Arjun Das Tollywood Entry : తెలుగులో అర్జున్ దాస్ ఎంట్రీ - లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్‌రా
'బుట్ట బొమ్మ'తో తెలుగు తెరకు అర్జున్ దాస్ (Arjun Das) పరిచయం అయ్యారు. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉందనేది పక్కన పెడితే... అర్జున్ దాస్ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.
గాయనీ గాయకుల స్వర మాధుర్యానికి అభిమానులు ఉన్నారు. డబ్బింగ్ ఆర్టిస్టులకూ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు కొంత మందికి డబ్బింగ్ చెబుతున్న ఆర్టిస్టులకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది. ఉదాహరణకు... శ్రీనివాస మూర్తి, రవిశంకర్, అయ్యప్ప శర్మ. నటనతో పాటు గొంతుతోనూ అభిమానులను సంపాదించుకున్న ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా? అని టార్చ్ లైట్ వేసి వెతికితే... నటుడు అర్జున్ దాస్ (Arjun Das) పేరు ముందు వరుసలో ఉంటుంది.
షాక్ అయిన ఆడియన్స్...
ఆ గొంతు ఏంట్రా బాబూ!
కార్తీ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ తీసిన 'ఖైదీ' సినిమాతో అర్జున్ దాస్ (Arjun Das First Breakthrough Kaithi Movie) కి తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు లభించింది. అయితే, అంత కంటే ముందు తెలుగులో గోపీచంద్ 'ఆక్సిజన్'లో ఓ క్యారెక్టర్ చేశారు. తమిళంలో రెండు సినిమాలు చేశారు. 'ఖైదీ' విడుదల సమయంలో మీడియా ముందుకు వచ్చినప్పుడు అర్జున్ దాస్ గొంతు విని జనాలు షాక్ అయ్యారు. ఓ అవార్డుల కార్యక్రమంలో అల్లు అర్జున్, రష్మిక సైతం ఒక్కసారి ఆ కంచు కంఠం విని సర్‌ప్రైజ్ అయ్యారు.
'ఖైదీ' తర్వాత 'అంధకారం', 'మాస్టర్', 'విక్రమ్' సినిమాల్లో అర్జున్ దాస్ నటించారు. ఆ సినిమాల్లో క్యారెక్టర్లు ఒక ఎత్తు... లేటెస్టుగా విడుదల అయిన తెలుగు సినిమా 'బుట్ట బొమ్మ'లో క్యారెక్టర్ మరో ఎత్తు.
'బుట్ట బొమ్మ'తో హీరోగా...
'బుట్ట బొమ్మ' సినిమాతో అర్జున్ దాస్ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అర్జున్ దాస్ కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఇన్నాళ్ళూ ఆయనలో విలనిజాన్ని చూసిన తెలుగు ప్రేక్షకులు... 'బుట్ట బొమ్మ'లో విలనీతో కూడిన హీరోయిజాన్ని చూశారు.
'బుట్ట బొమ్మ'లో అర్జున్ దాస్ పోషించిన పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఆ షేడ్స్ ను ఆయన చక్కగా చూపించారు. అతడిలో విలన్ కాదు, మాంచి హీరో మెటీరియల్ ఉందని ఈ సినిమా ప్రూవ్ చేసింది.
'బుట్ట బొమ్మ' సెండాఫ్ నిలబెట్టిన అర్జున్ దాస్
'బుట్ట బొమ్మ'లోని నటీనటుల్లో స్టార్ ఎవరు? అంటే అర్జున్ దాస్ పేరు చెప్పాలి. ఇతర నటీనటులు ఇంతకు ముందు సినిమాలు చేసినప్పటికీ... అతడి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరొకరికి లేదు. ఓవరాల్ సినిమా ఎలా ఉందనేది పక్కన పెడితే... అర్జున్ దాస్ కోసం థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులను ఆయన మెప్పించారు. నిజం చెప్పాలంటే... సినిమా సెకండాఫ్ అర్జున్ దాస్ వల్ల నిలబడింది. ప్రేక్షకులను టెన్షన్ పెడుతూ క్లైమాక్స్ వరకు సినిమాను నడపడంలో అతడి ఇమేజ్ హెల్ప్ అయ్యింది. విమర్శకులతో పాటు అభిమానుల నుంచి అర్జున్ దాస్ పోషించిన ఆర్కే పాత్రకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
పాన్ ఇండియా రూటులో అర్జున్ దాస్
ఇప్పుడు అర్జున్ దాస్ తెలుగు, తమిళ సినిమాలకు పరిమితం కావడం లేదు. పాన్ ఇండియా రూటులో ఉన్నారు. మలయాళ హిట్ 'అంగమలై డైరీస్' హిందీ రీమేక్ చేస్తున్నారు. తమిళ సినిమాలతో పాటు ఓ మలయాళ సినిమా చేస్తున్నారు.
Also Read : 'పోకిరి', 'బాహుబలి 2' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
కమల్ హాసన్ 'విక్రమ్'లో అర్జున్ దాస్ కనిపించినది కాసేపే అయినప్పటికీ... రెస్పాన్స్ బావుంది. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో అర్జున్ దాస్ ఉంటాడనేది క్లారిటీ వచ్చింది. 'విక్రమ్' సీక్వెల్... సూర్య రోలెక్స్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందే సినిమాల్లోనూ అర్జున్ దాస్ క్యారెక్టర్ లేకుండా ఉండదు. అందువల్ల, ఈ సినిమాలు అన్నీ విడుదల అయితే అతడు ఇంకా పెద్ద స్టార్ అవుతాడని చెప్పవచ్చు.
Also Read : ముగిసిన వాణీ జయరామ్ అంత్యక్రియలు - మృతిపై మిస్టరీ గుట్టువిప్పే పనిలో పోలీసులు