అన్వేషించండి
Advertisement
Bigg Boss 5 Telugu: 'నాకు నువ్వొద్దు'.. సిరితో ఏడుస్తూ చెప్పిన షణ్ముఖ్
ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో షణ్ముఖ్-సిరి ల మధ్య ఏదో గొడవ జరిగినట్లు ఉంది. దానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో షణ్ముఖ్-సిరి ల మధ్య ఏదో గొడవ జరిగినట్లు ఉంది. దానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. 'నేను ఏడవడం వలన నువ్వేం తక్కువైపోవు.. నువ్ దానికే వచ్చినట్లు ఉన్నావ్ వెళ్లొచ్చు' అని సిరితో ఏడుస్తూ చెప్పాడు షణ్ముఖ్. 'ఇక్కడ నుంచి వెళ్లిపో' అని సిరితో అనగా.. ఆమె గట్టిగా మొహంమీద కొట్టుకుంది. 'నేనే మాట అన్నాను.. నాదే తప్పు.. నేనే తక్కువ అవుతాను.. నువ్వే పైకి వెళ్తావ్ వెళ్లు' అని సీరియస్ గా సిరితో అన్నాడు షణ్ముఖ్. సిరి ఊరుకోబెట్టడానికి ట్రై చేస్తుంటే.. 'నీకోసం నువ్ గేమ్ ఆడుతున్నావ్ కదా.. వెళ్లి ఆడుకో.. నా దగ్గరకు రాకు' అని అన్నాడు.
షణ్ముఖ్ ఏడుస్తున్నాడని తెలియడంతో.. తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టు అని సన్నీ.. రవితో అనగా.. 'ఏం కాలేదు.. వాళ్లకు స్పేస్ కావాలి. మాట్లాడుకుంటున్నారు' అని చెప్పాడు. ఏడుస్తున్న షణ్ముఖ్ చేతిని గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది సిరి. 'ఎందుకో నాకు చాలా లోన్లీగా ఉంది. తను(దీప్తి సునయన) ఉంటే కొంచెం బావుండేది నాకు. కింగ్ లా ఫీల్ అయ్యేవాడిని' అని అనగా.. 'ఇన్ని రోజులు ఆగావ్ కదా.. ఒక్క నాలుగు వారాలు ఆగు వెళ్లిపోదువు గానీ' అని చెప్పింది సిరి.
దానికి షణ్ముఖ్.. 'నాకు తెలుసు ఎప్పుడు వెళ్లాలో.. చెప్పాల్సిన అవసరం లేదు.. ప్లీజ్ ఇక్కడనుంచి వెళ్లిపోవా..? నాకు నువ్వొద్దు' అని డైలాగ్ వేశాడు. వెంటనే సిరి వాష్ రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుంది. ఎంతసేపటికి ఆమె బయటకు రాకపోవడంతో షణ్ముఖ్ వెళ్లి డోర్ కొట్టాడు కానీ తీయలేదు సిరి. ఇంతలో హౌస్ మేట్స్ అంతా పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చే సీన్ తో ప్రోమోను ఎండ్ చేశారు.
Differences between #Shanmukh & #Siri .. Issue enti??#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/K8GXN5JVZU
— starmaa (@StarMaa) November 16, 2021
Also Read: నితిన్తో కేథరిన్ థ్రెసా రొమాన్స్..
Also Read: బిజీ డిసెంబర్... అసలు గ్యాప్ లేదుగా..
Also Read: పవన్ కల్యాణ్ సినిమా వెనక్కి వెళ్లడం లేదు... సంక్రాంతి బరిలోనే 'భీమ్లా నాయక్'
Also Read: కోటి రూపాయలు గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలంగాణ పోలీస్
Also Read: డిసెంబర్లో కీర్తీ సురేష్ డబుల్ ధమాకా... ఇటు గురి, అటు హిస్టరీ!
Also Read: 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి కథియవాడి'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
సినిమా రివ్యూ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion