అన్వేషించండి
Advertisement
Bigg Boss Telugu 6: రాజమౌళి సినిమా ఛాన్స్ వచ్చినరోజే అమ్మ చనిపోయింది - షాని ఎమోషనల్ స్టోరీ!
14వ కంటెస్టెంట్ గా 'సై' ఫేమ్ షాని ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పుడు అథ్లెట్ అయిన ఆయన ఇంజురీ కావడంతో ఆటలకు దూరమయ్యాడు.
బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్(Bigg Boss). అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ షోకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలానే ఈ ఏడాది ఓటీటీ వెర్షన్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. హాట్ స్టార్ లో 24 గంటల కాన్సెప్ట్ తో ఈ షోని నడిపించారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటీటీ వెర్షన్ క్లిక్ అవ్వలేదు.
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6 కోసం రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 4 నుంచి ఈ షోని మొదలుపెట్టారు. ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ షోని హోస్ట్ చేసిన నాగార్జున ఇప్పుడు ఐదోసారి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈసారి మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారు. ఆదివారం నాడు గ్రాండ్ గా షో మొదలైంది. ఇక కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరిగా నాగార్జున ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6 కోసం రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 4 నుంచి ఈ షోని మొదలుపెట్టారు. ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ షోని హోస్ట్ చేసిన నాగార్జున ఇప్పుడు ఐదోసారి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈసారి మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారు. ఆదివారం నాడు గ్రాండ్ గా షో మొదలైంది. ఇక కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరిగా నాగార్జున ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
14వ కంటెస్టెంట్ గా 'సై' ఫేమ్ షాని ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పుడు అథ్లెట్ అయిన ఆయన ఇంజురీ కావడంతో ఆటలకు దూరమయ్యాడు. అదే సమయంలో రాజమౌళి 'సై' సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకొని అక్కడకు వెళ్లారు. అయితే రాజమౌళి సినిమా ఛాన్స్ వచ్చినరోజే తన తల్లి చనిపోయిందట. ఈ విషయాన్ని నాగార్జునతో చెప్పుకొని చాలా ఎమోషనల్ అయ్యారు షాని. ఇక షానికి కొన్ని టాస్క్ లు ఇచ్చారు నాగార్జున. హౌస్ లో ఒకరు తనదగ్గర మూడు లక్షలు అప్పు తీసుకున్నారని.. మరో కంటెస్టెంట్ ని నమ్మించాలని చెప్పారు. అలానే ఒక కంటెస్టెంట్ కాస్ట్యూమ్ బావుందని.. కానీ వారికి సూట్ అవ్వలేదని చెప్పామన్నారు. లాస్ట్ టాస్క్ ఏంటంటే.. హౌస్ లో ఉన్న ఎవరినైనా 'నువ్ కూడా ఒక సెలబ్రిటీవా..?' అని కామెంట్ చేయాలని అన్నారు. దానికి షాని ఇబ్బంది పడుతూనే ఓకే చెప్పారు.
కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరినీ ఒక్కో కార్డు సెలెక్ట్ చేసుకోమని అడుగుతున్నారు నాగార్జున. షాని సెలెక్ట్ చేసుకున్న కార్డు పంచ్. దానికి అర్ధం ఏంటో తరువాత చెబుతానని అన్నారు నాగార్జున.
ఇక ఈసారి అబ్బాయిల నెంబర్ కంటే అమ్మాయిలే ఎక్కువ మంది హౌస్ లో కనిపించబోతున్నారు. ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ ని చాలా కొత్తగా డిజైన్ చేశారు. మొత్తం 18 మంది పోటీదారులు కాబట్టి ఈసారి షో 100 రోజులకు పైగానే ఉండే ఛాన్స్ ఉంది. మధ్యలో డబుల్ ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి. ఇక టాస్క్ ల విషయానికొస్తే.. బిగ్ బాస్ హిందీ వెర్షన్ నుంచి కొన్ని టాస్క్ లను సీజన్ 6 కోసం తీసుకోబోతున్నారని సమాచారం. గత సీజన్లలో కూడా టాస్క్ లకు సంబంధించి ఇలానే చేశారు.
We welcome our 14th contestant #ShaaniSalmon to Bigg Boss house.
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 4, 2022
#SalmonOnBBTelugu#BiggBossTelugu6 #BBLiveOnHotstar@StarMaa @DisneyPlusHSTel pic.twitter.com/HCe3vM1ZnQ
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion