అన్వేషించండి

Vaishnavi Chaitanya : ‘బేబీ’ బ్యూటీకి షాకింగ్ రెమ్యునరేషన్, దిల్ రాజు సినిమాకు అంత ఇస్తున్నారా?

Vaishnavi Chaitanya Remuneration : ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజి క్రేజ్ సంపాదించుకుంది వైష్ణవి చైతన్య. ఆమె తన నెక్ట్స్ మూవీ కోసం పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Vaishnavi Chaitanya Remuneration for New Movie : సోషల్ మీడియా ద్వారా  గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకులకు దగ్గరై, ‘బేబీ’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తొలి సినిమాతోనే ఓ రేంజిలో పాపులారిటీ సంపాదించుకుంది. తన పాత్రలో ఇట్టే ఒదిగిపోయి నటించి అందరి చేత వారెవ్వా అనిపించుకుంది. తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.

రెండో సినిమాకే పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్

‘బేబీ’ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వైష్ణవికి వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇప్పటికే మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం మొదలయ్యాయి. తాజాగా ఈ చిత్రానికి   సంబంధించిన క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో నటనకు గాను వైష్ణవికి దిల్ రాజు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఏకంగా కోటి రూపాయలకు పైగా పారితోషికం ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది.  రెండో సినిమాకే ఇంత రెమ్యునరేషన్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో రాణించడమే పెద్ద విషయంగా భావిస్తున్న నేపథ్యంలో వైష్ణవి, ఇతర భాషల హీరోయిన్లతో సమానంగా రెమ్యునరేషన్ అందుకోవడం నిజంగా గొప్ప విషయం అంటున్నారు సినీ జనాలు. 

ఆచితూచి సినిమాలు ఓకే చేస్తున్న వైష్ణవి

‘బేబీ’ సినిమా హిట్ తర్వాత కొంత కాలం వరకు ఎలాంటి అవకాశాలు రాలేదు. ఆ తర్వాత నెమ్మదిగా ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ఇప్పటి వరకు వైష్ణవికి నాలుగైదు సినిమా ఛాన్సులు వచ్చాయట. అయితే, సినిమాలను సెలక్ట్ చేసుకునే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే, వెంట వెంటనే సినిమాలు చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. తొలి సినిమాకు మించి హిట్ అయ్యే కథలకు మాత్రమే ఒకే చెప్పాలని భావిస్తోందట వైష్ణవి. ప్రస్తుతం ఆశిష్ మూవీతో పాటు ఆనంద్ దేవరకొండతో ఇంకో మూవీ చేయబోతున్నది. ఇప్పటికే ‘బేబీ’ మూవీతో అద్భుత విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.  

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగేనా?

ఇప్పటికే తెలుగమ్మాయి శ్రీలీల టాలీవుడ్ లోవరుస సినిమాలతో సత్తా చాటుతుండగా, ఆమె సరసన వైష్ణవి కూడా నిలిచే అవకాశం ఉందంటున్నారు సినీ ప్రముఖులు. అందుకు నిదర్శనమే దిల్ రాజు సినిమాకు కోటికి పైగా రెమ్యునరేషన్ అందుకోవడం అంటున్నారు. ఆమె నటించబోయే తర్వాతి రెండు సినిమాలు కూడా ‘బేబీ’ మాదిరిగానే విజయం సాధిస్తే, వైష్ణవి టాప్ హీరోయిన్ గా ఎదగడాన్ని ఎవరూ ఆపలేరంటున్నారు.  

Read Also: ప్రియాంక పెళ్లి వెనుక ఇంత కథ ఉందా? నిక్ జోనాస్​ను మధు చోప్రా అనుమానించిందా?

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today October 29th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: నామినేషన్ల నుంచి వర్షిణి, రాంప్రసాద్ సేఫ్! ఎల్లో కేటగిరిలో వంశీ! ముగిసిన హోటల్‌ టాస్క్!
Jagadhatri Serial Today October 29: కేదార్‌పై చేయివేసిన వివేక్‌కు లాఠీతో బుద్ధిచెప్పిన జేడీ..కాల్చిపడేస్తానంటూ గన్‌తో హెచ్చరిక
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌పై చేయివేసిన వివేక్‌కు లాఠీతో బుద్ధిచెప్పిన జేడీ..కాల్చిపడేస్తానంటూ గన్‌తో హెచ్చరిక
Aadarsha Kutumbam Twitter Review - ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ: త్రివిక్రమ్ దొరికేశాడా? లేదంటే వెంకీతో హిట్టు కొట్టాడా? సోషల్ మీడియా టాకేంటి?
ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ: త్రివిక్రమ్ దొరికేశాడా? లేదంటే వెంకీతో హిట్టు కొట్టాడా? సోషల్ మీడియా టాకేంటి?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 29th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇంటి కోడలికి కఠిన పరీక్ష! సహస్ర యమున చెప్పినట్లు చేస్తుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇంటి కోడలికి కఠిన పరీక్ష! సహస్ర యమున చెప్పినట్లు చేస్తుందా!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget