By: ABP Desam | Updated at : 08 Feb 2023 09:38 AM (IST)
కార్తికేయ, నేహా శెట్టి
యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) నటించిన తాజా సినిమా 'బెదురు లంక 2012'. ఇందులో 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) కథానాయిక. తెలుగు నూతన సంవత్సరాది ఉగాదికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
ఉగాదికి 'బెదురులంక'
అవును... ఉగాదికి 'బెదురులంక 2012' విడుదల కానుంది. మార్చి 22న థియేటర్లలో సినిమాను తీసుకు రానున్నారు. ఉగాది బుధవారం వచ్చింది. ఆ రోజు సెలవు ఉంటుంది. ఆ తర్వాత కూడా ప్రేక్షకులు ఫెస్టివల్ మూడ్ లో ఉంటారు. బుధ, గురు తర్వాత శుక్ర, శని, ఆది వారాలు వీకెండ్. లాంగ్ వీకెండ్ మీద ఈ సినిమా కన్నేసింది.
'ఆర్ఎక్స్ 100' తర్వాత కార్తికేయ కొన్ని చిత్రాలు చేశారు. మధ్యలో ఇతర హీరోల సినిమాల్లో విలన్ రోల్స్ కూడా చేశారు. అయితే, 'ఆర్ఎక్స్ 100' స్థాయి సినిమా గానీ, విజయం గానీ రాలేదు. 'బెదురులంక 2012'తో ఆ స్థాయి విజయం లభిస్తుందని ఆయన చాలా నమ్మకంగా ఉన్నారట.
త్వరలో టీజర్ వస్తుంది
యుగాంతం వస్తే? ఓ పల్లెటూరి, గోదావరి లంక గ్రామంలోని ప్రజలు ఏం చేశారు? అనే కథాంశంతో 'బెదురులంక 2012' రూపొందింది. ఈ చిత్రానికి క్లాక్స్ దర్శకుడు. సి. యువరాజ్ సమర్పణలో లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బెన్నీ ముప్పానేని (రవీంద్ర బెనర్జీ) నిర్మిస్తున్నారు. ఆయన నిర్మాణ సంస్థలో మూడో చిత్రమిది. 'కలర్ ఫోటో' చిత్రాన్ని నిర్మించింది ఆయనే. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. త్వరలో టీజర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ మధ్య గ్లింప్స్ విడుదల చేశారు.
Also Read : 'అన్‌స్టాపబుల్ 2' ఫైనల్‌కు పవర్ టచ్ - సూసైడ్, డిప్రెషన్‌పై పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్!
విశాలమైన గోదావరి... నది తీరమంతా పచ్చటి కొబ్బరి చెట్లు... బండి మీద 'రయ్ రయ్...' మంటూ దూసుకు వెళుతున్న హీరో కార్తికేయ... చక్కటి లంగా ఓణీలో హీరోయిన్ నేహా శెట్టి... సుమారు నిమిషం నిడివి గల టీజర్‌లో కార్తికేయ, నేహా శెట్టి మధ్య ప్రేమతో పాటు అజయ్ ఘోష్, రాజ్ కుమార్ బసిరెడ్డి, గోపరాజు రమణ, 'ఆటో' రాంప్రసాద్ క్యారెక్టర్లను కూడా దర్శకుడు క్లాక్స్ పరిచయం చేశారు. ఊరిలో జనాలంతా యుగాంతం వస్తుందని ఎంజాయ్ చేసే తీరు నవ్వించేలా ఉంది.
''హొయ్ రబ్బోయ్... ఓరి నాయనా...
ఇదేంట్రోయ్... ఈ మాయ....
అయ్ బాబోయ్... ఆగలేం రోయ్...
వచ్చేయండ్రోయ్... వెయిటింగ్ ఇక్కడ''
అంటూ నేపథ్యంలో వచ్చే సాంగ్ క్యాచీగా ఉంది. ''ఈ యవ్వారం సూతంటే నీకు ఏమనిపిస్తుంది' అని అజయ్ ఘోష్ అడగడం హైలైట్.
Also Read : బాలకృష్ణతో సినిమా చేయాలని ఉంది - 'వేద' ప్రీ రిలీజ్‌లో శివ రాజ్ కుమార్
అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృధ్వీ, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, నృత్యాలు: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ: సి. యువరాజ్, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన - దర్శకత్వం: క్లాక్స్.
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్
Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!
Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్
BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?
Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
ఏపీ ప్రభుత్వ హైస్కూల్స్‌లో 5388 'నైట్ వాచ్‌మెన్' పోస్టులు, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !