News
News
X

Besharam Rang Song Trolled : షారుఖ్ 'బేషరమ్ రంగ్'కు రాజకీయ రంగు - 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడి సెటైర్లు?

ఖాన్ హీరోల సినిమాలు వచ్చినప్పుడు 'బాయ్‌కాట్ బాలీవుడ్' అంటూ ట్విట్టర్‌లో కొందరు ట్రెండ్ చేయడం కామన్‌ అయ్యింది. ఆ ట్రెండ్‌కు తోడు షారుఖ్ ఖాన్ 'బేషరమ్ రంగ్'కు రాజకీయ రంగు అంటుకుంది.

FOLLOW US: 
Share:

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి ఖాన్ హీరోలు సోషల్ మీడియాలో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. వాళ్ళ సినిమాలను 'బాయ్‌కాట్' చేయమంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. ఖాన్ హీరోలు మాత్రమే కాదు, హిందీ సినిమా ఇండస్ట్రీలో నటీనటులుగా అడుగుపెట్టిన వారసులు అంతా ఈ 'బాయ్‌కాట్' ట్రెండ్ బాధితులే. దీనికి తోడు షారుఖ్ ఖాన్ సినిమా పాటకు రాజకీయ రంగు అంటుకుంది.
 
షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ జంటగా నటించిన సినిమా 'పఠాన్'. రీసెంట్‌గా ఈ సినిమాలోని 'బేషరమ్ రంగ్' సాంగ్ విడుదల చేశారు. ఊహించినట్టుగా ఈ పాటపై కొందరు విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. ఇంకొందరు కాపీ అని ఆరోపణలు చేస్తున్నారు. అవి పక్కన పెడితే... పాటలో దీపికా పదుకోన్ వేసుకున్న దుస్తులపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కాషాయ రంగు బికినీ ధరించడం వివాదాస్పదం అవుతోంది. ఈ విమర్శలకు తోడు 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడు వివేక్ రాజన్ అగ్నిహోత్రి చేసిన ట్వీట్ 'బేషరమ్ రంగ్' పాటను ఉద్దేశించి అని కొందరు భావిస్తున్నారు.
 
ఇన్‌స్టాగ్రామ్ రీల్ కంటే దారుణమా?
''ఇంతకు ముందు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసినప్పుడు... బాలీవుడ్ పాటలకు బ్యాడ్ కాపీస్ కింద ఉండేవి. ఇప్పుడు బాలీవుడ్ సాంగ్స్ చూస్తుంటే... ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు బ్యాడ్ కాపీ కింద ఉన్నాయి'' అని ఈ రోజు 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడు వివేక్ రాజన్ అగ్నిహోత్రి ట్వీట్ చేశారు. 'బేషరమ్ రంగ్' నిన్న విడుదలైంది. ఆయన ఈ రోజు ట్వీట్ చేయడంతో అది షారుఖ్ పాటను ఉద్దేశించి అని కొందరు భావిస్తున్నారు. 'పఠాన్' పాట మీద ఆయన సెటైర్ వేశారని, బీజేపీ స్పాన్సర్ దర్శకుడు అంటూ ఒకరు ఆ ట్వీట్‌ను కోట్ చేశారు. 

దీపికా పదుకోన్ కాషాయ రంగు బికినీ ధరిస్తే... అది 'బేషరమ్ రంగ్' అని 'పఠాన్' ఫీలవుతున్నాడని ఇంకొకరు ట్వీట్ చేశారు. ఈ పాటలో దీపిక కాషాయ రంగు మాత్రమే కాదు... ఎల్లో కలర్, గోల్డెన్ కలర్ బికినీలు ధరించారు. కానీ, కొంత మంది కావాలని కాషాయ రంగును హైలైట్ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ మీద కోపంతో ఈ విధంగా కావాలని కొందరు విష ప్రచారం చేస్తున్నారని అభిమానులు ఫీలవుతున్నారు. 

Also Read: మెగాస్టార్ సినిమాలో రవితేజ ఘాటు లిప్ లాక్ - ఎవరితో అంటే?

విమర్శలతో పాటు 'బేషరమ్ రంగ్' ప్రశంసలు కూడా అందుకుంటోంది. 'పఠాన్' కోసం షారుఖ్ ఖాన్ ఎయిట్ ప్యాక్ చేశారు. కండలు తిరిగిన దేహంతోనే ఈ పాటలో కనిపించారు. 57 ఏళ్ళ వయసులో అలా కనిపించడం, అటువంటి బాడీ బిల్డ్ చేయడం షారుఖ్‌కు మాత్రమే సాధ్యమని అంటున్నారంతా! నెటిజన్లు ఆయన ఫిజిక్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ గురించి అందరూ మాట్లాడుతున్నారని, షారుఖ్‌ను చూడమని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. షారుఖ్ ఫిజిక్, ఆయన లుక్స్ దీపిక గ్లామర్‌ను డామినేట్ చేశాయి.

తెలుగులోనూ జనవరి 25న 'పఠాన్'
Pathaan Movie Telugu Release : 'పఠాన్'ను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కంటే ఒక్క రోజు ముందు జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు. 'వార్' వంటి సూపర్ డూపర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తీసిన సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ 'పఠాన్'ను నిర్మించింది. 

Published at : 13 Dec 2022 04:22 PM (IST) Tags: deepika padukone Shah Rukh Khan Pathaan Besharam Rang Song Trolled

సంబంధిత కథనాలు

Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?

Shaakuntalam Movie : సమంత సినిమాకు ఎందుకిలా? శాకుంతల, దుష్యంతుల ప్రేమకథకు మోక్షం ఎప్పుడు?

The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!

The Power: అమ్మాయిల ఒంటి నుంచి నిజంగా కరెంటు పుడితే - ‘ది పవర్’ టీజర్ మైండ్ బ్లోయింగ్!

PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి

PSPK In Unstoppable : ఒక్క రోజు ముందుకు పవర్ ఫైనల్ - రేపు రాత్రి నుంచి ఆహాలో బాలకృష్ణ, పవన్ సందడి

Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!  

Sasivadane Title Song : హరీష్ శంకర్ విడుదల చేసిన 'శశివదనే' పాట - కోమలితో రక్షిత్ ప్రేమంట!  

HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!

HBD Brahmanandam: నవ్వుతూ, నవ్విస్తూ వుండాలి - బ్రహ్మానందానికి చిరంజీవి బర్త్‌డే సర్‌ప్రైజ్, ఇంటికెళ్లి మరి విసెష్!

టాప్ స్టోరీస్

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

BRS Politics: బీఆర్ఎస్‌కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం

Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్‌కు మరో అస్త్రం