News
News
X

Balakrishna New Movie : బాలకృష్ణకు జోడీగా 'టాక్సీవాలా' ప్రియాంక?

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. అందులో కథానాయికగా ప్రియాంకా జవాల్కర్ నటించే ఛాన్స్ ఉందని తెలిసింది.

FOLLOW US: 
Share:

నూతన కథానాయికలకు, అంతగా విజయాల్లో లేని భామలకు అవకాశాలు ఇవ్వడంలో నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఎప్పుడూ ముందుంటారు. తన సినిమాల్లో స్టార్ హీరోయిన్ ఉండాలని ఆయన ఆర్డర్స్ ఇవ్వరు. కథకు, క్యారెక్టర్‌కు ఎవరు సూట్ అయితే వాళ్ళను ఎంపిక చేసుకునే ఫ్రీడమ్ దర్శక నిర్మాతలకు ఇస్తారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చేయబోయే సినిమాలోనూ హీరోయిన్ ట్రాక్ రికార్డ్ కంటే టాలెంట్‌కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారని తెలిసింది. 

బాలయ్యకు జోడీగా ప్రియాంక?
బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమాలో కథానాయికగా పలువురి పేర్లు వినిపించాయి. అందులో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా పేరు కూడా ఉంది. అయితే, లేటెస్ట్ ఇన్ఫో ఏంటంటే... 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ (Priyanka Jawalkar) ఎంపిక అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట. ఇటీవల ఆమెపై ఫోటోషూట్ చేశారు. ఏ విషయం రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది. 'టాక్సీవాలా' వంటి విజయంతో వెలుగులోకి వచ్చిన ప్రియాంక, ఆ తర్వాత 'తిమ్మరుసు', 'ఎస్ఆర్ కళ్యాణ మండపం'తో పేరు తెచ్చుకున్నారు. ఆమె లాస్ట్ సినిమా 'గమనం'. ఆది ఆశించినట్టు ఆడలేదు. కానీ, ఆమెకు బాలకృష్ణ ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు.
 
గురువారం నుంచి సినిమా స్టార్ట్!?
ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో ఈ సినిమా సెట్ వర్క్ జరుగుతోంది. ఆల్మోస్ట్ అది ఫినిష్ అయ్యింది. ఈ గురువారం నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఆ రోజే పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారట. అప్పుడు ప్రియాంకా జవాల్కర్ ఎంపికైన విషయం వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా భారీ నిర్మాణ వ్యయంతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

Also Read : బాలీవుడ్ స్టార్స్‌కు 'నో' చెప్పేసి పవన్‌తో సినిమా - ఎగ్జైట్ అవుతున్న అకిరా

బాలకృష్ణకు సాలిడ్ హిట్ పడితే బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్ ఎలా ఉంటుందనేది 'అఖండ' చూపించింది. ఆ చిత్రానికి వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్ళు వచ్చాయి. అందుకని, షైన్ స్క్రీన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న హరీష్ పెద్ది, సాహూ గారపాటి సుమారు 90 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు టాక్. ఈ మధ్య కాలంలో బాలకృష్ణ సినిమాలు అన్నిటిలోనూ ఆయన డ్యూయల్ రోల్స్ చేశారు. కానీ, ఈ సినిమాలో మాత్రం ఆయనది సింగిల్ రోల్. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి స్పష్టం చేశారు.  

తండ్రీ కుమార్తెల ఈ సినిమా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్. బాలకృష్ణకు ఈ సినిమా కొత్తగా ఉంటుందని, ఆయనకు డిఫరెంట్ ఇమేజ్ తీసుకు వస్తుందని టాక్. ఈ సినిమాలో కుమార్తె పాత్రకు 'పెళ్లి సందడి' ఫేమ్ శ్రీ లీల (Sree Leela) ఎంపిక అయ్యారు. మరో హీరోయిన్ అంజలి కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఆమెది విలన్ రోల్ అని టాక్.

అనిల్ రావిపూడి సినిమా కంటే ముందు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న 'వీర సింహా రెడ్డి' విడుదల కానుంది. అనిల్ రావిపూడి సినిమా తర్వాత కల్ట్ క్లాసిక్ 'ఆదిత్య 369'కి సీక్వెల్ 'ఆదిత్య 999 మ్యాక్' సెట్స్ మీదకు వెళ్ళనుంది.  

Published at : 06 Dec 2022 08:57 AM (IST) Tags: Balakrishna Priyanka Jawalkar Anil Ravipudi Balakrishna New Movie Balakrishna Priyanka

సంబంధిత కథనాలు

Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?

Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?

Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా

Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా

Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!

Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!

Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి

Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి

Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు  నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే

Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు  నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే

టాప్ స్టోరీస్

BRS Nanded Meeting : నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి - భారీగా మహారాష్ట్ర నేతల చేరికలు !

BRS Nanded Meeting :  నాందేడ్‌లో  బీఆర్ఎస్  బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి - భారీగా మహారాష్ట్ర నేతల చేరికలు !

Rushikonda Green Carpet : పచ్చగా మారిపోయిన రుషికొండ - ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసా ?

Rushikonda Green Carpet : పచ్చగా మారిపోయిన రుషికొండ - ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసా ?

Hyderabad News : కేసీఆర్ మనవడు రితేశ్ రావు మిస్సింగ్, అర్ధరాత్రి పోలీసులే తీసుకెళ్లారని రమ్య రావు ఆరోపణ!

Hyderabad News : కేసీఆర్ మనవడు రితేశ్ రావు మిస్సింగ్,  అర్ధరాత్రి పోలీసులే తీసుకెళ్లారని రమ్య రావు ఆరోపణ!

IND vs AUS: వీళ్లని లైట్ తీసుకుంటే టీమిండియాకు కష్టమే - ఆరుగురు డేంజరస్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్!

IND vs AUS: వీళ్లని లైట్ తీసుకుంటే టీమిండియాకు కష్టమే - ఆరుగురు డేంజరస్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్!