అన్వేషించండి

Anushka Shetty: అనుష్క ‘17 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’, షూటింగ్ సెట్లోనే వేడుకలు

తెలుగువారికి ఇష్టమైన హీరోయిన్లలో అనుష్కది మొదటి స్థానమే.

తెలుగులో పొడుగైన హీరోయిన్లు ఎవరంటే మొదట గుర్తొచ్చే పేరు అనుష్కదే. ముఖ్యంగా ప్రభాష్ - అనుష్క జంట అంటే అభిమానులకు కనుల పంటే. తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టి నేటితో 17 ఏళ్లు పూర్తి చేసుకుంది అనుష్క శెట్టి. ఈ సందర్భంగా తన ఆనందన్ని అభిమానులతో పంచుకుంది. స్వీటీ పదిహేడేళ్ల వేడుకను షూటింగ్ సెట్లో ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం అనుష్క నవీన్ పోలిశెట్టితో కలిసి యూవీ క్రియేషన్ బ్యానర్ పై ఓ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ సెట్లోనే ఆమె పదిహేడేళ్ల ఇండస్ట్రీ ప్రయాణాన్ని సెలెబ్రేట్ చేశారు. అనుష్క చేత కేక్ కట్ చేయించారు. ఆ ఫోటోలను పోస్టు చేసిన అనుష్క తన ఆనందాన్ని అక్షరాల రూపంలో రాసుకొచ్చింది‘17 ఏళ్ల నుంచి నాకు సినిమా ఇండస్ట్రీల నుంచి, కుటుంబం నుంచి, అభిమానుల నుంచి అందుతున్న మద్దతుకు నా ధన్యవాదాలు. నా జీవితంలో మీరంతా భాగమైనందుకు నా నా హృదయపూర్వక ధన్యవాదాలు. హద్దుల్లేని మీ ప్రేమను వర్ణించేందుకు పదాలు సరిపోవు’ అంటూ ముగించింది. ఆమె కట్ చేసిన ఓ కేకుపై 17 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే కొటేషన్ ను రాయించారు. అనుష్కకు అభిమానులు వెల్లువలా శుభాకాంక్షలు చెబుతున్నారు. 

పొడగరి... సొగసరి...
అనుష్క బెంగుళూరులో యోగా శిక్షకురాలిగా ఉండేది. అనుకోకుండా నాగార్జున నటించిన సూపర్ చిత్రంలో రెండో హీరోయిన్ ఛాన్సు కొట్టేసింది. ఆ సినిమాలో ఆమెను తొలిసారి చూసిన వాళ్లంతా ‘వావ్ ఎవరీ అమ్మాయి?’ అనుకున్నారు. హీరోలతో సమానమైన ఎత్తుతో, సన్నని మల్లెతీగలా ఉంది ఆ సినిమాలో. ఇక విక్రమార్కుడు సినిమాలో ఆమె డ్యాన్సులు జనాలకు విపరీతంగా నచ్చేశాయి. ఆమెను టాప్ హీరోయిన్ గా నిలబెట్టిన సినిమా అయితే ‘అరుంధతి’ అనే చెప్పాలి. అనుష్క కెరీర్ అరుంధతికి ముందు, తరువాత అనేంతగా మారింది. అప్పట్నించి లేడీ ఓరియంటెడ్ మూవీ అనగానే అందరికీ అనుష్కనే గుర్తొచ్చేది. 2005లో టాలీవుడ్ లో అడుగుపెట్టిన అనుష్క వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాకుండా కెరీర్ సాగుతోంది. ఇక ఆమె కెరీర్ లో బాహుబలి సినిమా అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చి పెట్టింది. ఆమె కెరీర్లో 2005 నుంచి 2020 వరకు వరుస పెట్టి ప్రతి ఏడాది రెండుకి మించి ఆమె సినిమాలు విడుదలయ్యేవి. 2010లో అయితే ఏకంగా 8 సినిమాలు విడుదలయ్యాయి. అయితే 2021లో మాత్రం బ్రేక్ తీసుకుంది అనుష్క. ఆ ఏడాది ఒక్కసినిమా కూడా విడుదల కాలేదు.2020లో విడుదలైన నిశ్శబ్ధం మూవీనే చివరిది. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Oscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక
ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక
Anand Deverakonda : 90s ఫేవరెట్ అమృతం సాంగ్‌తో బర్త్ డే విషెష్ - ఆనంద్ దేవరకొండకు స్పెషల్ 'ఎపిక్'
90s ఫేవరెట్ అమృతం సాంగ్‌తో బర్త్ డే విషెష్ - ఆనంద్ దేవరకొండకు స్పెషల్ 'ఎపిక్'
Singer Chinmayi Sripada : పవన్‌ కల్యాణ్‌కు అతని గురించి ఏమీ తెలియదు - సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్
పవన్‌ కల్యాణ్‌కు అతని గురించి ఏమీ తెలియదు - సింగర్ చిన్మయి ట్వీట్ వైరల్
Chinmayi Sripada: మన మగాళ్ళ డీఎన్ఏలో రేప్ కల్చర్ ఉంది... వైరముత్తు & త్రిష ఇష్యూలో చిన్మయి సంచలన వ్యాఖ్యలు
మన మగాళ్ళ డీఎన్ఏలో రేప్ కల్చర్ ఉంది... వైరముత్తు & త్రిష ఇష్యూలో చిన్మయి సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget