అన్వేషించండి

Bigg Boss 5 Telugu: విశ్వ ఏమిటా ఏడుపు? ‘బిగ్ బాస్’ సీజన్ 5లో ‘పాతాళగంగ’ అవార్డుకు అబ్బాయిలు పోటీ?

బిగ్ బాస్ సీజన్లో ఎవరో ఒకరు కుళాయి విప్పి విసిగిస్తుంటారనే సంగతి తెలిసిందే. అయితే, ఈ సీజన్లో కుళాయిలకు కొదవే లేదు అనిపిస్తోంది. ఎవరిని కదిపినా వరదలే. ఇందులో అబ్బాయిలు కూడా ఏ మాత్రం తగ్గడం లేదు.

‘బిగ్ బాస్’పై మీమ్స్, ట్రోల్స్ క్రియేట్ చేసేవారు.. హౌస్‌లో ఎవరు ఎక్కువగా ఏడిస్తే వారికి ‘ఇది పంపు కాదు.. పాతాళ గంగ’ అనే అవార్డును ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. గత కొన్ని సీజన్లలో ఈ అవార్డు లేడీ హౌస్‌మేట్స్‌కే దక్కింది. ఈ సీజన్లో మాత్రం ఇద్దరు పురుషులు, అమ్మాయిలతో పోటీ పడుతున్నారేమో అనిపిస్తుంది. వారెవరో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అదేనండి.. కండల వీరుడు విశ్వ, సుకుమారుడిగా కనిపించే సూపర్ మోడల్ జస్సీ. 

బిగ్‌ బాస్ మొదటి సీజన్‌లో సింగర్ మధుప్రియ అతిగా ఏడుస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేదని నెటిజనులు కామెంట్ చేసేవారు. చిన్న విషయానికి కూడా భావోద్వేగానికి గురవ్వుతూ బాధపడేదనేవారు. సీజన్-2లో నందిని కూడా ఏడుస్తూ కనిపించేది. కానీ, అంతగా విసిగించలేదు. అప్పుడు లవ్ ట్రాక్ నడుపుతూ వినోదాన్ని కూడా పంచింది. అబ్బాయిల్లో గణేష్ ఏడ్చినా.. అర్థం ఉండేది. ఇక బిగ్ బాస్ సీజన్-3లో శివజ్యోతి ఏడుపును చూసి మీమ్ మేకర్స్.. ‘ఇది పంపు కాదు.. పాతాళ గంగ’ అని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. బిగ్ బాస్ సీజన్ 4లో మోనల్ గజ్జర్ సైతం ఎక్కడా తగ్గలేదు. ఆమె నవ్విన సందర్భాలు కూడా చాలా తక్కువ. దీంతో హోస్ట్ నాగార్జున సైతం ‘నర్మద’ అనే బిరుదును మోనల్‌కు ఇచ్చేశారు.

ఈ నేపథ్యంలో సీజన్-5లో ఏడుపు సాంప్రదాయాన్ని ఎవరు కొనసాగిస్తారా అని మీమ్స్ క్రియేటర్లు ఎదురు చూస్తున్నారు. మొదట్లో జస్సీ, హమీదాల మధ్య ఏడుపులో చిన్న పోటీ మొదలైంది. ఆ తర్వాత విశ్వ కూడా పదే పదే ఎమోషనల్ అవుతూ కనిపించాడు. అయితే, తన వ్యక్తిగత జీవితంలోని విషాద ఘటనలను తలచుకుని బాధపడుతున్నాడని అంతా భావించారు. అయితే, సరయు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుంటే.. అతడు ఒంటరిగా ఇంట్లోకి వెళ్లి ఏడ్వడం చూసి మాత్రం ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. 

