అన్వేషించండి

పిక్చర్ అభి బాకీ హై, నాగ్-చిరు చెరోదారి? మహేష్ బాబు నిర్ణయంపై నరేష్ అసంతృప్తి?

టాలీవుడ్ టికెట్ల సమస్యకు ‘శుభం’ కార్డు పడినట్లేనా? పరిస్థితులు చూస్తుంటే.. ఇది వెబ్ సీరిస్‌లా కొనసాగేలాగే ఉంది. ఈ విషయంలో సినీ పెద్దలు ఎందుకు చెరోదారిలో వెళ్తున్నారు?

Tollywood Ticket Issue | ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలు తగ్గింపు టాలీవుడ్ నిర్మాతలకు గుదిబండలా మారిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి తమ కష్టాలు చెప్పుకుని సానుకూల నిర్ణయం పొందాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని గురించి ఇప్పటివరకు చిరంజీవి మాత్రమే చొరవ చూపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పేందుకు చాలా నెలల నుంచి వేచి చూస్తు్న్నారు. ఎట్టకేలకు ఆ అవకాశం రావడంతో చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, దర్శకులు కొరటాల శివ, రాజమౌళి తదితరులంతా సీఎంను కలిసి సమస్యలు వెల్లడించారు. అయితే, అక్కడి కథ సుఖాతం అవుతుందని భావిస్తున్న తరుణంలో.. టాలీవుడ్‌కు చెందిన మరో వర్గం.. అప్పుడే ‘శుభం’ కార్డు పడితే కిక్కు ఏముంటుంది. కథా ఇంకా ఉందంటూ పరిస్థితిని మళ్లీ మొదటికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

మొదటి నుంచి మొద్దు నిద్ర: ‘మా’ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఈ విషయంపై తీవ్ర ఆగ్రహాన్నే వ్యక్తం చేశారు. మంచు మోహన్ బాబు ఫ్యామిలీని కూడా ఇందులోకి లాగారు. అయితే, టాలీవుడ్ మొత్తం ఏకమై పవన్ కళ్యాణ్ ఏకాకిని చేశారు. ఆయన తప్పు చేశారన్నట్లుగా నిర్మాతలు సైతం ఆయన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని తప్పించుకున్నారు. పోనీ, వీరు సీఎంను కలిసి ఏమైనా సాధించారా అంటే అదీ లేదు. పవన్ వ్యాఖ్యల తర్వాత దిల్ రాజు తదితర నిర్మాతలు వెళ్లి మంత్రులను కలిసినా సానుకూల నిర్ణయం రాలేదు. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున టీమ్ సీఎంను కలుస్తారనే వార్తలు వచ్చినా.. అది సాధ్యం కాలేదు. అయితే, మొదటి నుంచి చిరంజీవి మాత్రమే పట్టువీడని విక్రమార్కుడిలా సీఎం జగన్‌ను కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టకేలకు సీఎం అపాయింట్మెంట్ సాధించారు. ప్రభుత్వాన్ని కదిలించగలిగారు. అయితే, చిరు చేసిన ప్రయత్నాన్ని ఫిల్మ్ చాంబర్ పెద్దలుగానీ, తోటి టాలీవుడ్ నటులుగానీ స్వాగతించలేదు. పైగా.. తమని సంప్రదించకుండా వెళ్లారని కొందరు, తమని ఆహ్వానించలేదని మరికొందరు అలిగారు. కానీ, ఇది చిరంజీవి సమస్యను పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నమనే విషయాన్ని అంతా మరిచారు. 

