MaheshBabu - Unstoppable : ఇంత యంగ్‌గా ఉన్నావేంటయ్యా బాబూ.... బాలకృష్ణ - మహేష్ ఎపిసోడ్ స్పెషల్ ప్రోమో
నట సింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్'. దీనికి మహేష్ బాబు అతిథిగా వచ్చిన ఎపిసోడ్ స్పెషల్ ప్రోమో విడుదలైంది.
నట సింహ నందమూరి బాలకృష్ణ... సూపర్ స్టార్ మహేష్ బాబు... ఇద్దరూ ఒక్క స్టేజి మీదకు వస్తే ఎలా ఉంటుంది? చాలా సందడి సందడిగా, నవ్వుల్ పువ్వుల్ అన్నట్టు ఉంటుందని ఆల్రెడీ విడుదలైన 'అన్‌స్టాపబుల్' ప్రోమోతో తెలిసింది. అది చూశాక... ఫుల్ ఎపిసోడ్ ఎప్పుడు విడుదల అవుతుందా? ఎప్పుడు చూద్దామా? అని అటు నందమూరి, ఇటు ఘట్టమనేని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆసక్తిని మరింత పెంచుతూ ఈ రోజు స్పెషల్ ప్రోమో విడుదల చేశారు.
లేటెస్టుగా విడుదల చేసిన ప్రోమో చిన్నదే. కానీ, మంచి ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. 'ఇంత యంగ్‌గా ఉన్నవేంటయ్యా బాబూ' అని బాలకృష్ణ అనడంతో మహేష్ కాస్త సిగ్గుపడ్డారు. ముసిముసి నవ్వులు నవ్వారు. 'మహేష్... నాది ఒక చిన్న కోరిక. నా డైలాగ్ నీ గొంతులో వినాలని ఉందయ్యా' అని బాలకృష్ణ అడిగితే... 'మీ డైలాగ్ మీరు తప్ప ఇక్నెవ్వరూ చెప్పలేరు' అని మహేష్ సమాధానం ఇచ్చారు. హీరోగా మూడేళ్లు ఎందుకు గ్యాప్ తీసుకున్నాననేది కూడా ఆయన వివరించారు. మహేష్ పెళ్లి, చిన్నతనంలో చేసిన నాటీ పనుల గురించి కూడా బాలకృష్ణ అడిగారు.
View this post on Instagram
మహేష్ బాబు ఎపిసోడ్‌తో 'అన్‌స్టాపబుల్' తొలి సీజన్‌కు 'ఆహా' ఓటీటీ శుభం కార్డు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌లో మహేష్‌తో పాటు ఆయన హీరోగా నటించిన 'మహర్షి' సినిమాకు దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి కూడా అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 4న... అనగా శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ ఎపిసోడ్ 'ఆహా' ఓటీటీలో ప్రీమియర్ కానుంది.