అన్వేషించండి

Avatar 2 Ticket Prices: అయ్య బాబోయ్, ‘అవతార్-2’ టికెట్లు అంత ఖరీదా? ధర తెలిస్తే ‘సినిమా’ కనిపిస్తాది!

ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న సినిమా ‘అవతార్‘. ఈ చిత్రానికి సీక్వెల్ గా అవతార్-2 రాబోతుంది. అయితే, ఈ సినిమా టికెట్ల ధర చూసి ఆడియెన్స్ షాక్ అవుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా అవతార్-2. దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ సినిమా ప్ డిసెంబర్ 16న విడుదల కాబోతోంది. 13 సంవత్సరాల క్రితం విడుదలైన ‘అవతార్’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ విజువల్ వండర్ గా నిలిచింది. సినిమాపై ఓ రేంజిలో అంచనాలు ఉన్నాయి.    

భారత్ లో 7 భాషల్లో విడుదల

ఇక భారత్ లో ఈ సినిమా ఇంగ్లీష్ తో పాటు 7 భాషల్లో విడుదల కాబోతోంది.  అంతేకాదు, ఐమ్యాక్స్‌ 3డీ, 4డీఎక్స్‌ 3డీ ఫార్మాట్‌ లలో ఈ మూవీ విడుదల కాబోతోంది. ఆ స్క్రీన్‌ మీదే చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. అటు ఈ చిత్రానికి సంబంధించి దేశవ్యాప్తంగా టికెట్స్ బుకింగ్ ఇప్పటికే మొదలయ్యాయి. పలు టికెట్ బుకింగ్ సైట్స్, యాప్స్ లో టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, అవతార్-2 సినిమా టికెట్ల ధరలు చూసి సినీ లవర్స్ షాక్ అవుతున్నారు. 

టికెట్స్ ధర చూసి షాక్ అవుతున్న ఆడియెన్స్

బెంగళూరులోని ఐమ్యాక్స్‌ 3డీ ఫార్మాట్‌ కలిగిన థియేటర్‌ లో టికెట్‌ ధర ఏకంగా రూ.1,450గా ఉన్నట్లు టికెట్ బుకింగ్ సైట్స్ చూపిస్తున్నాయి.  పుణెలో రూ.1200, ఢిల్లీలో రూ.1000గా ధర పలుకుతోంది. ముంబైలో రూ.970, కోల్‌కతా రూ.770, అహ్మదాబాద్‌ రూ.750, ఇండోర్‌ రూ.700 ఉండగా, హైదరాబాద్‌లో ఒక్కో టికెట్‌ ధర రూ.350 ఉంది. విశాఖలో రూ.210గా నిర్ణయించారు. అయితే ఈ ధరలు కేవలం సీట్లకు మాత్రమే. వీటికి ఇతరత్రా పన్నులు తోడైతే ఈ రేటు మరింత పెరిగే అవకాశం ఉంది.  

2009లో ‘అవతార్‘ సంచలన విజయం

2009లో ‘అవతార్’ సినిమా విడుదల అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. దర్శకుడు కామెరూన్ హై ఎండ్ టెక్నాలజీతో అవతార్ యూనివర్స్ లో ఈ అండర్ వాటర్ అడ్వెంచర్ మూవీని రూపొందించారు. కామెరూన్ తెరకెక్కించిన సినిమాలు ఇంత వరకు ఎన్నడూ పరాజయాన్ని చవిచూడలేదు. సైన్స్ ఫిక్షన్ సినిమాగా వచ్చిన ‘అవతార్’ వస్సూళ్లలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఇప్పుడు 'అవతార్ 2' పైనా అంచనాలు ఏ మాత్రం తగ్గలేదు.  250 మిలియన్ డాలర్ల బడ్జెట్ తో రూపొందించారు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.2,026 కోట్లు.

ఆకట్టుకుంటున్న ‘అవతార్-2‘ ట్రైలర్

3 గంటల 10 నిమిషాల రన్ టైమ్ ఉన్న అవతార్-2 సినిమా డిసెంబర్ 16 న దేశ వ్యాప్తంగా 3 వేలకు పైగా స్క్రీన్స్ పై రిలీజ్ కాబోతోంది. తాజాగా విడుదలైన ‘అవతార్-2’ ట్రైలర్‌ ఆడియెన్స్ ను ఎంతో ఆకట్టుకుంటోంది. జేక్‌ సల్లీ, నెయ్‌తిరి తమ పిల్లలకి నీటిలో డ్రాగన్ పై ఎలా స్వారీ చేయాలో నేర్పుతుంటారు. అటు మరోసారి తమపైకి దండిత్తె వచ్చే మానవులను ఎలా ఎదుర్కొన్నారో చూపించే ప్రయత్నం చేశారు కామెరూన్, నీటి లోపలి పండోరా ప్రపంచాన్ని అద్భుతంగా చూపించబోతున్నారు. ఈ సినిమాలో సామ్‌ వర్దింగ్టన్‌, జోయా సాల్దానా, సిగుర్నే వీవర్‌, కేట్‌ విన్స్‌లెట్‌ ముఖ్య పాత్రల్లో నటించారు.

Read Also: కమల్ హాసన్‌కు అస్వస్థత, హైదరాబాద్ నుంచి వెళ్లగానే హాస్పిటల్‌కు తరలింపు!

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today July 7th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: సూసైడ్ చేసుకున్న వల్లీ! గృహహింస కేసు పెడతానని బెదిరించిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: సూసైడ్ చేసుకున్న వల్లీ! గృహహింస కేసు పెడతానని బెదిరించిన భాగ్యం!
Keerthi Bhat: రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తం.. విషాదాలను ఎదిరించి బుల్లితెర స్టార్‌గా... 'ట్రూ ఫైటర్' కీర్తి భట్ రియల్ లైఫ్ విషయాలు
విషాదాలను ఎదిరించి బుల్లితెర స్టార్‌గా... 'ట్రూ ఫైటర్' కీర్తి భట్ రియల్ లైఫ్ విషయాలు
Jagadhatri Serial Today JULY 6th:సిల్కీ కోసం విటుడి వేషం వేసిన కేదార్‌...యువతీ యువకుల కిడ్నాప్ కేసు కొలిక్కి వచ్చేనా..?
జగద్ధాత్రి సీరియల్: సిల్కీ కోసం విటుడి వేషం వేసిన కేదార్‌...యువతీ యువకుల కిడ్నాప్ కేసు కొలిక్కి వచ్చేనా..?
Pritam And Pedro Series OTT : మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?
మొబైల్ యూజ్ చేస్తున్నారా? - లేటెస్ట్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ డోంట్ మిస్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకు నగదు ప్రోత్సాహకాలు.. జనాభా వృద్ధిపై ఏపీ సర్కార్ వ్యూహాత్మక అడుగులు
Vizag Fishermen Missing: సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
సురక్షితంగా తీరానికి చేరుకున్న మత్స్యకారుడు కర్రి చిన్న! మిగతావారి కోసం కొనసాగుతున్న గాలింపు! 
Maharashtra Heavy Rain Red Alert: మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
మహారాష్ట్రను ముంచెత్తుతున్న రుతుపవన ప్రళయం! పుణె ఘాట్లలో కొండచరియలు.. ముంబైలో రెడ్ అలర్ట్!
Sanju Samson Dropped: జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
జింబాబ్వే టూర్ నుంచి సంజూ శాంసన్ ఔట్.. అగార్కర్ సెలెక్షన్ కమిటీ షాకింగ్ డెసిషన్, వైభవ్ సూర్యవంశీకి మళ్లీ లక్కీ ఛాన్స్!
Euro NCAP Report: 5-స్టార్ రేటింగ్ ఉన్నత మాత్రాన సేఫ్‌ కాదట! యూరో NCAP సంచలన రిపోర్ట్! 
5-స్టార్ రేటింగ్ ఉన్నత మాత్రాన సేఫ్‌ కాదట! యూరో NCAP సంచలన రిపోర్ట్! 
Joseph Ravan Remand Report: నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
Bedtime Foods : మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
Embed widget