Bigg Boss 6 Telugu: గలీజు దొంగని నేను అంటున్న ఆరోహి, గీతూ మాటతీరు ఇక మారదా సామి, నామినేషన్లో ఆ పదిమంది
Bigg Boss 6 Telugu: నామినేషన్ల ఎపిసోడ్ వచ్చిందంటే చాలు ప్రేక్షకులకు పండగే.
Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఎపిసోడ్లలో అన్నింటికన్నా ఎంటర్‌టైన్ చేసేది నామినేషన్ల పర్వమే. నాలుగో వారం నామినేషన్లు కూడా జోరుగానే సాగాయి. గీతూ ఎప్పటిలాగే నోటికి పనిచెప్పింది. ఆమెకు నోటిధూల అని నాగార్జున, ఇంటి సభ్యులు అన్న విషయాన్ని నిజమే అని నిరూపించింది. అసలేమైందంటే...
నామినేషన్లలో భాగంగా చంటి గీతూని నామినేట్ చేశాడు. చంటికి సమాధానం ఇవ్వడంలో కాస్త తడబడింది గీతూ. చంటి ‘నేను ఆడలేదని నన్ను నామినేట్ చేశావ్ కదా, నాకు కెప్టెన్ ఇచ్చిన పనిచేశాను’ అని చెప్పాడు. తరువాత అర్జున్ కళ్యాణ్ కూడా గీతూని నామినేట్ చేశాడు. శ్రీహాన్ - ఇనయా గొడవలో మధ్యలో దూరి రెచ్చగొట్టడం నచ్చలేదని అన్నాడు. దానికి గీతూ ‘నీకు డిస్టర్బెన్స్ అయితే లోపలికెళ్లి ఉండాల్సింది, నిన్నెవరూ బయట ఉండమన్నారు. ఇనయాను కదా అంది, నిన్ను కాదు కదా, నీకెందుకు మధ్యలో’ అని చాలా దురుసుగా మాట్లాడింది. దానికి ఇనయా ‘నా ఫ్రెండుగా తాను ఫీలయ్యాడు’ అంది. దానికి వెటకారంగా ‘ఫ్రెండా? ఓరయ్యా దేవుడా సామి’ అంది.
ఇనయా వర్సెస్ సూర్య
సూర్య ఇనయాను నామినేట్ చేశాడు. సూర్య మాట్లాడుతూ ‘నేను అన్ ఫెయిర్ ఆడానని ఎక్కడైనా నిరూపించు’అన్నాడు. దానికి ఇనయా తనను కాళ్లు, చేతులు పట్టుకుని ఎత్తేస్తున్నప్పుడు నువ్వెక్కడున్నావ్? అని అడిగింది. దానికి సూర్య ‘నీ చేతులు పట్టుకున్నదే నేను’అన్నాడు. ఇక రాజశేఖర్ ఆరోహిని నామినేట్ చేశాడు. ‘నువ్వు జైల్లో ఉండాలి కానీ రాలేదు’ అనగానే ఆరోహి ‘దొంగల్లో గలీజు దొంగని నేను, జైల్లోకి రాను’ అంది. ఇక ఫైమా, ఆరోహి మధ్య ఫైటింగ్ మొదలైంది. వారిద్దరు ఏ విషయం గురించి మాట్లాడుకున్నారో తెలియదు కానీ కాస్త ఘాటుగానే డైలాగులు వేసుకున్నారు.
మళ్లీ అరిచిన కీర్తి
కీర్తి ఎమోషనల్‌గా చాలా డౌన్ అయి ఉంటోంది. దానికి ఆమె వ్యక్తిగత జీవితంలో జరిగిన విషాదమే కారణం. ఆ విషయాన్ని పదే పదే ఎత్తుతున్నారంటూ కీర్తి అరిచింది. బాధ వల్ల బాధ వల్ల అంటున్నారు... నా బాధ ఎవరికి ఎఫెక్ట్ అయింది అంటూ అరిచింది. బాధ అనే టాపిక్ తీసుకురాకండి అని అరిచింది. రేవంత్ తో ఆమెకు ఈ వాగ్వాదం జరిగింది. ‘బాధ ఉంటే ఈ బిగ్ బాస్ హౌస్ కి వచ్చేదాన్ని కాదు’ అంటూ వాదించింది.
ఈ వారం ఇంటి కెప్టెన్ ఆదిరెడ్డి కావడంతో అతడిని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు. ఇక కీర్తి, రాజశేఖర్‌ను బిగ్ బాస్ నేరుగా నామినేట్ చేయడంతో వారిద్దరినీ కూడా ఎవరినీ నామినేట్ చేయడానికి వీల్లేదు. సమాచారం ప్రకారం ఈ వారం నామినేషన్లలో ఉన్నవారు వీరే.
1. సుదీప
2. కీర్తి
3. ఆరోహి
4. గీతూ
5. శ్రీహాన్
6. ఇనయా
7. రాజశేఖర్
8. సూర్య
9. అర్జున్
10. రేవంత్
Also read: నామినేషన్లో ఇనయా వయసుపై చర్చ, యాటిట్యూడ్ చూపించిన శ్రీహాన్
Also read: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!