ఎందుకంటే.. బిగ్ బాస్ సీజన్-5 మొదలై వారం మాత్రమే అవుతోంది. ఇంకా ఆ ఇంట్లోకి వెళ్లిన సభ్యుల మధ్య పూర్తిగా బాండ్ కూడా ఏర్పడలేదు. కాబట్టి.. మొదటివారంలో ఎవరు వెళ్లినా.. ఎవరూ పెద్దగా పట్టించుకొనే పరిస్థితి ఉండేది కాదు. అయితే, విశ్వ మాత్రం చాలా ఎక్కువగా ఏడ్చి.. తోటి సభ్యులను కూడా ఆశ్చర్యపరిచాడు. దీంతో మీమ్ క్రియేటర్స్‌కు కంటెంట్ దొరికేసింది. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలోని వెంకటేష్-సునీల్ మధ్య వచ్చే సన్నివేశంతో విశ్వను ట్రోల్ చేస్తున్నారు. ‘‘వీడేంటీ నా కంటే ఎక్కువ ఫీలైపోతున్నాడు’’ అనే డైలాగ్‌తో విశ్వ ఏడుపును కంపేర్ చేస్తున్నారు. ఇక జస్సీ విషయానికి వస్తే.. ఇతడు మొదటి నామినేషన్ నుంచి కుళాయి విప్పడం మొదలుపెట్టాడని విమర్శకులు అంటున్నారు. హమీదాతో గొడవ విషయంలో భావోద్వేగానికి గురయ్యాడు. ఆ తర్వాత యానీ మాస్టర్‌కు సారీ చెప్పేప్పుడు కూడా చిన్నపిల్లాడిలా ప్రవర్తించాడని నెటిజనులు అంటున్నారు. ఇతడు ఎప్పుడు ఏ క్షణంలో ఏడుస్తాడో కూడా తెలియని పరిస్థితి ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు. శ్వేత కూడా ఎక్కువ ఎమోషనల్ అవుతుందని, హమీదా కూడా తన పరధ్యానంతో హౌస్‌మేట్స్‌తో ఆడుకుంటోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ఇది పంపు కాదు.. పాతాళ గంగ’ అవార్డును ఎవరు దక్కించుకుంటారో చూడాలి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Horror Movies : ఈ మూవీస్ ఒంటరిగా అస్సలు చూడొద్దు - యూట్యూబ్‌లో టాప్ హారర్ థ్రిల్లర్స్ ఇవే
ఈ మూవీస్ ఒంటరిగా అస్సలు చూడొద్దు - యూట్యూబ్‌లో టాప్ హారర్ థ్రిల్లర్స్ ఇవే
Mardaani 3 OTT : మెచ్యూర్ కానీ అమ్మాయిల కిడ్నాప్ మిస్టరీ - ఓటీటీలోకి రాణి ముఖర్జీ క్రైమ్ థ్రిల్లర్ మర్దానీ 3
మెచ్యూర్ కానీ అమ్మాయిల కిడ్నాప్ మిస్టరీ - ఓటీటీలోకి రాణి ముఖర్జీ క్రైమ్ థ్రిల్లర్ మర్దానీ 3
Priyanka Chopra : మేమిద్దరం విడిపోవాలని కోరుకుంటున్నారా? - డివోర్స్ రూమర్స్‌పై ప్రియాంక చోప్రా స్ట్రాంగ్ రియాక్షన్
మేమిద్దరం విడిపోవాలని కోరుకుంటున్నారా? - డివోర్స్ రూమర్స్‌పై ప్రియాంక చోప్రా స్ట్రాంగ్ రియాక్షన్
Nindu Manasulu Serial Today March 26th: నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల్ని విడదీసేసిన మంజుల! ఇందిరకు షాక్ ఇచ్చిన సిద్ధూ తల్లిదండ్రులు!
నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల్ని విడదీసేసిన మంజుల! ఇందిరకు షాక్ ఇచ్చిన సిద్ధూ తల్లిదండ్రులు!

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LPG Connection: ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
ఎల్పీజీ సిలిండర్ల వాడకందారులకు కేంద్రం డెడ్‌లైన్!మూడు నెలల్లో పీఎన్జీకి మారకుంటే కనెక్షన్ కట్!
Hyderabad Chicken Shops Close: హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
హైదరాబాద్‌ నాన్‌వెజ్‌ ప్రియులకు షాకింగ్ న్యూస్! ఏప్రిల్‌ 1 నుంచి చికెన్ షాపులు బంద్!
Revanth south Movement: రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
రేవంత్ దక్షిణాది ఉద్యమం - కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి సమస్యలేనా!?
Horror Movies : ఈ మూవీస్ ఒంటరిగా అస్సలు చూడొద్దు - యూట్యూబ్‌లో టాప్ హారర్ థ్రిల్లర్స్ ఇవే
ఈ మూవీస్ ఒంటరిగా అస్సలు చూడొద్దు - యూట్యూబ్‌లో టాప్ హారర్ థ్రిల్లర్స్ ఇవే
Women Reservation Effect: రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
రాబోయేది మహిళా నాయకురాళ్ల విప్లవమే - రాజకీయాల దారి మారుతుందా?
Ustaad Bhagat Singh Collections: బాక్సాఫీస్‌లో బోల్తా కొట్టిన 'ఉస్తాద్ భగత్ సింగ్'... ఏడు రోజులైనా బడ్జెట్‌లో సగం కూడా రాలేదుగా
బాక్సాఫీస్‌లో బోల్తా కొట్టిన 'ఉస్తాద్ భగత్ సింగ్'... ఏడు రోజులైనా బడ్జెట్‌లో సగం కూడా రాలేదుగా
Aryaman Birla : రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాడు ఆర్‌సిబి జట్టుకు ఛైర్మన్ ఎలా అయ్యారు? ఐపీఎల్‌లో ఆసక్తికరమైన స్టోరీ!
రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాడు ఆర్‌సిబి జట్టుకు ఛైర్మన్ ఎలా అయ్యారు? ఐపీఎల్‌లో ఆసక్తికరమైన స్టోరీ!
Hyderabad Food Safety: హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
హైదరాబాద్‌లో కల్తీ మాఫియా గుట్టు రట్టు: కుళ్లిన గుడ్లు, విషపూరిత పేస్ట్.. షాకింగ్ వివరాలు!
Embed widget