Bigg Boss 5 Telugu: వరస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ది వీక్ జెస్సీ.. జైల్లో పెట్టిన బిగ్ బాస్..
అరుపులు, కేకలు మధ్య నిన్నటి ఎపిసోడ్ పూర్తి కాగా.. ఈరోజు ఉదయాన్నే 'వస్తానంటివో పోతానంటివో' సాంగ్ కి హౌస్ మేట్స్ అంతా స్టెప్పులేసి అలరించారు.
అరుపులు, కేకలు మధ్య నిన్నటి ఎపిసోడ్ పూర్తి కాగా.. ఈరోజు ఉదయాన్నే 'వస్తానంటివో పోతానంటివో' సాంగ్ కి హౌస్ మేట్స్ అంతా స్టెప్పులేసి అలరించారు. వినాయకచవితి సందర్భంగా హౌస్ మేట్స్ అందరూ పండగ సెలబ్రేట్ చేసుకున్నారు. రవికి తన కూతురు గుర్తురావడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. హమీద, నటరాజ్ కూడా ఫ్యామిలీను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. లోబో నటరాజ్ ను ఊరుకోబెడుతూ వెక్కి వెక్కి ఏడ్చేశాడు. అనంతరం శ్వేతాతో సరయు ముచ్చట పెట్టింది. మొదటిరోజు నిన్ను చూసి ఫేక్ అనుకున్నా.. కానీ ఫైనల్ గా ఒపీనియన్ మారిందంటూ ఆమెని పొగిడేసింది. ఆ తరువాత సిరి.. 'అమ్మాయిల్లో నాతో ఎవరూ సరిగ్గా మాట్లాడడం లేదు.. నేను మాట్లాడుతున్నా ఎవరూ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదంటూ' షణ్ముఖ్, కాజల్ లతో ముచ్చటపెట్టింది.
లగ్జరీ బడ్జెట్ టాస్క్..
బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ పేరు.. 'కుండలోని రుచులు జాడవేరు'. దీని ప్రకారం.. యాక్టివిటీ ఏరియాలో కొన్ని కుండలు వేలాడుతూ ఉంటాయి. ప్రతీ కుండపై లగ్జరీ బడ్జెట్ ఐటమ్, పాయింట్స్ రాసి ఉంటాయి. ఆ ఐటమ్స్ పొందడానికి కుండలను పగలగొట్టాల్సి ఉంటుంది. ఇలా కేవలం పది కుండలను మాత్రమే పగలగొట్టాలి. ఈ టాస్క్ లో కేవలం ఇద్దరు ఇంటి సభ్యులు మాత్రమే పాల్గొనాలి. ఎంపికైన ఇద్దరిలో ఒకరు.. ఇంకో ఇంటి సభ్యుని భుజాలపై కూర్చొని ఉండాలి. పైన ఉన్న ఇంటి సభ్యుడి కళ్లకు గంతలు కట్టి ఉంటాయి. ఇతర ఇంటి సభ్యులు వాళ్లకు కావాల్సిన లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్ కోసం వాళ్లను గైడ్ చేస్తుండాలి. దీనికోసం హౌస్ మేట్స్.. నాలుగు కాంబినేషన్స్ ను అనుకున్నారు.
అవేంటంటే.. రవి-విశ్వ, శ్రీరామచంద్ర-విశ్వ, శ్రీరామచంద్ర-హమీద, శ్వేత-మానస్. వీరందరిలో ఎక్కువ ఓట్లు శ్రీరామచంద్ర-విశ్వలకు రావడంతో వాళ్లతో టాస్క్ కంటిన్యూ చేయాలనుకున్నారు. కానీ ఇంతలో నటరాజ్ మాస్టర్ ఫైర్ అయ్యారు. ''విశ్వ ఒక్కడే చేయగలడా? విశ్వకు మాత్రమే కండలు ఉన్నాయా. ఇంకా నలుగురు ఐదుగురు ఉన్నారు. లేపుతా నేను. ఒకరిని కాదు.. ఇద్దరి పెట్టండి లేపుతా'' అని అన్నాడు. ఇందుకు రవి.. ''నిన్ను అడిగినా కదా అన్నా.. అడిగినందుకు చెడ్డవాడిని అయ్యానా'' అన్నాడు. ''నాలుగు కాంబినేషన్స్ లో తన పేరు అసలు చెప్పలేదని'' అంటుండగా.. రవి ఏదో చెప్పే ప్రయత్నం చేయగా.. అక్కడితో టాపిక్ కట్ చేసి వెళ్లిపోయారు నటరాజ్ మాస్టర్. ఇక బజర్ స్టార్ట్ అవ్వగానే టాస్క్ మొదలైంది. శ్రీరామచంద్ర.. విశ్వను తన భుజాలపై ఎక్కించుకొని కుండలు పగలగొట్టించాడు.
