By: ABP Desam | Updated at : 08 Feb 2022 01:53 PM (IST)
bade
స్టార్ హీరోలు కలిసి నటించే సినిమా అంటే ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. అందులోనూ ఇద్దరు యాక్షన్ హీరోలు అయితే ఆ సినిమా మామూలు ఎంటర్‌టైనర్ కాదు, బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా నిలుస్తుంది. అలాంటి సినిమాను బాలీవుడ్ లో సిద్ధమవుతోంది. ‘బడేమియా ఛోటేమియా’పేరుతో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా ఓ భారీ సినిమా తెరకెక్కతోంది. ఇందుకు సంబంధించి చిత్రనిర్మాతలు ఈ మూవీ అనౌన్స్‌మెంట్ ను వీడియో రూపంలో విడుదల చేశారు. ఆ వీడియో యాక్షన్ మిళితమై అదిరిపోయింది. యూట్యూబ్ లో వీడియోను విడుదల చేశారు చిత్ర నిర్మాతలు. హీరో టైగర్ ష్రాఫ్ కూడా తన కొత్త సినిమా గురించి ఇన్‌స్టాగ్రామ్ లో ప్రకటించారు.
పూజా ఎంటర్‌టైన్స్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్‌కు కేరాఫ్ అడ్రస్‌లైన అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి తొలిసారి తెరపై కనిపించబోతున్నారు. 2023లో క్రిస్మస్ కు సినిమా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు మూవీ మేకర్స్. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అన్నట్టు ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? రకుల్ ప్రీత్ సింగ్ ప్రియుడు జాకీ భగ్నానీ. అతని తండ్రి కూడా ఒక నిర్మాతగా ఉన్నారు.
1998లో వచ్చిన బడేమియా చోటేమియా సినిమాకు సీక్వెల్ గా దీన్ని తీసుకురాబోతున్నారు. పాత సినిమాలో అమితాబ్ బచ్చన్, గోవింద కలిసి నటించారు. ఇప్పుడు ఆ స్థానంలోకి అక్షయ్, టైగర్ ష్రాఫ్ వచ్చారు. అప్పట్లో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు ఆ మళ్లీ మ్యాజిక్‌కు యాక్షన్ జోడించి కొత్తగా సినిమాను తెరకెక్కించబోతున్నారు.
Liger Movie: 'లైగర్' కోసం ఐదు షోలు - క్యాష్ చేసుకోగలరా?
Bhale Manchi Roju: సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర ఆ చానల్లోకి రీ-ఎంట్రీ? ఇదిగో ప్రూఫ్!
Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు
ఆస్కారం ఉందా? మొన్న RRR, నిన్న ‘శ్యామ్ సింగరాయ్’, ఆస్కార్ బరిలో ఇండియన్ మూవీస్, నిజమెంత?
Bimbisara Collections: 'బింబిసార' 13డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ - బాక్సాఫీస్ షేక్!
iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!
Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !
WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?
Tirumala Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 22న సెప్టెంబర్ కోటా టికెట్లు విడుదల