అన్వేషించండి
Advertisement
Bigg Boss 5 Telugu: డేంజర్ జోన్ లో కాజల్, రవి.. సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడతాడా..?
ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో చూస్తుంటే.. రవి నిజంగానే ఎలిమినేట్ అవుతాడనే అనుమానం రాక మానదు.
ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో నామినేషన్ జరుగుతుండడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిన్నటినుంచి సోషల్ మీడియాలో రవి ఎలిమినేట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన రవిని ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ ఆయన ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారు. కానీ ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో చూస్తుంటే.. రవి నిజంగానే ఎలిమినేట్ అవుతాడనే అనుమానం రాక మానదు.
తాజాగా విడుదలైన ప్రోమోలో రవి, కాజల్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు చూపించారు. ఆడియన్స్ జడ్జిమెంట్ ఆల్రెడీ వచ్చేసిందని.. కానీ దాన్ని మార్చే పవర్ హౌస్ లో ఒక్కరికే ఉందని అన్నారు నాగార్జున. వెంటనే సన్నీ.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను పట్టుకొని వచ్చాడు. 'ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ను నువ్ వాడుకుంటావా..? లేక వీరిద్దరిలో ఒకరిని సేవ్ చేయడానికి వాడతావా..? డిసైడ్ చేసుకొని చెప్పు' అని నాగార్జున సన్నీని అడిగారు.
దానికి సన్నీ.. 'తనకు ఇద్దరూ ఇష్టమే' అని అన్నాడు. వెంటనే షణ్ముఖ్.. 'సన్నీ ఆలోచించు' అంటూ డైలాగ్ వేశాడు. అయితే డెఫినిట్ గా సన్నీ.. కాజల్ కోసమే ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడే ఛాన్స్ ఉంది. ఈ మధ్యకాలంలో సన్నీ-కాజల్-మానస్ చాలా స్నేహంగా ఉంటున్నారు. సన్నీకి ఎవిక్షన్ ఫ్రీ పాస్ రావడానికి కారణం కూడా కాజల్ అనే చెప్పాలి. దానికోసం ఆమె చాలా మాటలే పడింది. మరి సన్నీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఈరోజు ఎపిసోడ్ లో చూడాలి!
#Sunny eviction free pass use chesthada? Save chesthada?#BiggBossTelugu5 today at 9 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/PwuD8XgutQ
— starmaa (@StarMaa) November 28, 2021
Also Read:బిగ్ బాస్ వైరల్ వీడియోపై దీప్తి సునయన వైల్డ్ రియాక్షన్..
Also Read: బాలకృష్ణకు గాయం అవ్వడానికి కారణం ఏంటో చెప్పిన బోయపాటి శ్రీను! 'జై బాలయ్య' సాంగ్ తీసేటప్పుడు...ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తిరుపతి
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion