అన్వేషించండి

జపాన్‌లో ‘బాహుబలి-2’ రి-రిలీజ్‌కు సన్నహాలు?

‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ తో ‘బాహుబలి-2’ను జపాన్‌లో విడుదల చేసేందుకు జక్కన టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ద‌ర్శకధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన RRR ప్రపంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విషయం తెలిసిందే. తెలుగు,త‌మిళం, హిందీ, మ‌లయాళం భాష‌ల్లో విడుద‌లైన ఈ మూవీ ..రూ.1200 కోట్లకు పైగా వసూళ్లతో ఔరా అనిపించింది. అంతేకాదు.. అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ప‌లు అవార్డుల‌ను గెలుచుకుంది. ఈ చిత్రంలోని ‘‘నాటు నాటు’’ పాట‌కు గోల్డెన్ గ్లోబ్-2023 అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరిలో ఈ అవార్డు ద‌క్కింది. అలాగే, తెలుగు నుంచి మొట్ట మొద‌టిసారిగా ఆస్కార్ నామినేష‌న్ రేసులో నిలిచింది. ఈ పాట‌కు కీర‌వాణి బాణీలు స‌మ‌కూర్చగా.. చంద్రబోస్ సాహిత్యం అందించారు. ప్రేమ్ ర‌క్షిత్ మాస్టర్ పాట‌కు డ్యాన్స్ కంపోజ్ చేశారు. జక్కన్న RRR సినిమాతోనే కాదు. ‘బాహుబలి’ సినిమాతోనే తానేంటో నిరూపించుకున్నారు. ఇక ఇప్పుడు RRR చిత్రం ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. బాహుబలి సిరీస్‌ను కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. బాహుబ‌లి పార్ట్ 1తో అంత‌ర్జాతీయ ద‌ర్శకుడిగా గుర్తింపు పొందిన‌ జ‌క్కన్న RRRతో మ‌రో మెట్టు ఎక్కారన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఇటీవ‌ల జ‌పాన్‌లో RRR కోట్లలో వసూళ్లు సాధించింది. అక్కడ ఈ మూవీ 2022, అక్టోబ‌ర్ 22న విడుద‌లైంది. దిగ్విజ‌యంగా శ‌త దినోత్సవం పూర్తి చేసుకుంది. మొద‌టివారం మిక్స్‌డ్ టాక్  వినిపించిన‌ప్పటికీ.. రెండో వారం నుంచి ప‌బ్లిక్ టాక్ తో దూసుకెళ్లింది. ఇదిలా ఉంటే.. RRR క్రేజ్‌ను క్యాష్ చేసుకోడానికి జ‌క్కన్న మరో ప్లాన్ చేస్తున్నారు. ఈసినిమా విజ‌యాన్ని ‘బాహుబ‌లి- 2’ కు ఉపయెగ‌ప‌డేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేశారని తెలుస్తోంది. బాహుబ‌లి-2 ఇదివరకే జపాన్‌లో రిలీజైంది. అక్కడ రూ.18.50 కోట్లు రాబట్టింది. ఈ మొత్తాన్ని మ‌రింత పెంచేలా ప్రమోష‌న్స్ పెంచాల‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది. అదే జ‌రిగితే.. RRRని దాటి భారీ హిట్‌గా ‘బాహుబ‌లి -2’ నిల‌వ‌డం ఖాయ‌మ‌ని సినీ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఎందుకంటే బాహుబలి-1తో రాజమౌళి తెలుగు ప్రజలనే కాదు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించి అందరి మన్ననలు పొందారు. రాజమౌళి సినిమా అంటే అభిమానం చూపించేలా తన మార్కును క్రియేట్ చేసుకున్నారు. అది RRRతో మరింత నిజమైంది. దీంతో అభిమానులు ‘బాహుబలి 2’ను గనుక రిలీజ్ చేస్తే ‘ఆర్ఆర్ఆర్‌’ తరహాలోనే ఆదరిస్తారనే నమ్మకం చిత్ర యూనిట్ లో ఉంది. కాబట్టి.. ‘బాహుబలి 2’ విజయవంతం అవుతుంది అని అనుకుంటున్నారు. 

Read Also: మాల్దీవుల్లో ప్రభాస్, కృతి సనన్ ఎంగేజ్మెంట్ - ఈ వార్తలు నిజమేనా?