పెద్దరికం కోసమేనా?: టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలపై ఇరువురి సీఎంలతో కూర్చొని మాట్లాడతామని చెప్పిన మంచు విష్ణు.. ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇటీవల మోహన్ బాబు కూడా ఓ బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ‘‘ఎంతోమంది జీవితాల‌తో ముడిప‌డి ఉన్న ఈ సినిమా ఇండ‌స్ట్రీ గురించి, మ‌నుకున్న స‌మ‌స్యల గురించి సీఎంల‌కు వివ‌రించాల‌నుకుంటే అంద‌రూ క‌లిసి ఒక‌చోట సమావేశం కావాలి. సమస్యలేమిటీ? పరిష్కారం ఏంటి? ఏది చేస్తే సినీ పరిశ్రమకు మ‌నుగ‌డ ఉంటుంద‌ని చ‌ర్చించుకోవాలి. ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలి. ఇండ‌స్ట్రీకి దేవుళ్లయిన నిర్మాత‌లు ఇప్పుడు ఎక్కడున్నారు? సినీ పరిశ్రమ ఏ ఒక్కరి గుత్తాదిప‌త్యం కాదు’’ అని స్పష్టం చేశారు. అయితే, ఆ దిశగా ఎలాంటి చర్యలు జరగలేదు. ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు కూడా చొరవ చూపలేదు. ఇలాంటి తరుణంలో చిరంజీవే ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వం కూడా ఆయనకే ప్రాధాన్యం ఇచ్చింది. రాజమౌళి కూడా ఈ విషయాన్నే చెప్పారు. సీని పరిశ్రమ సందిగ్ధంలో ఉన్న సమయంలో చిరంజీవి పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్లారు. ఆయనకు ఇష్టం ఉండదు కానీ, ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి నిరూపించుకున్నారు’’ అని అన్నారు. మహేష్ బాబు, ప్రభాస్ సైతం చిరంజీవిని పెద్ద దిక్కుగా అభివర్ణించారు. ఇదే ఇప్పుడు సమస్యగా మారింది. 

మహేష్ బాబు నిర్ణయానికి నరేష్ మద్దతు ఉంటుందా?: వీకే నరేష్, మహేష్ బాబు ఒకే కుటుంబానికి చెందిన వారనే సంగతి తెలిసిందే. ఒకే కుటుంబమైనా గమ్యాలు వేరు కావచ్చు. అయితే, మహేష్ బాబు సాధారణంగా పెద్దరికాన్ని ఇష్టపడడు. సీఎంలతో భేటీ వంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. కానీ, ఆయనే స్వయంగా చిరంజీవితో కలిసి సమస్య పరిష్కారం కోసం వెళ్లడం చాలామంది ఆశ్చర్యపరిచింది. మంచు వర్గానికి మద్దుతుగా ఉన్న వీకే నరేష్‌ ఎలా స్పందిస్తారనే ఆశక్తి నెలకొంది. అయితే, చిరంజీవి అలా సీఎంను కలిసి వచ్చారో లేదో.. తర్వాతి రోజు నుంచే రాజకీయాలు మొదలయ్యాయి. మంచు ఫ్యామిలీ.. మంత్రి పేర్ని నానిని ఇంటికి పిలిచి మరీ సన్మానించారు. చిరంజీవి తనని ఆహ్వానించలేదని ఆయనకు చెప్పారు. పెర్నీని తన ఇంట్లో సన్మానించామంటూ మంచు విష్ణు వదిలిన ట్వీట్లపై ట్రోల్స్ కూడా వచ్చాయి. ‘‘మేం తలచుకుంటే ప్రభుత్వమే మా ఇంటికి వస్తుంది’’ అని చెప్పడానికే ఇలా చేశారా అని నెటిజనులు విమర్శించారు. సమస్యల పరిష్కారానికి మీరెందుకు ప్రయత్నించడంలేదని విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నరేష్ శనివారం చేసిన ట్వీట్ చర్చనీయమైంది. సీఎంను కలవడాన్ని ఆయన స్వాగతించారు. అలాగే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ (TFI) ఐక్యత చాటేలా ప్రభుత్వం, ప్రజల గౌరవాన్ని పొందేలా ఫిల్మ్ చాంబర్ వర్క్ షాప్ నిర్వహించి సమస్యలు, పరిష్కారాలు, తీర్మానాలపై చర్చించాలని పిలుపునిచ్చారు. కానీ, ఫిల్మ్ చాంబర్ నరేష్ పిలుపుకు స్పందిస్తుందో లేదో డౌటే. అయితే, మహేష్ బాబు.. చిరంజీవితో కలిసి వెళ్లినందుకు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మరి నరేష్, మహేష్‌కు మద్దతుగా ఉంటారా లేదా మంచు విష్ణు వెనుకాల కృష్ణుడిలా ఉంటారా అని సోషల్ మీడియాలో చర్చ నెలకొంది. 

నాగార్జున ఎందుకు హాజరు కాలేదు?: సాధారణంగా ఈ మీటింగ్‌‌కు చిరంజీవి, నాగార్జునలనే పెద్దలుగా వ్యవహరిస్తారని భావించారు. కానీ, మహేష్ బాబు, ప్రభాస్‌లు చిరంజీవితో వెళ్లి ఆశ్చర్యపరిచారు. త్వరలో చిరంజీవి చిత్రం ‘ఆచార్య’, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, ప్రభాస్‌ నటించిన ‘రాధేశ్యామ్’, దర్శకుడు రాజమౌళీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ వంటి భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అందుకే వారు ఆ చిరుతో కలిసి వెళ్లారని తెలుస్తోంది. అయితే, దీనికి నిర్మాతలు వెళ్తే సరిపోతుంది కదా అనే ప్రశ్నలు కూడా వెలువడుతున్నాయి. నిర్మాతల కంటే ఎక్కువ ఫేమ్ నటులకే ఉంటుంది. వారు వెళ్తే అభిమానుల మద్దతు కూడా ఉంటుంది. దీంతో ఈ సమావేశాన్ని చాలామంది వ్యక్తిగత భేటీగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నాగార్జున విషయానికి వస్తే.. ఇప్పటికే ఏపీలో టికెట్ ధరల తగ్గింపుపై ఆయన తన నిర్ణయాన్ని చెప్పారు. తన ‘బంగార్రాజు’ చిత్రానికి ఎలాంటి నష్టం ఉండబోదని స్పష్టం చేశారు. దీంతో నాగ్ కంటే ఎక్కువ అవసరం చిరంజీవికే ఉందని అంటున్నారు. అయితే, ఈ భేటీకి నాగ్ రాకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. అమలకు కరోనా పాజిటీవ్ రావడం వల్ల నాగ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. ఏపీ టికెట్ల విషయంలో చిన్న నిర్మాతలు ధీమాగానే ఉన్నారు. కేవలం పెద్ద నిర్మాతలకే ఎక్కువ టెన్షన్. నాగార్జున ఎలాగో చిన్న సినిమాలో నిర్మిస్తారు. ఆ చిత్రాలకు ఓటీటీలకు కూడా మాంచి డిమాండ్ ఉంటుంది. పెద్ద చిత్రాలకూ డిమాండ్ ఎక్కువే ఉన్నా.. థియేటర్ల ద్వారానే ఎక్కువ సంపాదించగలరు. ఆ తర్వాత ఓటీటీ హక్కులను విక్రయించడం ద్వారా అదనపు లాభం పొందుతారు. కాబట్టి.. ఈ విషయంలో నాగార్జున ఇండస్ట్రీకి మాత్రమే మద్దతుగా ఉండగలరు. ఆయనకు వ్యక్తిగతంగా దీని వల్ల నష్టం ఉండదు. నష్టమల్లా పెద్ద నిర్మాతలకే. అందుకే.. ఈ విషయంలో నాగ్ కూల్‌గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో చిరు, నాగ్‌ల దారులు వేర్వేరని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. వాస్తవానికి.. తెలుగు సినీ పరిశ్రమ సమస్యల గురించి ముందుగా సమావేశమైంది నాగ్-చిరంజీవే. కాబట్టి.. వారు చెరోదారిలో వెళ్తున్నారని చెప్పలేం. చిరంజీవి టీమ్ విన్నపాలపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ఉత్తర్వులు రాలేదు. ఈ లోపు ఇంకా ఏమేమి జరుగుతాయో ఊహాతీతం. కాబట్టి.. శుభం కార్డు పడేందుకు ఇంకా టైమ్ ఉంది. పిక్చర్ అభి బాకీ హై!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget