Amardeep: శివాజీని అనవసరంగా పైకి లేపకండి - అమర్ సీరియస్ కామెంట్స్
Bigg Boss Amardeep: బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్‌గా నిలిచిన తర్వాత అమర్‌దీప్.. బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో శివాజీపై సీరియస్ కామెంట్స్ చేశాడు.
Bigg Boss Amardeep: బిగ్ బాస్ సీజన్ 7లో ‘కప్ కొట్టుకునే వెళ్తా’ అని అందరికంటే ఎక్కువసార్లు స్టేట్‌మెంట్ ఇచ్చిన కంటెస్టెంట్ అమర్‌దీప్. తను కూడా చివరివరకు టైటిల్ తనకే, విన్నర్ తనే అని ఫిక్స్ అయ్యి ఉన్నాడు. కానీ చివరి నిమిషంలో రన్నర్‌గానే మిగిలిపోయాడు. మొదటి అయిదు వారాలు తన ఆటను ఎవరూ గుర్తించలేదు, గుర్తించేలా ఆట కనబరచలేదు. అయినా మెల్లగా తనలోని తప్పులు తెలుసుకుంటూ రన్నర్‌గా నిలిచాడు అమర్. ఇక బిగ్ బాస్ ఫైనల్స్ ముగిసిన తర్వాత బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమర్.. తన ఆటపై, ప్రశాంత్ విజయంపై స్పందించాడు. అంతే కాకుండా శివాజీపై సీరియస్ అయ్యాడు కూడా. దానికి సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది.
అయిదు వారాల్లోనే వెళ్లిపోతా అనుకున్నా..
‘‘రన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 7. 105 రోజులు ఉన్నావు హౌజ్‌లో. అనుకున్నావా అసలు’’ అని మొదటిగా అడిగింది గీతూ. ‘‘నాకు తెలిసి మొదటి అయిదు వారాల్లోనే నేను ఇచ్చిన పర్ఫార్మెన్స్‌కు వెళ్లిపోతానని డిసైడ్ అయిపోయాను’’ అని ఓపెన్‌గా సమాధానిమిచ్చాడు అమర్. ‘‘మేము కూడా అదే అనుకున్నాం. కానీ చరిత్ర తిరగరాశావు అయిదు వారాల తర్వాత’’ అని గీతూ చెప్పగా.. సంతోషంగా తలూపాడు. ‘‘స్టేజ్ మీద నాగార్జున నీ చేయి కిందకి దించేసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి?’’ అని అడగగా.. ‘‘ఏమీ అనిపించలేదు’’ అని చెప్పాడు అమర్.
శోభా, ప్రియాంకలో ఎవరు ఎక్కువ.?
గెలుస్తానని అనుకున్నావా అని అడగగా.. ‘‘నువ్వు ఎవరినైతే దేవుడిలాగా భావించావో.. ఆయనే నీ కళ్ల ముందుకు వచ్చి.. ఇంత పెద్ద స్టేజ్ మీద, ఇన్ని కోట్లమంది ప్రజల ముందు ఒక అభిమానిగా నిన్ను గుర్తించారు. నా దృష్టిలో నేను గెలిచాను’’ అని రవితేజతో తన హ్యాపీ మూమెంట్ గురించి షేర్ చేసుకుంటూ మురిసిపోయాడు అమర్. ‘‘శోభా, ప్రియాంకలో ఎవరు ఎక్కువ ఇష్టం’’ అని ఆడియన్స్ అందరూ సమాధానం తెలుసుకోవాలి అనుకుంటున్న ప్రశ్నను అడిగింది. ‘‘దీనికి నేను సమాధానం చెప్పలేను, చెప్పను. నాకు ఇద్దరూ ఎక్కువే’’ అని స్మార్ట్‌గా సమాధానమిచ్చాడు అమర్. ‘‘లోపలికి వెళ్లిన తర్వాత ఫ్యామిలీ ఇంపార్టెన్స్ బాగా తెలిసిందా. అలా తేజూ ఇంపార్టెన్స్ బాగా తెలిసిందా?’’ అని అడిగింది గీతూ. ‘‘100కు వేయి శాతం’’ అని అన్నాడు అమర్.
ఆడుకున్నాడు కప్ కొట్టాడు..
‘‘నేను వెళ్తే ప్రశాంత్‌ను విన్నర్ చేసే పోతా అని శివాజీ మాట్లాడారు’’ అని ఆయన చేసిన కామెంట్స్‌ను గుర్తుచేసింది. ‘‘అలా చెప్పి ఆయనను పైకి లేపకండి. ఆయన గేమ్ ఆయన ఆడుకొని బయటికి వెళ్లిపోయాడు. వీడి గేమ్ వీడు ఆడుకున్నాడు కప్ కొట్టాడు. అంతే’’ అని సీరియస్ అయ్యాడు అమర్. ‘‘శివాజీ లేకపోతే మీరందరూ కలిసి వాళ్లను ఎప్పుడో తొక్కేసేవారు అనే మాటలు కూడా మేము విన్నాం’’ అని మరో స్టేట్‌మెంట్ ఇచ్చింది గీతూ. దానికి కూడా అమర్ ఒప్పుకోలేదు. ‘‘మన బలం ఏంటో తెలుసుకో. పక్కవాడిని నమ్ముకో. పక్కన పెట్టుకో. ముందుకు రా’’ అని డైలాగ్ కొట్టాడు. అది విన్న గీతూ.. ‘‘సాంబా రాసుకోరా’’ అని సెటైర్ వేసింది.
Also Read: ప్రైజ్ మనీ నిర్ణయంపై ప్రశాంత్ తండ్రి కామెంట్స్, పెళ్లి గురించి రివీల్!