అన్వేషించండి

Madhu Chopra : ప్రియాంక పెళ్లి వెనుక ఇంత కథ ఉందా? నిక్ జోనాస్​ను మధు చోప్రా అనుమానించిందా?

Priyank Nick Marriage Back Story : ప్రియాంకా చోప్రా పెళ్లి విషయంలో చాలా అందరి తల్లుల మాదిరిగానే తానూ ఆలోచించానని చెప్పింది మధు చోప్రా. అబ్బాయి తన కూతురిని ఎలా చూసుకుంటాడోనని డౌట్ వచ్చిందని తెలిపింది.

Madhu Chopra on Nick Jonas : అమ్మాయి పెళ్లి అనగానే తల్లిదండ్రులు ఎంతో ఆలోచిస్తారు. అబ్బాయి ఎలాంటి వాడు? తమ అమ్మాయిని బాగా చూసుకుంటాడా? లేదా? అబ్బాయి తల్లిదండ్రులు ఎలాంటి వారు? అంటూ రకరకాలుగా ఆరా తీస్తారు. అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటేనే అమ్మాయికి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు. అందరు తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారో తాను కూడా అలాగే ఆలోచించానని చెప్పింది ప్రియాంకా చోప్రా తల్లి మధు చోప్రా. నిక్ జోనాస్ తో పెళ్లి అనగానే తన మదిలో ఎన్నో సందేహాలు నెలకొన్నట్లు వెల్లడించింది.   

కూతురు పెళ్లి విషయంలో తీవ్ర ఆందోళన

ఓ రోజు ప్రియాంక తన తల్లికి నిక్ జోనాస్​ను పరిచయం చేసిందట. తననే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నట్లు చెప్పిందట. ఆ సమయంలో మధు చోప్రా అందరు తల్లుల్లాగే ఆలోచించిందట. తన కూతురిని అతడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు చాలా సందేహించిందట. నిక్ ఎలాంటి వాడు? అమ్మాయిని ఎలా చూసుకుంటాడు? అని ఆలోచించిందట. అమ్మాయి పెళ్లి విషయంలో ఆమె చాలా ఆందోళన పడిందట. ప్రియాంక నిక్ ను పెళ్లి చేసుకుంటే తను ఎక్కడ దూరం అవుతుందోనని భయపడిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మధు, ప్రియాంక పెళ్లి గురించి చాలా విషయాలను పంచుకుంది.

నిక్ గురించి అన్ని విషయాలు తెలుసుకున్న మధు

తన కూతురు పెళ్లి విషయంలో నిక్ జోనాస్ తో చాలా విషయాలు చర్చించినట్లు మధు తెలిపింది. అతడితో వ్యక్తిగతంగా మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నట్లు చెప్పింది. అంతేకాదు, నిక్ తో చాట్ చేసి పలు విషయాల గురించి ఆరా తీసిందట. ఈ సమయంలో తన మనసుకు అర్థం అయ్యేలా నిక్ మాట్లాడ్డం నచ్చిందని చెప్పింది. అతడితో పెళ్లి అయితే, ప్రియాంకను బాగా చూసుకుంటాడనే నమ్మకం కలిగించినట్లు వివరించింది. మీకు ఏ ఇబ్బంది ఉన్నా, గంటల వ్యవధిలోనే మీ కూతురు మీ ముందు ఉంటుందని నిక్ చెప్పాడట. ఆ మాటలు మధుకు నచ్చాయట. ప్రియాంకకు ఎలాంటి వరుడు కావాలి అనుకుందో అలాంటి లక్షణాలు అన్ని నిక్ లో ఉన్నాయని భావించి  పెళ్లికి ఓకే చెప్పిందట.  

అవమానాలను పట్టించుకోని ప్రియాంక

వాస్తవానికి ప్రియాంక తల్లి దగ్గర కంటే అమ్మమ్మ తాతయ్య దగ్గరే ఎక్కువ సమయం గడిపినట్లు మధు వెల్లడించింది. తనతో చాలా తక్కువ సమయం గడిపిందని వివరించింది. తన జీవితంలో జరిగిన కొన్ని తప్పుడు ఘటనల కారణంగానే చాలా కాలం బాధ పడాల్సి వచ్చిందని చెప్పింది.  ప్రియాంకను చిన్నప్పుడే బోర్డింగ్ స్కూల్లో చేర్పించినట్లు వెల్లడించింది. అంతేకాదు, ప్రియాంక ఒకానొక సమయంలో డ్రిప్రెషన్(PTSD)కు గురైనట్లు వివరించింది. కొంత కాలం తర్వాత ఆమె ఆ సమస్య నుంచి దూరం అయినట్లు చెప్పింది. ఇక ప్రియాంక కలర్ గురించి చాలా మంది చాలా కామెంట్స్ చేసే వారని వివరించింది.ఆ అవమానాలను పట్టించుకోకుండా తన పని ఫోకస్ పెట్టడం మూలంగానే ఆమె ఈ రోజు ఉన్నత స్థాయిలో కొనసాగుతున్నట్లు మధు వివరించింది.  

Read Also: ప్రకృతితో మమేకం, దైవ చింతనకు దగ్గరగా- భూటాన్ లో సామ్ ఎంజాయ్

టాప్ హెడ్ లైన్స్

Aaruguru Pativratalu Re Release : ఆరుగురు పతివ్రతలు మళ్లీ వస్తున్నారా? - సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్
ఆరుగురు పతివ్రతలు మళ్లీ వస్తున్నారా? - సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్
Toxic Ladies Ladies : ఒక్కడే యశ్... ఐదుగురు హీరోయిన్స్ - టాక్సిక్‌లో లేడీస్ అండ్ లేడీస్
ఒక్కడే యశ్... ఐదుగురు హీరోయిన్స్ - టాక్సిక్‌లో లేడీస్ అండ్ లేడీస్
Samantha : ఇది నా సిక్స్ ప్యాక్ - ట్రెండింగ్‌‌లో సమంత బేబీ బంప్
ఇది నా సిక్స్ ప్యాక్ - ట్రెండింగ్‌‌లో సమంత బేబీ బంప్
Godavari Serial Today July 1st: 'గోదావరి' సీరియల్: అప్పు కోసం వెళ్తే జానుకి ఘోర అవమానం! సింహాద్రి కుట్ర మామూలుగా లేదుగా!
'గోదావరి' సీరియల్: అప్పు కోసం వెళ్తే జానుకి ఘోర అవమానం! సింహాద్రి కుట్ర మామూలుగా లేదుగా!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol Diesel Price Down India: లీటర్ పెట్రోల్ రేటు ఐదు రూపాయల తగ్గింపు - ఆ బంకుల్లో మాత్రమే!
లీటర్ పెట్రోల్ రేటు ఐదు రూపాయల తగ్గింపు - ఆ బంకుల్లో మాత్రమే!
PM Modi: 2026 జూలైలో ప్రధాని మోదీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? జాతకంలో షాకింగ్ రహస్యాలు!
2026 జూలైలో ప్రధాని మోదీ అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా? జాతకంలో షాకింగ్ రహస్యాలు!
Palnadu Road Accident: 2 లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారంటూ డ్రైవర్ ఆర్తనాదాలు
2 లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారంటూ డ్రైవర్ ఆర్తనాదాలు
ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష పారితోషికం.. ఛాన్స్ ఉందా
ఇంకా దొరకని చిన్నారి జ్ఞానేశ్వరి జాడ.. ఆచూకీ చెబితే రూ.1 లక్ష రివార్డ్.. ఛాన్స్ ఉందా
Trisha: మళ్ళీ ట్రెండింగ్‌లోకి త్రిష... తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్... ఎందుకంటే?
మళ్ళీ ట్రెండింగ్‌లోకి త్రిష... తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్... ఎందుకంటే?
TDP Blacklisted MLAs List 2026: దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
దారి తప్పిన ఎమ్మెల్యేలపై టీడీపీ సైలెంట్ యాక్షన్ - వారిని అప్రకటితంగా దూరం పెట్టేశారా? వారిని ఇక కలుపుకోరా?
New WhatsApp Subscription Plan: వాట్సాప్‌లో సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కాస్ట్ ఎంత? దీని వల్ల యూజ్ ఏంటీ? ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?
వాట్సాప్‌లో సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కాస్ట్ ఎంత? దీని వల్ల యూజ్ ఏంటీ? ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?
Samantha : ఇది నా సిక్స్ ప్యాక్ - ట్రెండింగ్‌‌లో సమంత బేబీ బంప్
ఇది నా సిక్స్ ప్యాక్ - ట్రెండింగ్‌‌లో సమంత బేబీ బంప్
Embed widget