Samrat Reddy: తండ్రి కాబోతున్న ‘బిగ్ బాస్’ సామ్రాట్
బిగ్ బాస్ సీజన్-2 కంటెస్టెంట్, నటుడు సామ్రాట్ రెడ్డి తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని అతడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించాడు.
‘బిగ్ బాస్’ సీజన్ 2లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న నటుడు సామ్రాట్ 2020లో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కోవిడ్-19 పీక్‌లో ఉన్న సమయంలో సామ్రాట్ కర్ణాటకకు చెందిన అంజనా శ్రీలిఖితను పెళ్లి చేసుకున్నాడు. ఈ వేడుకకు బిగ్ బాస్ కంటెస్టెంట్‌లు దీప్తి సునైనా, తనిష్ తదితరులు హాజరయ్యారు. సామ్రాట్ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన ఫాలోవర్లకు గుడ్ న్యూస్ వినిపించాడు. తన భార్య అంజనా కడుపుతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి.. తన లిటిల్ వన్ కోసం ఎదురుచూస్తున్నామని వెల్లడించాడు. దీంతో సామ్రాట్ సన్నిహితులు, సెలబ్రిటీస్, ఫాలోవర్లు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సామ్రాట్‌కు తన మొదటి భార్య హర్షితతో స్పర్థలు నెలకొన్నాయి. సామ్రాట్ తన ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డాడంటూ హర్షిత కేసు కూడా పెట్టింది. ఈ వివాదం కొన్నాళ్లపాటు సాగింది. చివరికి వారిద్దరు విడాకులు తీసుకున్నారు. అప్పటికే వివిధ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన సామ్రాట్.. ‘బిగ్ బాస్’ సీజన్-2లో ఛాన్స్ కొట్టేశాడు. అందుతో తనీష్‌తో సామ్రాట్‌కు స్నేహం కుదిరింది. నటి తేజశ్వీ మదివాడకు క్లోజ్‌గా ఉండేవాడు. ‘బిగ్ బాస్’ ఫినాలే వరకు చేరుకున్న సామ్రాట్ 5వ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఆ ఫినాలేలో కౌశల్ టైటిల్ గెలుచుకోగా, సింగర్ గీతా మాధురీ రన్నరప్‌గా, తనీష్ 3వ స్థానంలో నిలిచారు. అయితే, ‘బిగ్ బాస్’ తర్వాత సామ్రాట్ సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.
View this post on Instagram