బెస్ట్ అండ్ వరస్ట్ పెర్ఫార్మర్..
హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చారు. అందరూ ఏకాభిప్రాయంతో బెస్ట్ అండ్ వరస్ట్ పెర్ఫార్మర్ లను ఎన్నుకోవాలి. ఈ క్రమంలో హౌస్ మేట్స్ తమ అభిప్రాయాలను చెప్పారు.
- రవి - లోబోని బెస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు. జెస్సీని వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు. లోబో - యానీని బెస్ట్ పెర్ఫార్మర్ గా.. జెస్సీని వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు.
- జెస్సీ - సిరిని బెస్ట్ పెర్ఫార్మర్ గా.. రవిని వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు.
- శ్వేతా - విశ్వని బెస్ట్ పెర్ఫార్మన్స్ గా.. ఉమాదేవిని వరస్ట్ గా పెర్ఫార్మన్స్ గా ఎన్నుకున్నారు. ఉమాదేవి - విశ్వని బెస్ట్ పెర్ఫార్మర్ గా.. కాజల్ ని వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు.
- సిరి - నటరాజ్ ని బెస్ట్ పెర్ఫార్మర్ గా.. ఉమాదేవిని వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు.
- విశ్వ - ప్రియాంకని బెస్ట్ పెర్ఫార్మర్ గా.. కాజల్ ని వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు.
- లహరి - విశ్వని బెస్ట్ పెర్ఫార్మర్ గా.. కాజల్ ని వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు.
- ప్రియాంక - లోబోని బెస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకోగా.. ఉమాదేవిని వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకొని రీజన్స్ చెప్పింది. ఒక మనిషిని చులకనగా చూడొద్దని ప్రియాంక.. ఉమాదేవిని అనగా.. నేనెవరినీ అలా చూడడం లేదని ఉమాదేవి ఫైర్ అయింది. అయినప్పటికీ ప్రియాంకా ఊరుకోలేదు.. మీ బిహేవియర్ చాలా రూడ్ గా ఉంటుందని అనడంతో గొడవ మరింత పెద్దది అయింది. మీరు మనుషులను చాలా చీప్ గా చూస్తుంటారని ప్రియాంక మరిన్ని కారణాలు చెబుతుండగా.. ఉమాదేవి ఓ రేంజ్ లో మండిపడింది. దీంతో ప్రియాంక 'షట్‌అప్'(నోర్ముయ్) అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. వెంటనే ఉమాదేవి అలా ఎలా అంటావ్ అంటూ ప్రియాంకను ప్రశ్నించగా.. మళ్లీ మళ్లీ షట్‌అప్ అని అంటూనే ఉంది. దీంతో విషయం మరింత సీరియస్ అయింది.
- యానీ - బెస్ట్ పెర్ఫార్మర్ గా ప్రియాంకను ఎన్నుకోగా.. జెస్సీని వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు.
- సరయు - లోబోని బెస్ట్ పెర్ఫార్మర్ గా.. జెస్సీని వరస్ట్ పెర్ఫార్మర్ గా ఎన్నుకున్నారు.
హౌస్ మేట్స్ అంతా ఏకాభిప్రాయంతో విశ్వను బెస్ట్ పెర్ఫార్మర్ గా ఎంపిక చేశారు. ఇక వరస్ట్ పెర్ఫార్మర్ గా జెస్సీని ఎన్నుకోవడంతో అతడి జైల్లో ఉంచి తాళం వేయమని బిగ్ బాస్ చెప్పారు. దీంతో జెస్సీని జైల్లో పెట్టేశారు.