాడు ప్రశాంత్. శివాజీ వచ్చి మూడుసార్ల తన తలపై గట్టిగా కొట్టినా కూడా అది యావర్ అనుకున్నాడు. ఫైనల్‌గా కుర్చీలో నుండి లేచి ‘‘నేను ఆడను’’ అంటూ మారాం చేశాడు.
సూట్‌కేస్‌లో రూ.15 లక్షలు
ఫస్ట్ టాస్క్ ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ అందరినీ సీరియస్ మోడ్‌లోకి తీసుకెళ్లారు బిగ్ బాస్. హౌజ్‌లోకి ఒక సూట్‌కేస్ పంపించారు. ‘‘మీ ముందు ఉన్న సూట్‌కేస్‌లో రూ.15 లక్షలు ఉన్నాయని. దానిని మీరు తీసుకోవాలి అనుకుంటున్నారా?’’ అని అడిగాడు. దీంతో కంటెస్టెంట్స్ అంతా ఆలోచనలో పడ్డారు. ప్రతీ సీజన్‌లో కంటెస్టెంట్స్‌కు సూట్‌కేస్ ఆఫర్ ఇస్తాడు బిగ్ బాస్. కానీ మరీ ఇంత ముందుగా ఎప్పుడూ ఇవ్వలేదు. దీన్ని బట్టి చూస్తే ఆ సూట్‌కేస్ తీసుకొని ఎవ్వరైనా ఇప్పుడే హౌజ్ నుండి వెళ్లిపోవచ్చు. ఒకవేళ సూట్‌కేస్ తీసుకోకపోతే ఓటింగ్ విషయంలో లాస్ట్‌లో ఉండేవారు ఎలిమినేట్ అవుతారేమో అని ప్రేక్షకులు భావిస్తున్నారు.
Also Read: ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి అర్జున్ అంబాటి ఔట్? అతడికి కలిసిరాని అంశాలివే!