ఇక RRR మూవీ మ‌ల్టీస్టార‌ర్ గా తెర‌కెక్కిన విషయం తెలిసిందే. 2022, మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమాలో స్టార్ హీరోలు తారక్, రాంచ‌ర‌ణ్ ప్రధాన పాత్రల్లో క‌నిపించ‌గా.. వీరికి జోడిగా  హాలీవుడ్ న‌టి ఒలివియా మోర‌స్, బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ న‌టించారు. బాలీవుడ్ యాంగ్రీమ్యాన్ అజ‌య్ దేవ‌గ‌ణ్ ముఖ్య పాత్రలో  క‌నిపించారు. ఈ చిత్రాన్ని డీవివి బ్యాన‌ర్‌పై దాన‌య్య చిత్రాన్ని నిర్మిస్తే.. కీర‌వాణీ సంగీతం అందించారు. మరి ఈ సినిమా మాదిరిగా ‘బాహుబలి 2’ను కూడా విడుదల చేయాలనే రాజమౌళి ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sundeep Kishan : సందీప్ కిషన్‌తో 'మిరాయ్' బ్యూటీ? - 'పవర్ పేట' మూవీ కోసం క్రేజీ పెయిర్
సందీప్ కిషన్‌తో 'మిరాయ్' బ్యూటీ? - 'పవర్ పేట' మూవీ కోసం క్రేజీ పెయిర్
Taapsee Pannu : టాలీవుడ్ ఇండస్ట్రీపై ప్రశంసలు - సౌత్ ఇండస్ట్రీపై ఆరోపణలతో విమర్శలు... హీరోయిన్ తాప్సీ యూటర్న్
టాలీవుడ్ ఇండస్ట్రీపై ప్రశంసలు - సౌత్ ఇండస్ట్రీపై ఆరోపణలతో విమర్శలు... హీరోయిన్ తాప్సీ యూటర్న్
Vijay Deverakonda Rashmika Wedding : విజయ్ దేవరకొండ తాళి కట్టు శుభవేళ... రష్మిక ఎమోషనల్ - బెస్ట్ మూమెంట్ ఫర్ ఎవర్
విజయ్ దేవరకొండ తాళి కట్టు శుభవేళ... రష్మిక ఎమోషనల్ - బెస్ట్ మూమెంట్ ఫర్ ఎవర్
Rashmika And Vijay Deverakonda: పండితులుండరు, వేదమంత్రాలుండవ్.. కొడవ సంప్రదాయంలో వివాహం ఎలా జరుగుతుంది?
పండితులుండరు, వేదమంత్రాలుండవ్.. కొడవ సంప్రదాయంలో వివాహం ఎలా జరుగుతుంది?

వీడియోలు

Khammam house demolitions : ఖమ్మంలో ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఇళ్ల కూల్చివేత | ABP Desam
Vijay Devarakonda Rashmika Wedding Photos | విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి ఫోటోలు ఇవే | ABP Desam
Changes in Team India vs Zimbabwe T20 World Cup | టీమిండియాలో భారీ మార్పులు
Ravi Shastri's Comments on India T20 World Cup 2026 | భారత్ ఓటమిపై రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు
India vs Zimbabwe Batting Lineup T20 World Cup | జింబాబ్వే మ్యాచ్‌లో సంజూ శాంసన్ ఎంట్రీ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavitha Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.. నెక్ట్స్ ఏంటీ?
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.. నెక్ట్స్ ఏంటీ?
Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట.. క్లీన్ చిట్ రాగానే మాజీ సీఎం కన్నీళ్లు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట.. క్లీన్ చిట్ రాగానే మాజీ సీఎం కన్నీళ్లు!
Rajyasabha election: తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
Taapsee Pannu : టాలీవుడ్ ఇండస్ట్రీపై ప్రశంసలు - సౌత్ ఇండస్ట్రీపై ఆరోపణలతో విమర్శలు... హీరోయిన్ తాప్సీ యూటర్న్
టాలీవుడ్ ఇండస్ట్రీపై ప్రశంసలు - సౌత్ ఇండస్ట్రీపై ఆరోపణలతో విమర్శలు... హీరోయిన్ తాప్సీ యూటర్న్
TDP Communal Politics: రూటు మార్చిన చంద్రబాబు, పవన్ - మత రాజకీయాలకే ప్రాధాన్యం - జగన్‌ను ఎదుర్కోవడానికి తప్పడం లేదా?
రూటు మార్చిన చంద్రబాబు, పవన్ - మత రాజకీయాలకే ప్రాధాన్యం - జగన్‌ను ఎదుర్కోవడానికి తప్పడం లేదా?
ABP Ideas of India Summit 2026: గత ఏడాది ఎన్నో యుద్ధాలు జరిగాయి, భారత్ ఎప్పుడూ యుద్ధాలు కోరుకోదు: ABP చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
గత ఏడాది ఎన్నో యుద్ధాలు జరిగాయి, భారత్ ఎప్పుడూ యుద్ధాలు కోరుకోదు: ABP చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
Assam Assembly Elections 2026: అస్సాంలో కాంగ్రెస్ పతనాన్ని శాసించింది హిమంతనే - ఒకప్పటి రాహుల్ స్నేహితుడు - బిస్కెట్ వల్లే బీజేపీలోకి!
అస్సాంలో కాంగ్రెస్ పతనాన్ని శాసించింది హిమంతనే - ఒకప్పటి రాహుల్ స్నేహితుడు - బిస్కెట్ వల్లే బీజేపీలోకి!
OTT Releases : హారర్ థ్రిల్లర్ 'హనీ' To లెస్బియన్ లవ్ కాన్సెప్ట్ 'అక్యూజ్డ్' - ఒకే రోజు ఓటీటీల్లో 11 మూవీస్... కంప్లీట్ లిస్ట్
హారర్ థ్రిల్లర్ 'హనీ' To లెస్బియన్ లవ్ కాన్సెప్ట్ 'అక్యూజ్డ్' - ఒకే రోజు ఓటీటీల్లో 11 మూవీస్... కంప్లీట్ లిస్ట్
Embed widget