Bigg Boss OTT Finale: శివ జర్నీకి ఎండ్ కార్డ్ - టాప్ 2 లో ఆ ఇద్దరే!
టాప్ 3 లో ఉన్న అఖిల్, అరియనా, శివలలో ఒకరిని ఎలిమినేట్ చేయనున్నట్లు చెప్పారు నాగార్జున.

బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ఈరోజు ఫినాలే ఎపిసోడ్ తో ముగియనుంది. హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు, ఎక్స్ హౌస్ మేట్స్ తో మాట్లాడారు. ఆ తరువాత ఇద్దరు కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేశారు. ముందుగా అనిల్ ని, ఆ తరువాత బాబా భాస్కర్ ని ఎలిమినేట్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ కి, ఎక్స్ హౌస్ మేట్స్ కి అవార్డ్స్ ఇవ్వడానికి 'మేజర్' టీమ్ ని స్టేజ్ పైకి పిలిచారు నాగార్జున. హౌస్ మేట్స్ కి తమ క్యారెక్టర్ ని బట్టి ఫన్నీ అవార్డ్స్ ఇచ్చారు. అషురెడ్డికి బకెట్, నటరాజ్ మాస్టర్ కి కొరడా.. ఇలా ఫన్నీ అవార్డ్స్ ప్రకటించారు.
ఆ తరువాత టాప్ 5లో ఉన్న మిత్రాశర్మను ఎలిమినేట్ అయినట్లు చెప్పారు నాగార్జున. కాసేపటికి 'ఎఫ్3' టీమ్ ను స్టేజ్ పైకి పిలిచారు నాగార్జున. దర్శకుడు అనిల్ రావిపూడి, మెహ్రీన్, సునీల్ లు వచ్చారు. డబ్బుతో ఉన్న సూట్ కేస్ పట్టుకొని హౌస్ లోకి వెళ్లారు అనిల్ రావిపూడి, సునీల్. తన దగ్గరున్న డబ్బుతో టాప్ 4 కంటెస్టెంట్స్ ని టెంప్ట్ చేసే ప్రయత్నం చేశారు. అరియనా తనకు ఇంట్రెస్ట్ ఉన్నట్లు ప్రవర్తించింది. ఫైనల్ గా ఆలోచించి సూట్ కేస్ తీసేసుకుంది అరియనా. సూట్ కేస్ లో రూ.10 లక్షలు ఉన్నట్లు చెప్పారు నాగార్జున. దీంతో అరియనా ఎగిరి గంతేసింది.
టాప్ 3 లో ఉన్న అఖిల్, బిందు మాధవి, శివలలో ఒకరిని ఎలిమినేట్ చేయనున్నట్లు చెప్పారు నాగార్జున. ఒక బాంబ్ టాస్క్ పెట్టి అందులో శివ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ఫైనలిస్ట్ లుగా బిందు మాధవి, అఖిల్ లు నిలిచారు. వీరిద్దరిలో విన్నర్ ఎవరో కాసేపట్లో తెలియనుంది!
Also Read: బాబా భాస్కర్ ను ఎలిమినేట్ చేసిన సత్యదేవ్
Also Read: టాప్ 7 కంటెస్టెంట్స్ లో ఒకరు ఔట్ - ఎవరంటే?
View this post on Instagram
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
ట్రెండింగ్ వార్తలు






















