అన్వేషించండి

Animal: ‘యానిమల్’ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్ - సినిమా పోస్ట్‌పోన్ చేసిన నిర్మాతలు!

రణబీర్ కపూర్ ‘యానిమల్’ మూవీను ఆగస్టు 11 న విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు మేకర్స్. త్వరలో కొత్త డేట్ ను ప్రకటించనున్నారు.

Animal: బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తోన్న మూవీ ‘యానిమల్’. మూవీ లవర్స్ మోస్ట్ అవైటెడ్ సినిమాలలో ఇది కూడా ఒకటి. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ మూవీను ఆగస్టు 11 న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే ‘యానిమల్’ లవర్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది మూవీ టీమ్. గతంలో ఇచ్చిన మూవీ డేట్ ను క్యాన్సిల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రణబీర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి.

త్వరలో కొత్త రిలీజ్ డేట్..

ఈ ఏడాది విడుదల అయ్యే సినిమాలలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సినిమాలలో ‘యానిమల్’ సినిమా కూడా ఒకటి. ఈ మూవీలో రణబీర్ కపూర్ ను సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకూ విడుదల అయిన ప్రచార చిత్రాలు చూస్తే అది క్లియర్ గా అర్థమవుతుంది. ఈ సినిమా విడుదల పట్ల రణబీర్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ను వాయిదా వేయడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘యానిమల్’ మూవీను ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేస్తారు అనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే దీనిపై మూవీ టీమ్ కు కూడా స్పష్టత లేనట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే డిసెంబర్ లోనే ఈ సినిమా విడుదల కావచ్చు లేదా ఇంకా లేట్ అవ్వొచ్చు అనే చర్చ నడుస్తోంది. ఇదే విషయం పై మూవీ టీమ్ గత కొన్ని రోజులుగా చర్చలు జరుపుతోంది. అనేక మీటింగ్ లు తర్వాత మూవీను వాయిదా వేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తదుపరి విడుదల తేదీ ఏంటి అనేది త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. అయితే ఆగస్టు నెలలో నాలుగు పెద్ద సినిమాలు కూడా విడుదల కానున్నాయి. ‘గదర్ 2: ది కథా కంటిన్యూస్’, ‘OMG 2’, ‘జైలర్’, ‘భోలా శంకర్’ సినిమాలు ఉన్నాయి.

పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ‘యానిమల్’..

‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తోన్న మూవీయే ఈ ‘యానిమల్’. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ కథపై ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఇది ఒక పవర్‌ ఫుల్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌ తో కూడిన కథ అని చెప్తున్నారు. ఇందులో యాక్షన్‌, రొమాన్స్‌, ప్రతీకారం, డ్రామా, థ్రిల్‌, సంగీతం ఇలా అంశాలు కలిసి ఉంటాయని టాక్. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్‌, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా చేస్తుంది.  ఈ సినిమాను భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని కలసి నిర్మిస్తున్నారు.

Also Read: ‘యాత్ర 2’ని ప్రకటించిన మహి వి రాఘవ్ - టాప్ క్లాస్ టెక్నీషియన్లతో - రిలీజ్ ఎప్పుడంటే?

టాప్ హెడ్ లైన్స్

Jana Nayagan Twitter Review - 'జన నాయగన్' ట్విట్టర్ రివ్యూ: Tamil Nadu CM విజయ్ సినిమా హిట్టా? ఫట్టా? సోషల్ మీడియా టాకేంటి?
'జన నాయగన్' ట్విట్టర్ రివ్యూ: Tamil Nadu CM విజయ్ సినిమా హిట్టా? ఫట్టా? సోషల్ మీడియా టాకేంటి?
Lahari: చక్రవాకం, మొగలిరేకులు హీరోయిన్.. చైల్డ్ ఆర్టిస్ట్ టూ లగ్జరీ లైఫ్.. లహరి అన్ టోల్డ్ స్టోరీ!
చక్రవాకం, మొగలిరేకులు హీరోయిన్.. చైల్డ్ ఆర్టిస్ట్ టూ లగ్జరీ లైఫ్.. లహరి అన్ టోల్డ్ స్టోరీ!
Jagadhatri Serial Today JULY 22th: అడవి నుంచి తప్పించుకున్న మీనన్‌....జేడీ టీంలోకి కొత్తగా వచ్చిన సింధూ
జగద్ధాత్రి సీరియల్: అడవి నుంచి తప్పించుకున్న మీనన్‌....జేడీ టీంలోకి కొత్తగా వచ్చిన సింధూ
Imtiaz Ali Visits Hyderabad: హైదరాబాద్‌లో ఇంతియాజ్ అలీ... అభిమానులతో కలిసి 'మై వాపస్ ఆవుంగా' విజయోత్సవం
హైదరాబాద్‌లో ఇంతియాజ్ అలీ... అభిమానులతో కలిసి 'మై వాపస్ ఆవుంగా' విజయోత్సవం

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget